strange behavior
-
చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు..
ఏలూరు టౌన్: తన విపరీత ధోరణితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించే ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో వందలాది మందితో లోనికి వెళ్లి వైద్య సేవలకు తీవ్ర అసౌకర్యం కలిగించారు. ఐసీయూలోకి ఏకంగా తోపుడు బండ్లపై మామిడి పండ్లను తీసుకెళ్లి రోగులకు పంచే కార్యక్రమం చేపట్టడంతో సిబ్బంది, రోగుల బంధువులు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని చింతమనేని తనదైన శైలిలో రెచ్చిపోయారు. బ్యాక్టీరియా, వైరస్లు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు పాటించే ఐసీయూలోకి తోపుడు బండ్లు తీసుకుని వెళ్లడంపై వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరుతో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు వేసుకుని మరీ ఆస్పత్రిలో హడావుడి చేయడంపై వైద్యులు, రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు -
Viral Video: స్కూల్లో విద్యార్థుల వింత ప్రవర్తన.. అసలేం జరిగింది?
ఉత్తరాఖండ్: స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా ఏడుపులు మొదలు పెట్టారు. క్లాస్ రూం నుంచి బయటకు వచ్చి అరుపులు, కేకలతో హడలెత్తించారు. విద్యార్థుల వింత ప్రవర్తనతో టీచర్లు ఆందోళన చెందారు. దుష్ట శక్తులు ఆవహించాయంటూ దిష్టి తీశారు. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన వీడియోను ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్.. ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే డాక్టర్ల బృందాన్ని పంపించింది. వింత ప్రవర్తనను మాస్ హిస్టీరియాగా వైద్యులు భావిస్తున్నారు. -
కడుపులో శిశువు మాయమైందని..
సాక్షి, మానవపాడు (గద్వాల): కడుపులోని శిశువు మాయమైందని మండలంలోని చిన్నపోతులపాడుకు చెందిన ఓ మహిళ ఆదివారం స్థానిక పీహెచ్సీ వద్ద కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మంజుల తాను నిండు గర్భిణినని.. ప్రసవం కోసం శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మానవపాడు పీహెచ్‌సీకి వస్తుండగా దేవుడు కలలోకి వచ్చి ఇంటికి వెళ్లాలని సూచించటంతో తిరిగి వెళ్లాలని చెబుతోంది. ఆదివారం ఉదయం లేచేసరికి ఎలాంటి గర్భం లేదని, దీంతో తిరిగి ఆస్పతికి వచ్చానని తెలిపింది. పరీక్షించిన వైద్యులు నెల క్రితమే అబార్షన్ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయమై వైద్యురాలు దివ్య మాట్లాడుతూ.. ఆ మహిళ చెప్పేది అవాస్తవమని అన్నారు. ఆమెకు మతిస్థిమితం తప్పినట్లుందని మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో సైకలాజికల్ ట్రిట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవసరమైతే స్కానింగ్ తీయించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ సరిత సెల్ఫోన్లో వైద్యులతో మాట్లాడి మెరుగైన మంజులకు చికిత్స అందించాలని కోరారు. అనంతరం మంజుల తల్లిగారి ఊరైన పెద్దపోతులపాడుకు వెళ్లి ఆమెను పరామర్శించారు. జెడ్పీ చైర్పర్సన్ వెంట నాయకులు చిన్న తిరుపతయ్య, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్ ఉన్నారు. -
తమిళనాడులో దూడ వింత ప్రవర్తన
వేలూరు: తమిళనాడులో ఒక దూడ వింతగా ప్రవర్తిస్తోంది. మనిషి గుణాలు కలిగి ఉందా అన్నట్లు ప్రవర్తిస్తోంది. వేలూరు జిల్లా ఆంబూరులోని వీరాంకుప్పంకు చెందిన ఆనందన్‌కు చెందిన ఆవు ఇటీవల మగ దూడకు జన్మనిచ్చింది. ఈ దూడ రాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించి చాప, దిండు ఉన్న చోట నిద్రిస్తోంది. ఇంట్లోని నీళ్లు తాగడం, చిన్నారుల కోసం తీసుకొచ్చిన తిను బండారాలను తింటూ వారితో కలిసి తిరుగుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఫ్యాన్, పాటలు వినేందుకు టేప్ రికార్డర్‌తో పాటు స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఈ దూడ సినిమా పాటలకు డాన్స్ కూడా చేస్తోంది. ఆకలి వేసినప్పుడు మాత్రమే తల్లి ఆవు వద్దకు వెళుతోంది. దీంతో ఈ దూడకు వేలన్ అనే పేరు పెట్టారు. -
సిరిసిల్లలో వింత వేప మొక్క
-
కట్టేసి వైద్యం చేస్తున్నారు
కల్తీ కల్లు లేక వింత ప్రవర్తనతో పదుల సంఖ్యలో బాధితులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎక్సైజ్ శాఖ విస్తృత దాడుల వల్ల కల్లులో కలిపే డైజిపామ్ అనే మందును వ్యాపారులు కలపటం మానేశారు. దీంతో డైజిపామ్ కల్లుకు అలవాటు పడిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు సుమారు 56 మంది నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వీరిలో నిజామాబాద్ పట్టణం, నవీపేట, బోధన్, ఎడపల్లి తదితర ప్రాంతాల వారు ఉన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, వింతగా ప్రవర్తిస్తుండడం.. జనంపై దాడికి ప్రయత్నిస్తుండడంతో రోగుల కాళ్లు చేతులు కట్టేసి.. వైద్యం చేస్తున్నారు. వీరిలో నలుగురికి ఫిట్స్ కూడా వచ్చాయని వైదులు తెలిపారు. డైజిపామ్కు అలవాటు పడటం వల్లే బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారని వివరించారు.