లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్‌లో ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. అయిదేళ్ల విద్యార్ధిని క్లాస్‌లోకి మాంసాహారం తెచ్చాడని అతడిని సస్పెండ్ చేవారు. ఈ ఘటన అమ్రోహాలోని ఓ ప్రవేటు పాఠశాలలో వెలుగుచూసింది. గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం రోజు హిల్టన్ కాన్వెంట్ స్కూల్‌లో చదువుతున్న నర్సరీ విద్యార్ధి తన లంచ్ బాక్స్‌లో మాంసాహారాన్ని పాఠశాలకు తీసుకొచ్చాడు.
ఇది గమనించిన ప్రిన్సిపల్ బాలుడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీసింది. పాఠశాలలకు మాంసాహారం తీసుకొచ్చే పిల్లలకు మంచి బుద్దులు చెప్పడం తమకు ఇష్టం లేదని ఆమెతో ప్రిన్సిపల్ వాగ్వాదానికి దిగారు.
అంతేగాక విద్యార్థి తరుచుగా మాంసాహారాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. మాంసాహారం తినేలా చేయడం వల్ల అందరినీ ఇస్లాంలోకి మార్చాలనుకుంటున్నాననని, తాను హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలనుకుంటున్నట్లు తనతో విద్యార్ధి చెబుతున్నాడని ఆరోపించారు.
ప్రిన్సిపల్ మాటలపై స్పందించిన విద్యార్ధి తల్లి తన క్లాస్‌లోని విద్యార్థులు కేవలం హిందూ-ముస్లిం’ అంటూ వేరు చేసి మట్లాడుతున్నారని చేస్తున్నారంటూ తన కొడుకు గత మూడు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పింది. తన బిడ్డను అతని తరగతిలో కూర్చోనివ్వడం లేదని మహిళ ఆరోపించింది. అయితే దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్.. సదరు విద్యార్థికి చదువు నేర్పడం ఇష్టం లేదని, అతన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్ధి తల్లి, ప్రిన్సిపల్ మధ్య సంభాషణను వీడియో రికార్డు చేయడంతో.. వైరల్‌గా మారింది. దీంతో ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని, పాఠశాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమ్రోహి ముస్లిం కమిటీ.. జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసింది. అమ్రోహా ప్రాథమిక విద్యాశాఖాధికారి మూడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment