వింత ఘటన.. ఆధార్‌ చూపిస్తేనే పెళ్లి భోజనం.. వీడియో వైరల్‌ | Guests at UP wedding asked to show Aadhaar cards | Sakshi
Sakshi News home page

వింత ఘటన.. ఆధార్‌ చూపిస్తేనే పెళ్లి భోజనం.. వీడియో వైరల్‌

Published Mon, Sep 26 2022 6:05 AM | Last Updated on Mon, Sep 26 2022 8:43 AM

Guests at UP wedding asked to show Aadhaar cards - Sakshi

అమ్రోహా(యూపీ): అక్కాచెల్లెళ్ల వివాహాలను ఒకే రోజు జరిపించింది ఓ కుటుంబం. దాంతో బంధు మిత్రులు, తెల్సినవారు తండోపతండాలుగా హాజరయ్యారు. అంతమందికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయడంలో కుటుంబం విఫలమైంది. పైగా పిలవని వాళ్లు కూడా భారీగా వచ్చారేమోనని అనుమానం.

దాంతో, ఆధార్‌ కార్డును చూపిస్తేనే భోజనం ప్లేటు ఇస్తామని ప్రకటించారు. దీంతో అతిథులు హుతాశులయ్యారు. ఆధార్‌ కార్డులున్న వారు వాటిని చూపించి భోజనాలు కానిచ్చేశారు. మిగతావాళ్లు ఇదేం అవమానమంటూ వెళ్లిపోయారు. యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్‌లో జరిగిన ఈ వింత ఘటన తాలూకు వీడియోలు వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement