నేను అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను!.. ఆనంద్ మహీంద్రా | I Want To Move in There Permanently Anand Mahindra Tweet | Sakshi
Sakshi News home page

నేను అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను!.. ఆనంద్ మహీంద్రా

Published Thu, Jun 27 2024 9:56 PM | Last Updated on Thu, Jun 27 2024 9:57 PM

I Want To Move in There Permanently Anand Mahindra Tweet

దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ ఇలాంటి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. వర్షంలో ఒక కారునే మంచి నివాస ప్రాంతంగా మార్చడం చూడవచ్చు. ఇందులో ఓ మహిళ వర్షం పడుతున్న సమయంలో తన కారు వెనుక డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక టెంట్ మాదిరిగా ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత కారులోని సీట్లను కిందికి వంచి మంచి బెడ్ మాదిరిగా ఏర్పాటు చేసుకుని దానిపై ఓ దుప్పటి కూడా పరుస్తుంది. ఇది అప్పుడు ఓ అద్భుతమైన బెడ్ మాదిరిగా తయారవుతుంది.

ఇక కారుకి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన టెంటులో చిన్న టేబుల్స్ వంటివి ఏర్పాటు చేసుకుని రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్రదేశంగా రూపొందించుకుంటుంది. ఆ తరువాత స్నానం చేయడానికి మరో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకోవడం కూడా చూడవచ్చు. ఇలా మొత్తం మీద ఓ అద్భుతమైన గదిగా ఏర్పాటు చేసుకుంది.

ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది క్యాంపింగ్. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరోవైపు ప్రకృతిలో ఇలాంటి ఆనందం అద్భుతంగా ఉంటుందని, ఆనందన్ని పొందవచ్చని అన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement