లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ అయిదు నెలల పిండం బ్యాగులో వేసుకొని పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహ ప్రాంతానికి చెందిన ఓ యువతి స్థానిక యువకుడితో గత ఆరు నెలలు సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గర్భవతి అయ్యారు.
దీంతో పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరగా అతను నిరాకరించాడు. పెళ్లికి ఒప్పుకోకపోగా... ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం చెందిన ఆమె.. ఆ పిండంతో పాటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. ఆమె దగ్గర నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment