మా అబ్బాయి నా జీవితాన్ని మార్చేశాడు | My son has changed my life says Allu Arjun | Sakshi
Sakshi News home page

మా అబ్బాయి నా జీవితాన్ని మార్చేశాడు

Published Mon, Dec 29 2014 11:46 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

మా అబ్బాయి నా జీవితాన్ని మార్చేశాడు - Sakshi

మా అబ్బాయి నా జీవితాన్ని మార్చేశాడు

 ‘‘మా అబ్బాయి అయాన్ పుట్టిన తర్వాత ‘రేసు గుర్రం’ విడుదలైంది కాబట్టి, తనవల్లే ఆ చిత్రం ఘనవిజయం సాధించిందని అంటే దర్శకుడు సురేందర్‌రెడ్డి అంత ఆనందపడకపోవచ్చు. ఎందుకంటే, తన ఏడాది కష్టం, ఇతర చిత్రబృందం శ్రమ తాలూకు ఫలితమే ఈ విజయం. అఫ్‌కోర్స్ మా అబ్బాయి వచ్చి నా జీవితాన్ని మార్చేశాడనుకోండి. అది కాదనలేని విషయం’’ అని ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. అయాన్ పుట్టిన తర్వాత మునుపటికన్నా జీవితం ఇంకా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ చెబుతూ -‘‘అయాన్‌ని మొదటిసారి చూసిన క్షణాలను నేనెప్పటికీ మర్చిపోలేను.
 
 ఆ సమయంలో నేను పొందిన అనుభూతిని దేనితోనూ వెలకట్టలేం... దేనికీ దీటు కాదు. ఈ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే తండ్రి కావాల్సిందే’’ అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే, గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement