ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో కారులో కూర్చున్న నలుగురు యూ ట్యూబర్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్దారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హసన్పూర్ గజ్రౌలా రోడ్డుపై చోటుచేసుకుంది. గాయపడివారికి చికిత్స అందించేందుకు పోలీసులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ యూట్యూబర్లు ‘రౌండ్ టు వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. హసన్పూర్ గజ్రౌలా రోడ్డులోని మనోటా బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ కారులోని వారంతా అమ్రోహాలోని హసన్‌పూర్‌లో విందు ముగించుకుని తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను లక్కీ, సల్మాన్, షారుక్, షెహ్నవాజ్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా కామెడీ వీడియోలను రూపొందిస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment