bandage
-
సిరిసిల్ల బ్రాండ్ బ్యాండేజీ..!
సిరిసిల్ల: మార్కెట్లో ఏ బట్టకు డిమాండ్ ఉంటే, ఆ బట్టను కాలానికి అనుగుణంగా ఉత్పత్తి చేస్తేనే పోటీ ప్రపంచంలో మనుగడ ఉంటుంది. ఈ వ్యాపార సూత్రాన్ని ఆకలింపు చేసుకున్న సిరిసిల్లలోని కొందరు వ్రస్తోత్పత్తిదారులు కాటన్ బట్ట ఉత్పత్తికి స్వస్తి పలికారు. బ్యాండేజీ బట్ట ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఈ బట్టను శుద్ధి చేసి, ప్రాసెసింగ్ చేసిన తర్వాత నీట్‌గా స్టెరలైజ్లో ప్యాకింగ్ చేసి ఆస్పత్రుల్లో గాయాలకు కట్లు కట్టేందుకు వినియోగిస్తారు. వినాయకచవితి సందర్భంగా వివిధ రంగుల్లో ఈ బ్యాండేజీ బట్టను ప్రాసెస్ చేసి వినియోగిస్తారు. సిరిసిల్లలో కొత్తగా ఆలోచించే కాటన్ యజమానులు బ్యాండేజీ బట్ట ఆర్డర్లు తీసుకొని సాంచాలపై కొత్త రకం బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్ల వ్రస్తోత్పత్తి రంగంలో వచ్చిన ఈ మార్పుతో నేతన్నలకు మెరుగైన ఉపాధి లభిస్తున్నది. సర్కారు వైపు చూడకుండా.. సిరిసిల్ల పాలిస్టర్ యజమానులు, ఆసాములు ప్రభు త్వం ఇచ్చే వస్త్రోత్పత్తి ఆర్డర్లకు చూస్తుండగా, కాటన్ వస్త్రోత్పత్తిదారులు సొంత వ్యాపారం నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలిస్టర్ వ్రస్తోత్పత్తిదారులు బతుకమ్మ చీరలు, ఆర్వీఎం, రంజాన్, క్రిస్మస్ వంటి ఆర్డర్లతో కాలం వెళ్లదీశారు. కాటన్ వస్త్రపరిశ్రమకు ప్రభుత్వ పరంగా ఆర్డర్లు రాకపోయినా, సొంతంగా ఆర్డర్లు సంపాదించుకొని మార్కెటింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు 160 డయింగ్(అద్దకం) యూనిట్లతో సిరిసిల్ల కాటన్ పరిశ్రమ ఉపాధి కేంద్రంగా ఉండేది. కానీ ప్రస్తుతం 50 డయింగ్ యూనిట్లకు చేరింది. ఇలాంటి తరుణంలో కాటన్ వస్త్రవ్యాపారులు కొత్త కం బ్యాండేజీ బట్టను ఉత్పత్తి చేస్తున్నారు.సాంచా నడుపుతున్న ఇతని పేరు చిలుక మల్లేశం. సిరిసిల్లలో కాటన్ బట్టను ఉత్పత్తి చేసే మల్లేశం కొత్తగా బ్యాండేజీ బట్టను తక్కువ పిక్కుల (పోగులు)తో బట్ట జాలి(రంధ్రాలు) ఉండే విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో లంగాల బట్టను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.22 లభించేది. కానీ దీనికి డిమాండ్ లేదు. ప్రస్తుతం బ్యాండేజీ బట్టను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.19 లభిస్తున్నది. మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. -
కాలి బ్యాండేజీలో బంగారం
దొడ్డబళ్లాపురం: కాలికి గాయమైనట్లు బ్యాండేజీ చుట్టుకుని లోపల బంగారం దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.43లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మే 21న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు బంగారం తరలిస్తున్నట్టు తెలియడంతో అతన్ని తనిఖీలు చేశారు. అతడి కాలికి చుట్టిన బ్యాండేజీపై అనుమానం వచ్చి విప్పి చూడగా రెండు బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. మరో చైను కూడా అతడి నుండి స్వాధీనం చేసుకున్నారు. స్టీలు కడియం రూపంలో. చేతి కడియానికి స్టీలు పూత పూసి బంగారును తరలిస్తున్న వ్యక్తిని విమానాశ్రయంలో పట్టుకున్నారు. మే 20న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికునిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని తనిఖీ చేయగా, చేతికి ఉన్న పెద్ద స్టీలు కనిపించింది. దానిని పరిశీలించగా, బంగారు కడియమని, పైకి కనబడకుండా ఉండడానికి స్టీలు పూత పూసినట్లు వెల్లడైంది. రూ.31 లక్షల విలువ చేసే అర్ధ కేజీ బంగారాన్ని స్వాదీనం చేసుకొన్నారు. -
గ్లోవ్ ధరిస్తే వాపులు మాయం!
చేతులకు గాయాలై, ఆ గాయాల వల్ల వాపులు కూడా ఏర్పడితే రోజువారీ పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. గాయాల వల్ల ఏర్పడే వాపులు తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్, పెయిన్ బామ్స్ వాడుతుంటాం. చేతి వాపులు తగ్గించుకోవాలంటే, ఇప్పుడు వాటితో పనిలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్లోవ్‌ను తొడుక్కుంటే చాలు. నొప్పుల నుంచి సత్వర ఉపశమనం లభించడమే కాకుండా, వాపులు కూడా ఇట్టే తగ్గిపోతాయి. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సిండీ కావో నేతృత్వంలోని పరిశోధకులు ఈ అద్భుతమైన నొప్పినివారక గ్లోవ్‌ను ‘నిట్ డెమా’ పేరుతో ఇటీవల రూపొందించారు. ఒక వేలును మాత్రమే కప్పి ఉంచేలా దీన్ని రూపొందించారు. దీని తయారీకి మామూలు ఊలుతో పాటు, మిశ్రమ లోహాలతో తయారు చేసిన స్ప్రింగులను ఉపయోగించారు. దీన్ని పవర్‌బ్యాంక్‌కు కనెక్ట్ చేసుకుంటే, ఇందులోని మిశ్రమ లోహాల స్ప్రింగులు విద్యుత్తును గ్రహించి, కొద్దిగా వేడెక్కి మర్దన చేయడం మొదలు పెడతాయి. ఫలితంగా నొప్పి, వాపులు తగ్గుతాయి. దీని పనితీరుపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని వారు చెబుతున్నారు. చదవండి: ఫుడ్ పాయిజన్ అయిందా? శొంఠి పొడి, తేనె కలిపి తాగుతున్నారా? అయితే.. -
ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి
లక్నో: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్‌ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్‌ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. Amroha, UP | Locals protest after a woman died allegedly due to bandage left inside her stomach during operation On basis of a man's complaint alleging that his wife died after treatment at a hospital due to negligence of a doctor, case registered.Probe on:VK Rana, CO City(21.1) pic.twitter.com/BjKhG8zxyf — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2023 చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
బ్యాండేజీ తీయకుండానే మందులు వేస్తారు!
గాయమైనప్పుడు రోజూ కట్టు కట్టించుకోవడం అనేది నరకప్రాయం అంటే అతిశయోక్తి కాదేమో. కట్టు తీసే ధాటికి చర్మంపై ఒత్తిడి పెరిగి విపరీతమైన మంట లేదా నొప్పి ఖాయం. బాగా తీవ్రమైన గాయాలైతే ఒకే మందుతో అది మానదు కూడా. మానుతున్న కొద్దీ మందుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అంటే మళ్లీ మళ్లీ కట్టు విప్పాలన్నమాట. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఎంచక్కా బ్యాండేజీ తీయకుండానే కావాల్సిన మందులేసేందుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కావాల్సిన మందులు ఉన్న చిన్న చిన్న సంచీలను తొలిసారి కట్టు కట్టేటప్పుడే చర్మంపై ఉంచేయడం ఇందులో ముఖ్యాంశం. ఈ సంచీలన్నింటినీ కలుపుతూ ఓ తీగ ఉంటుంది. ఈ తీగ సాయంతో ఒక స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా కావాల్సిన మందు సంచీ తెరుచుకునేలా చేయవచ్చు. అది కూడా వైర్లెస్ పద్ధతిలో అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే నర్సు అవసరమే లేకుండా ఎక్కడి నుంచైనా మందు వేయవచ్చునన్నమాట. ఈ పద్ధతిలో మందులు వేయడం సంప్రదాయ పద్ధతుల కంటే చాలా మెరుగైందని, గాయం లోపలికంటా మందులు వెళ్లిపోతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కనెక్టికట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తే ప్రొఫెసర్ అలీ తమయోల్ అంటున్నారు. మధుమేహంతో బాధపడుతున్న ఎలుకల చర్మం పూర్తిగా §ð బ్బతిన్న గాయాలు కూడా ఈ కొత్త బ్యాండేజీ ద్వారా మెరుగ్గా నయమయ్యాయని ఆయన చెప్పారు. పరిశోధన వివరాలు అడ్వాన్స్డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
స్విగ్గీలో నూడుల్స్ ఆర్డర్ చేస్తే..
సాక్షి, చెన్నై: ఆన్లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వారికి మరో షాకింగ్ న్యూస్. మొన్న జొమాటో డెలివరీ బాయ్ మధ్య దారిలో.. కస్టమర్ ఫుడ్‌ను తింటూ కెమేరాకు చిక్కిన వైనాన్ని ఇంకా మర్చిపోక ముందు మరో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ నిర్వాకం కలకలం రేపింది. స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసిన ప్యాక్‌లో బ్యాండేజ్ దర్శనమివ్వడంతో సదరు కస్టమర్‌కు వాంతులు ఒకటే తక్కువ. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చెన్నైకు చెందిన బాలమురుగన్ స్విగ్గీ ద్వారా సెలైయూర్ సమీపంలోని ‘చాప్ ఎన్ స్టిక్స్’ చైనీస్ రెస్టారెంట్ నుంచి చికెన్ నూడుల్స్ ఆర్డర్ చేశాడు. వేడి వేడి ప్యాకెట్ ను చూడగానే నోరూరింది. వెంటనే పార్శిల్ తెరిచి ఆరగిస్తుండగా అందులో రక్తంతో తడిచిన బ్యాండేజ్ కనిపించింది. దీంతో షాకైన బాలమురుగన్ వెంటనే ఆ రెస్టారెంట్‌కు ఫోన్‌చేసి ప్రశ్నించాడు. అయితే, ఆ హోటల్ వారు ఫుడ్ రీప్లేస్ చేయడానికి అంగీకరించలేదు. రిఫండ్ కూడా ఇవ్వమని కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే, స్విగ్గీ నిర్వాహకులతో నేరుగా మాట్లాడేందుకు ఫోన్ నెంబరు లేదు. దీంతో చాటింగ్ ద్వారా మాత్రమే మురుగన్ స్విగ్గీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అయినా ఫలితం శూన్యం. దీంతో దిక్కుతోచని మురుగన్ ఫేస్బుక్లో స్విగ్గీ పేజ్‌లో తన కంప్లయింట్ పోస్ట్ చేశాడు. తాను ఆర్డర్ చేసిన నూడుల్స్‌లో బ్లడ్ బ్యాండేజ్ ఉంది. దీనిపై తక్షణమే స్పందించి తప్పిదాన్ని సరిదిద్దుకుంటుందని భావిస్తున్నాననీ, వివిధ హోటళ్లతో భాగస్వామ్యం విషయంలో స్వీగ్గీ మరింత అప్రమత్తంగా ఉంటూ లోపాలను సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల తనకేమైనా అనారోగ్యం సోకితే కంపెనీయే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇది వైరల్ కావడంతో చివరికి స్విగ్గీ దిగి రాకతప్పలేదు. వినియోగదారుడికి ఎదురైన అనుభవంపై చింతిస్తున్నామంటూ ఆయనకు క్షమాపణలు తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రత మాకు ఎంతో ముఖ్యం. పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే రెస్టారెంట్లతో కలిసి పనిచేస్తామని బాధితుని ఫిర్యాదు మేరకు రెస్టారెంటును మా జాబితా నుంచి తొలగిస్తున్నామని ప్రకటించింది దీనిపై థర్డ్ పార్టీ విచారణ జరుపుతామని పేర్కొంది. -
మహిళ కడుపులో బ్యాండేజ్
ప్రభుత్వ డాక్టర్లు, నర్సుకు అరెస్టు వారెంట్ టీ.నగర్: ప్రసవం చేసే సమయంలో మహిళ కడుపులో బ్యాండేజ్‌తో కుట్లు వేసిన ప్రభుత్వ డాక్టర్లు, నర్సుకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దిండివనం తిరువళ్లువర్ నగర్‌కు చెందిన చోళయప్పన్ (48) కీళమావిళంగైలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇతని భార్య ధరణి (39). ఈమెను గత 26 మే 2004లో ప్రసవం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు 7 జూన్ 2004లో శస్త్ర చికిత్సను చేయగా మగబిడ్డ జన్మించింది. ఆ సమయంలో ఆమెకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేశారు. అనంతరం 15 జూన్ 2004న ధరణి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆమె 30–06–2004 వరకు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆమెను మళ్లీ పుదుచ్చేరి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు చికిత్సలు అందించి 13 జులై 2004లో డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వచ్చిన ధరణికి ఆపరేషన్ చేసిన స్థలం నుంచి రక్తస్రావం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత దిండివనం, విల్లుపురం, చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందారు. 23 సెప్టెంబర్ 2004న చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో స్కాన్ చేయగా కడుపులో బ్యాండేజ్ ఉన్నట్లు తెలిసింది. దీంతో చోళయప్పన్ పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిర్యాదు చేశారు. ధరణికి చికిత్సలు అందించిన డాక్టర్లు విజయభాను, జయంతి, నర్సు ఉమలపై పుదుచ్చేరి సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు 13 ఏళ్లుగా విచారణ జరుగుతూ వచ్చింది. అయితే ఇద్దరు డాక్టర్లు, నర్సు విచారణకు కోర్టులో హాజరు కాలేదు. దీంతో మెజిస్ట్రేట్ దయాళన్ డాక్టర్లు, నర్సుకు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ శనివారం జారీ చేశారు. -
బన్నీ బ్యాండేజ్పై ఫీల్ అవుతున్న ఫ్యాన్స్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతికున్న బ్యాండేజ్పై ప్రస్తుతం అతని ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది. ఇటీవల ఓ స్థల వివాదం కేసులో రంగారెడ్డి కోర్టుకు కుటుంబంతో సహా హాజరైన బన్నీ చేతికి కట్టుతో కనిపించాడు. అంతే అభిమానుల్లో అలజడి మొదలైంది. అలాగే బుధవారం జరిగిన అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార వేడుకలోను అల్లు అర్జున్ బ్యాండేజ్‌తోనే కనిపించాడు. దీంతో స్టైలిష్ స్టార్ కి ఏమైందంటూ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారట. తమ అభిమాన హీరోకు జరిగిన ప్రమాదం, చేతికి అయిన గాయం గురించి తెలుసుకొని మరింత బాధపడుతున్నారట. ప్రముఖ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం అమీర్‌పేటలోని సత్యసాయి నిగమాగమంలో నిన్న ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు ఈ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా హాజరైన అల్లు అర్జున్ చేతికి ఉన్న కట్టు స్పష్టంగా కనిపించింది. కాగా బోయపాటి శీను డైరెక్షన్లో వస్తున్న 'సరైనోడు' షూటింగ్లో అల్లు అర్జున్ గాయపడినట్టు సమాచారం. మాస్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక యాక్షన్ సన్నివేశం చేస్తుండగా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చేతికి స్వల్పంగా గాయమైనట్లు సమాచారం.