కట్టేసి వైద్యం చేస్తున్నారు | strange behavior for kallu | Sakshi
Sakshi News home page

కట్టేసి వైద్యం చేస్తున్నారు

Published Sun, Sep 13 2015 4:25 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

కట్టేసి వైద్యం చేస్తున్నారు - Sakshi

కట్టేసి వైద్యం చేస్తున్నారు

కల్తీ కల్లు లేక వింత ప్రవర్తనతో పదుల సంఖ్యలో బాధితులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎక్సైజ్ శాఖ విస్తృత దాడుల వల్ల కల్లులో కలిపే డైజిపామ్ అనే మందును వ్యాపారులు కలపటం మానేశారు. దీంతో డైజిపామ్ కల్లుకు అలవాటు పడిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు.

కల్తీ కల్లు లేక వింత ప్రవర్తనతో పదుల సంఖ్యలో బాధితులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎక్సైజ్ శాఖ విస్తృత దాడుల వల్ల కల్లులో కలిపే డైజిపామ్ అనే మందును వ్యాపారులు కలపటం మానేశారు. దీంతో డైజిపామ్ కల్లుకు అలవాటు పడిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు సుమారు 56 మంది నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వీరిలో నిజామాబాద్ పట్టణం, నవీపేట, బోధన్, ఎడపల్లి తదితర ప్రాంతాల వారు ఉన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, వింతగా ప్రవర్తిస్తుండడం.. జనంపై దాడికి ప్రయత్నిస్తుండడంతో రోగుల కాళ్లు చేతులు కట్టేసి.. వైద్యం చేస్తున్నారు. వీరిలో నలుగురికి ఫిట్స్ కూడా వచ్చాయని వైదులు తెలిపారు. డైజిపామ్‌కు అలవాటు పడటం వల్లే బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారని వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement