ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి | Uttar Pradesh Amroha Doctors Left Bandage Inside Woman Stomach | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి

Published Sun, Jan 22 2023 1:13 PM | Last Updated on Sun, Jan 22 2023 1:13 PM

Uttar Pradesh Amroha Doctors Left Bandage Inside Woman Stomach - Sakshi

లక్నో: వైద్యుల నిర్లక్ష‍్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్‌ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష‍్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.  అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్‌ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.

చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement