లక్నో(అమ్‌రోహ) : ఓ వ్యక్తి ఫుల్లుగా తాగాడు.. అదే సమయంలో ఓ చిన్నపాము పిల్లకు తోడు కొందరు ఆకతాయిలు తోడయ్యారు. సరదాకు చేసిన చేష్టలు కాస్తా మనిషి ప్రాణంతీసేలా చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్‌రోహ జిల్లాలో కార్మికుడుగా జీవనం సాగిస్తున్న మహిపాల్ సింగ్(40) తాగిన మైకంలో బతికున్న పాముపిల్లను మింగి మృత్యువాత పడ్డాడు.
మహిపాల్ సింగ్ బుధవారం బాగా తాగి ఇంటికొస్తుండగా రోడ్డు పక్కన ఓ పాముపిల్ల కనిపించింది. దాన్ని తీసుకొని సరదాగా ఆడుకుంటుండగా కొందరు ఆకతాయిలు అక్కడికి చేరుకుని ఫోన్లలో వీడియోలు తీయడం
ప్రారంభించారు. దీంతో మరింత రెచ్చిపోయిన సింగ్ పాముపిల్లను తన పిడికిలిలో పట్టుకుని, రోడ్డుపై వేసి, తలమీద పెట్టుకుంటూ ఆటలాడసాగాడు. ఇంతలోనే ఓ ఆకతాయి పామును నోట్లో పెట్టుకుంటావా? అని అడగడంతో సింగ్ వెంటనే తన నోట్లో పెట్టుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. నోట్లో పెట్టుకున్న పాము కాస్తా చేతిలో నుంచి జారీ గొంతులోంచి లోపలికి వెళ్లిపోయింది. వాంతులు చేస్తూ ఎంత ప్రయంత్నించినా లోపలికి వెళ్లిన పాము బటయకు రాలేదు. చివరకు 4 గంటల్లోపే పాము విషం అతని ఒళ్లంతా వ్యాపించి చనిపోయాడు. దీనికి సంబంధించి స్థానికులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment