India wins historic gold medal జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘన విజయంపై పారిశ్రామివేత్త ఆనంద్‌మహీంద్ర స్పందించారు. భారతీయ మహిళలు గొప్పగా రాణిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. ఎందుకంటే భారతంలో అర్జునిడిలా వారి టార్గెట్ పక్షి కన్ను మాత్రమే..బ్లూఐ కాదు .మీ విజయాన్ని చూసి దేశం గర్వపడుతోంది. అంటూ ప్రశంసలు కురిపించారు. త ద్వారా భారతీయ మూలాల్లో ఉన్న విలువిద్య ప్రాధాన్యతను, ప్రతిభను కొనియాడారు.
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. ఈ బృందంలో జ్యోతి సురేఖ వెన్నం, పర్నీత్ కౌర్ మరియు అదితి గోపీచంద్ స్వామి ఉన్నారు. చివరి రౌండ్‌లో, డాఫ్నే క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెకెరాలతో కూడిన మెక్సికన్ జట్టుపై అసాధారణమైన ప్రదర్శనను ప్రదర్శించారు. భారత త్రయం 235-229 స్కోరుతో విజయం సాధించారు. దీంతో నెటిజన్లు కూడా మహిళల విజయంపై స్పందిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ టాప్‌లో నిలుస్తున్నారు అంటూ భారత జట్టును పొగడ్తలు కురిపిస్తున్నారు.
భారతీయ మహిళల ఘనత మరుగున పడిపోతోంది. ఇంట్లో కుటుంబం కోసం , పొలాల్లో పని చేయడం , కార్యాలయంలో పని ,ఇప్పుడు స్టార్టప్‌లను నడపడం, దేశం కోసం పతకాలు సాధించడంతోపాటు చాలాపనులను విజయవంతంగా చేయగలరు. కానీ కుటుంబ చాకిరీలాగానే చాలా మంది మహిళల పాత్ర వెలుగులోకి రావడం లేదంటూ ఆవేదన కూడా వ్యక్తం చేయడం గమనార్హం.
Indian women on the Rise. No surprise. Because, like Arjuna, they only see the “eye of the bird” As opposed to the Bull’s eye. 😊👏🏽👏🏽👏🏽. Thank you for making us all so proud. pic.twitter.com/kwq97zwRiR
— anand mahindra (@anandmahindra) August 5, 2023
Comments
Please login to add a commentAdd a comment