కల్తీ కల్లు మాఫియా! | Adulterate toddy mafia! | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు మాఫియా!

Published Sat, Aug 16 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

కల్తీ కల్లు మాఫియా!

కల్తీ కల్లు మాఫియా!

పొద్దంతా కష్టం చేసిన పల్లె జనం.. పొద్దుగూకిన వేళ ఇంత కల్లుతాగి కంటి నిండా నిద్రపోతారు. వెనుకటికి తల్లి లేని బిడ్డకు కల్లే తల్లై సాకింది. బొడ్డు గురిగిలో కల్లు పోసి చంటిబిడ్డ నోట్లో పెడితే తల్లిపాల వలే తాగి బతికేది. కల్లు అంత స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడా కల్లు సీసాల్లోకి ‘ఖల్ నాయకులు’ చొరబడ్డారు. కల్లును కల్తీ చేశారు. గీత కార్మికులను భయపెట్టి, ఎదురుతిరిగిన వారిని మట్టుబెట్టి దర్జాగా కల్లు సొసైటీలను కబ్జా చేశారు. ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరో హైడ్రెట్ తదితర నిషేధిత మత్తు రసాయనాలను కలిపి ‘కృత్రిమ కల్లు’ సృష్టించారు.

ఎక్సైజ్ అధికారుల అండతో జనం మీదకు వదిలారు. ఇప్పుడు కల్లు తాగే అలవాటున్న జనం ఒళ్లంతా విషమే. ఒక్క పూట కల్లు లేకుంటే పిచ్చిపట్టి చచ్చిపోయే స్థాయికి దిగజారిపోయారు. ఏళ్లకేళ్లుగా మెతుకుసీమలో జనం అలవాటుతో వ్యాపారం చేస్తున్న  ‘కల్తీ కల్లు మాఫియా’పై ‘సాక్షి’ పరిశీలనాత్మక వరుస కథనాలు రేపటినుంచి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement