దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో నిరూపయోగంగా ఉన్న వెహికల్ టైర్స్, డ్రమ్ములు వంటి వాటితో అద్భుతమైన ఇంటీరియర్ వస్తువులను రూపొందించి ఉండటం చూడవచ్చు. చైర్లు, టేబుల్స్, వాష్ బేషన్స్, వాల్ క్లాక్స్ ఇలా పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాకండాలను తయారు చేస్తుండటం చూడవచ్చు.
ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది సర్క్యులర్ఎకానమీ, ఇక్కడ ఏమీ వేస్ట్ (వృథా) కాదు. ఇందులో కొత్తేమీ లేదు, భారతదేశంలో ఇదొక జీవన విధానమని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
The circular economy.
Where nothing is wasted.
Nothing new. Just a way of life in India… pic.twitter.com/j0UhQxjAmM— anand mahindra (@anandmahindra) July 11, 2024
Comments
Please login to add a commentAdd a comment