
ఏలూరు టౌన్: తన విపరీత ధోరణితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించే ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో వందలాది మందితో లోనికి వెళ్లి వైద్య సేవలకు తీవ్ర అసౌకర్యం కలిగించారు.
ఐసీయూలోకి ఏకంగా తోపుడు బండ్లపై మామిడి పండ్లను తీసుకెళ్లి రోగులకు పంచే కార్యక్రమం చేపట్టడంతో సిబ్బంది, రోగుల బంధువులు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని చింతమనేని తనదైన శైలిలో రెచ్చిపోయారు.
బ్యాక్టీరియా, వైరస్‌లు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించే ఐసీయూలోకి తోపుడు బండ్లు తీసుకుని వెళ్లడంపై వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరుతో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు వేసుకుని మరీ ఆస్పత్రిలో హడావుడి చేయడంపై వైద్యులు, రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు
Comments
Please login to add a commentAdd a comment