
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మండే మోటివేషన్ పేరుతో మరో ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు.
ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేస్తూ.. ''మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కండబలం మీకు ఉండవచ్చు'' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరాల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. బలంగా కండలు కలిగిన వ్యక్తి ఆస్ట్రేలియా అని, అతై ముందు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అని చూడవచ్చు. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆస్ట్రేలియా వ్యక్తి గెలుస్తాడని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆఫ్గనిస్తాన్ వ్యక్తి గెలుస్తారు. దీన్ని ఉదాహరణగా చెబుతూ.. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అని పేర్కొన్నారు.
Never underestimate yourself.
You may have more muscles than you imagine…#MondayMotivation
pic.twitter.com/vKiC23jJCU— anand mahindra (@anandmahindra) June 24, 2024