దారుణం : బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ.. | UPSRTC hits bike and continues run in Amroha | Sakshi
Sakshi News home page

దారుణం : బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ..

Published Fri, Oct 12 2018 3:57 PM | Last Updated on Fri, Oct 12 2018 4:17 PM

UPSRTC hits bike and continues run in Amroha - Sakshi

అమ్రొహా(యూపీ) : ఉత్తర్‌ ప్రదేశ్‌లో అమ్రొహాలోని జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌(యూపీఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన బస్సు (యూపీ 27 టీ 8612) ఓ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బస్సును ఆపకుండా డ్రైవర్‌ అలానే వేగంగా పోనిచ్చాడు. బైక్‌ను ఈడ్చుకుంటూ హైవేపై వెళుతున్న వాహనాలను ఓవర్‌ టెక్‌ కూడా చేశాడు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిచికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement