
ప్రముఖ వ్యాపారవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల ఒక వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి యంత్రాలను తయారు చేయడానికి ఎవరైనా సిద్ధమైతే పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ.. ట్వీట్ చేశారు. ఇంతకీ ఆనంద్ మహీంద్రాను అంతగా ఆకర్శించిన ఆ యంత్రం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఆటోమాటిక్ రోబోట్ వంటి యంత్రం తనకు తానుగానే నీటిలోని చెత్తను శుభ్రం చేస్తోంది. ఆ యంత్రం ఎలా పనిచేస్తుందనేది కూడా మీరు వీడియోలో గమనించవచ్చు.
నదులను శుభ్రపరిచే ఆటోమాటిక్ రోబో. ఇది చైనాలో తయారైనట్లు ఉంది. ఇలాంటివి ఇప్పుడు మనం కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి యంత్రాలకు సంబంధించి ఎవరైనా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే పెట్టుబడి నేను పెడతానని ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: నేను చాలా ఏళ్లుగా ఇదే చెబుతున్నా! 2024 బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా కామెంట్
వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఆటోమాటిక్ యంత్రం తనకు తానుగానే నీటిలోని చెత్తను లోపలికి లాక్కుంటోంది. ఇలాంటి యంత్రాలు మనదేశంలో ఉండే నదులను, జలాశయాలను శుభ్రపరచడానికి చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్శించేంస్తోంది.
Autonomous robot for cleaning rivers.
— anand mahindra (@anandmahindra) February 2, 2024
Looks like it’s Chinese?
We need to make these….right here…right now..
If any startups are doing this…I’m ready to invest…
pic.twitter.com/DDB1hkL6G1