బన్నీ బ్యాండేజ్పై ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ | fans worrying about bunny's bandage | Sakshi
Sakshi News home page

బన్నీ బ్యాండేజ్పై ఫీల్ అవుతున్న ఫ్యాన్స్

Published Thu, Jan 7 2016 4:43 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

బన్నీ బ్యాండేజ్పై ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ - Sakshi

బన్నీ బ్యాండేజ్పై ఫీల్ అవుతున్న ఫ్యాన్స్

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతికున్న బ్యాండేజ్పై ప్రస్తుతం అతని ఫ్యాన్స్ను కలవరపరుస్తోంది. ఇటీవల  ఓ స్థల వివాదం కేసులో రంగారెడ్డి కోర్టుకు కుటుంబంతో సహా హాజరైన బన్నీ చేతికి కట్టుతో కనిపించాడు. అంతే అభిమానుల్లో అలజడి మొదలైంది. అలాగే బుధవారం జరిగిన అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార వేడుకలోను అల్లు అర్జున్ బ్యాండేజ్‌తోనే కనిపించాడు. దీంతో  స్టైలిష్  స్టార్ కి ఏమైందంటూ  అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారట. తమ అభిమాన హీరోకు జరిగిన ప్రమాదం, చేతికి అయిన గాయం గురించి తెలుసుకొని మరింత బాధపడుతున్నారట.

ప్రముఖ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార ప్రదాన కార్యక్రమం అమీర్‌పేటలోని సత్యసాయి నిగమాగమంలో నిన్న ఘనంగా జరిగింది.  ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు ఈ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా హాజరైన అల్లు అర్జున్  చేతికి ఉన్న కట్టు  స్పష్టంగా కనిపించింది. కాగా బోయపాటి శీను డైరెక్షన్‌లో  వస్తున్న 'సరైనోడు'  షూటింగ్‌లో అల్లు అర్జున్ గాయపడినట్టు సమాచారం. మాస్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక యాక్షన్ సన్నివేశం చేస్తుండగా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.  ఈ సందర్భంగా చేతికి  స్వల్పంగా గాయమైనట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement