సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మళ్ళీ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసి ఈ టెక్నాలజీ ఇప్పుడు కావాలి అంటూ వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న సంఘటన గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక రోబో బాత్‌రూమ్‌లోకి ప్రవేసించి.. బ్రష్ మరియు వైపర్ తీసుకుని మొత్తం శుభ్రపరచడం చూడవచ్చు. నిమిషాల వ్యవధిలో మొత్తం క్లీన్ చేసి బయటకు వెళ్ళిపోతుంది.
ఈ వీడియో షేర్ చేస్తూ.. వాణిజ్య, వ్యక్తిగత అవసరాలకు కొన్ని కంపెనీలు రోబోలను తయారు చేసుకుంటాయి. అయితే ఇక్కడ కనిపించే రోబో అమెరికాకు చెందిన సోమాటిక్ కంపెనీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ రోబోలను ఇప్పటికే పలు సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ఇలాంటి రోబోలు మనకు కూడా ప్రస్తుతం కావాలని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా?
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికి లక్షల మంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నార్తు. రాబోయే రోజుల్లో ఇంటి పనుల కోసం కూడా రోబోలు కావాల్సిన అవసరం ఉందని కొందరు తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు.
A robot Janitor by Somatic; cleaning bathrooms all by itself?Amazing!
— anand mahindra (@anandmahindra) January 19, 2024
As automakers, we are accustomed to using a variety of Robots in our factories.
But this application, I admit, is far more important.
We need them… NOW. 🙂pic.twitter.com/eOVKZpfzgn
Comments
Please login to add a commentAdd a comment