గీత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుంచి జారిపడి మృతిచెందాడు.
హుజూరాబాద్: గీత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రావుల కొమరయ్య(55) కల్లు గీయడం కోసం తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.