Amroha
-
స్కూల్ ప్రిన్సిపాల్ ఓవరాక్షన్ .. నాన్‌వెజ్ తీసుకొచ్చాడని విద్యార్ధి సస్పెండ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్లో ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. అయిదేళ్ల విద్యార్ధిని క్లాస్‌లోకి మాంసాహారం తెచ్చాడని అతడిని సస్పెండ్ చేవారు. ఈ ఘటన అమ్రోహాలోని ఓ ప్రవేటు పాఠశాలలో వెలుగుచూసింది. గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం రోజు హిల్టన్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న నర్సరీ విద్యార్ధి తన లంచ్ బాక్స్‌లో మాంసాహారాన్ని పాఠశాలకు తీసుకొచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపల్ బాలుడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీసింది. పాఠశాలలకు మాంసాహారం తీసుకొచ్చే పిల్లలకు మంచి బుద్దులు చెప్పడం తమకు ఇష్టం లేదని ఆమెతో ప్రిన్సిపల్ వాగ్వాదానికి దిగారు. అంతేగాక విద్యార్థి తరుచుగా మాంసాహారాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. మాంసాహారం తినేలా చేయడం వల్ల అందరినీ ఇస్లాంలోకి మార్చాలనుకుంటున్నాననని, తాను హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలనుకుంటున్నట్లు తనతో విద్యార్ధి చెబుతున్నాడని ఆరోపించారు. ప్రిన్సిపల్ మాటలపై స్పందించిన విద్యార్ధి తల్లి తన క్లాస్‌లోని విద్యార్థులు కేవలం హిందూ-ముస్లిం’ అంటూ వేరు చేసి మట్లాడుతున్నారని చేస్తున్నారంటూ తన కొడుకు గత మూడు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పింది. తన బిడ్డను అతని తరగతిలో కూర్చోనివ్వడం లేదని మహిళ ఆరోపించింది. అయితే దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్.. సదరు విద్యార్థికి చదువు నేర్పడం ఇష్టం లేదని, అతన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.విద్యార్ధి తల్లి, ప్రిన్సిపల్ మధ్య సంభాషణను వీడియో రికార్డు చేయడంతో.. వైరల్‌గా మారింది. దీంతో ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని, పాఠశాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమ్రోహి ముస్లిం కమిటీ.. జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసింది. అమ్రోహా ప్రాథమిక విద్యాశాఖాధికారి మూడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో కారులో కూర్చున్న నలుగురు యూ ట్యూబర్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్దారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హసన్పూర్ గజ్రౌలా రోడ్డుపై చోటుచేసుకుంది. గాయపడివారికి చికిత్స అందించేందుకు పోలీసులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ యూట్యూబర్లు ‘రౌండ్ టు వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. హసన్పూర్ గజ్రౌలా రోడ్డులోని మనోటా బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ కారులోని వారంతా అమ్రోహాలోని హసన్‌పూర్‌లో విందు ముగించుకుని తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను లక్కీ, సల్మాన్, షారుక్, షెహ్నవాజ్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా కామెడీ వీడియోలను రూపొందిస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. -
ఎంపీ డానిష్ అలీపై బీఎస్పీ బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీని శనివారం బహుజన్ సమాజ్ పార్టి(బీఎస్పీ) సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ మీరు ఎలాంటి ప్రకటన చేయరాదని, ఎటువంటి చర్య తీసుకోవద్దని చాలాసార్లు మౌఖికంగా చెప్పాం. అయినప్పటికీ మీరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం మానలేదు. అందుకే, పార్టీ ప్రయోజనాల రీత్యా మిమ్మల్ని బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’అని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా డానిష్ అలీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి
లక్నో: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్‌ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్‌ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. Amroha, UP | Locals protest after a woman died allegedly due to bandage left inside her stomach during operation On basis of a man's complaint alleging that his wife died after treatment at a hospital due to negligence of a doctor, case registered.Probe on:VK Rana, CO City(21.1) pic.twitter.com/BjKhG8zxyf — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2023 చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
దారుణం.. ప్రియుడితో కలిసి కూతుర్ని కడతేర్చిన తల్లి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహాలో షాకింగ్ ఘటన జరిగింది. సొంత తల్లే కూతుర్ని దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఈ క్రూర చర్యకు పాల్పడింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది. పోలీసులు నిందితులిద్దరినీ శనివారం అరెస్టు చేశారు. హసన్పూర్ కోత్వాలి పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.. నిందితురాలి పేరు స్మృతి రాణి వర్మ. ఆమె ప్రియుడి పేరు అనిల్ కుమార్. హత్యకు గురైన 16 ఏళ్ల బాలిక పేరు కుష్బూ వర్మ. అయితే స్మృతి రాణి చాలా ఏళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయింది. ప్రియుడు అనిల్‌తో కలిసి జీవిస్తోంది. కూతురు కుష్బూ కూడా ఈమెతోనే ఉంటోంది. రాణి అనిల్‌తో ఉండొద్దని కుష్బూ తరచూ ఆమెకు చెప్పేది. తల్లి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసేది. దీంతో తన కూతురు అడ్డుగా ఉందని బావించిన రాణి ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే తన కుమార్తె మృతిపై సుషీల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాణే ఆమెను చంపి ఉంటుందని అనమానం వ్యక్తం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాణి ఆమె ప్రియుడ్ని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
వింత ఘటన.. ఆధార్ చూపిస్తేనే పెళ్లి భోజనం.. వీడియో వైరల్
అమ్రోహా(యూపీ): అక్కాచెల్లెళ్ల వివాహాలను ఒకే రోజు జరిపించింది ఓ కుటుంబం. దాంతో బంధు మిత్రులు, తెల్సినవారు తండోపతండాలుగా హాజరయ్యారు. అంతమందికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయడంలో కుటుంబం విఫలమైంది. పైగా పిలవని వాళ్లు కూడా భారీగా వచ్చారేమోనని అనుమానం. దాంతో, ఆధార్ కార్డును చూపిస్తేనే భోజనం ప్లేటు ఇస్తామని ప్రకటించారు. దీంతో అతిథులు హుతాశులయ్యారు. ఆధార్ కార్డులున్న వారు వాటిని చూపించి భోజనాలు కానిచ్చేశారు. మిగతావాళ్లు ఇదేం అవమానమంటూ వెళ్లిపోయారు. యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్‌లో జరిగిన ఈ వింత ఘటన తాలూకు వీడియోలు వైరల్‌గా మారాయి. In a seemingly bizarre incident, guests at a #wedding in Uttar Pradesh's #Amroha district were asked to show their #Aadhaar cards before they were allowed to pick up dinner plates.The incident took place in Hasanpur where two sisters were getting married at the same venue. pic.twitter.com/9IfenucXUH— IANS (@ians_india) September 25, 2022 -
దారుణం : బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ..
అమ్రొహా(యూపీ) : ఉత్తర్ ప్రదేశ్‌లో అమ్రొహాలోని జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్(యూపీఎస్ఆర్టీసీ)కి చెందిన బస్సు (యూపీ 27 టీ 8612) ఓ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బస్సును ఆపకుండా డ్రైవర్ అలానే వేగంగా పోనిచ్చాడు. బైక్‌ను ఈడ్చుకుంటూ హైవేపై వెళుతున్న వాహనాలను ఓవర్ టెక్ కూడా చేశాడు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిచికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
బతికున్న చిన్న పాము పిల్లను మింగి.
-
బతికున్న పామును మింగి.. 4 గంటల్లోనే
లక్నో(అమ్రోహ) : ఓ వ్యక్తి ఫుల్లుగా తాగాడు.. అదే సమయంలో ఓ చిన్నపాము పిల్లకు తోడు కొందరు ఆకతాయిలు తోడయ్యారు. సరదాకు చేసిన చేష్టలు కాస్తా మనిషి ప్రాణంతీసేలా చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలో కార్మికుడుగా జీవనం సాగిస్తున్న మహిపాల్ సింగ్(40) తాగిన మైకంలో బతికున్న పాముపిల్లను మింగి మృత్యువాత పడ్డాడు. మహిపాల్ సింగ్ బుధవారం బాగా తాగి ఇంటికొస్తుండగా రోడ్డు పక్కన ఓ పాముపిల్ల కనిపించింది. దాన్ని తీసుకొని సరదాగా ఆడుకుంటుండగా కొందరు ఆకతాయిలు అక్కడికి చేరుకుని ఫోన్లలో వీడియోలు తీయడం ప్రారంభించారు. దీంతో మరింత రెచ్చిపోయిన సింగ్ పాముపిల్లను తన పిడికిలిలో పట్టుకుని, రోడ్డుపై వేసి, తలమీద పెట్టుకుంటూ ఆటలాడసాగాడు. ఇంతలోనే ఓ ఆకతాయి పామును నోట్లో పెట్టుకుంటావా? అని అడగడంతో సింగ్ వెంటనే తన నోట్లో పెట్టుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. నోట్లో పెట్టుకున్న పాము కాస్తా చేతిలో నుంచి జారీ గొంతులోంచి లోపలికి వెళ్లిపోయింది. వాంతులు చేస్తూ ఎంత ప్రయంత్నించినా లోపలికి వెళ్లిన పాము బటయకు రాలేదు. చివరకు 4 గంటల్లోపే పాము విషం అతని ఒళ్లంతా వ్యాపించి చనిపోయాడు. దీనికి సంబంధించి స్థానికులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
పిండం బ్యాగులో వేసుకొని...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ అయిదు నెలల పిండం బ్యాగులో వేసుకొని పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహ ప్రాంతానికి చెందిన ఓ యువతి స్థానిక యువకుడితో గత ఆరు నెలలు సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గర్భవతి అయ్యారు. దీంతో పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరగా అతను నిరాకరించాడు. పెళ్లికి ఒప్పుకోకపోగా... ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం చెందిన ఆమె.. ఆ పిండంతో పాటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. ఆమె దగ్గర నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
కన్న కూతురును కాపాడబోయి..
అమ్రోహ(యూపీ): ఆకతాయిల ఆగడాల నుంచి కూతురును కాపాడాలనుకున్న తండ్రి హత్యకు గురయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. కొందరు ఆకతాయిలు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న బాధితురాలిని తరచుగా వేధించేవారు. స్థానికంగా నివాసముండే ఆ యువకుల ఆగడాలు శృతిమించడంతో తండ్రికి జరిగిన విషయాన్ని బాధితురాలు తెలిపింది. వేధింపుల విషయాన్ని బాధితురాలి తండ్రి, యువకుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో ఆగ్రహించిన యువకులు బుధవారం రాత్రి సమయంలో బాధితురాలి ఇంటికి చేరుకొని ఆమె తండ్రిపై దాడికి దిగారు. తీవ్రగాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన పై విచారణకు ఆదేశించినట్టు ఏఎస్పీ ఉదయ్ శంకర్ తెలిపారు.