ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక పోస్ట్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేసారు. ఇది నెటిజన్లను తెగ ఆకర్శించేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల సీఈఓల గురించి తెలుస్తోంది. నిజానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులే పెద్ద పెద్ద కంపెనీలలో ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లు గతంలోనే చాలా సందర్భాల్లో తెలిసింది. దీనిని ఉద్దేశించి ఆనంద్ మహీంద్రా.. భారతదేశం ప్రపంచ దేశాలకు కర్మాగారంగా మారుతున్నట్లు అనిపిస్తున్నట్లుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: కొత్త తరహా మోసానికి తెరలేపిన మోసగాళ్ళు.. మెసేజ్ చూసి కాల్ చేయండి!
వాస్తవానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపనీలకు భారతీయులే సారధులుగా ఉంటున్నారు. అంతే కాకుండా యూట్యూబ్, వరల్డ్ బ్యాంక్ వంటి వాటిలో కూడా ఇండియన్స్ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ కనిపించే జాబితాలో FedEx సీఈఓ పేరు మిస్ చేసినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
Absolutely astounding. We seem to be turning into the talent factory of the world. (And I think you left out the CEO of FedEx!😊) https://t.co/WLKsKqiWTR
— anand mahindra (@anandmahindra) August 27, 2023
Comments
Please login to add a commentAdd a comment