Camping trip
-
నేను అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను!.. ఆనంద్ మహీంద్రా
దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేస్తూ ఇలాంటి దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. వర్షంలో ఒక కారునే మంచి నివాస ప్రాంతంగా మార్చడం చూడవచ్చు. ఇందులో ఓ మహిళ వర్షం పడుతున్న సమయంలో తన కారు వెనుక డోర్ ఓపెన్ చేసి అక్కడ ఒక టెంట్ మాదిరిగా ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత కారులోని సీట్లను కిందికి వంచి మంచి బెడ్ మాదిరిగా ఏర్పాటు చేసుకుని దానిపై ఓ దుప్పటి కూడా పరుస్తుంది. ఇది అప్పుడు ఓ అద్భుతమైన బెడ్ మాదిరిగా తయారవుతుంది.ఇక కారుకి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన టెంటులో చిన్న టేబుల్స్ వంటివి ఏర్పాటు చేసుకుని రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్రదేశంగా రూపొందించుకుంటుంది. ఆ తరువాత స్నానం చేయడానికి మరో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకోవడం కూడా చూడవచ్చు. ఇలా మొత్తం మీద ఓ అద్భుతమైన గదిగా ఏర్పాటు చేసుకుంది.ఈ వీడియో షేర్ చేస్తూ.. ఇది క్యాంపింగ్. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరోవైపు ప్రకృతిలో ఇలాంటి ఆనందం అద్భుతంగా ఉంటుందని, ఆనందన్ని పొందవచ్చని అన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.This is camping??I want to move in there permanently and claim tenancy rights to this ‘apartment.’ On the other hand, all the pleasures of being outdoors and as close to nature as possible without ‘devices’ are lost!pic.twitter.com/CAC7iOO7v7— anand mahindra (@anandmahindra) June 26, 2024 -
ఫ్యామిలీ వ్యాన్ లైఫ్
ఒక ఎస్యువి ఉంటే భ్రమణకాంక్ష ఉన్న జీవిత భాగస్వామి దొరికితే ఆ వెహికల్‌నే ఇల్లుగా మార్చుకుని దేశంలోని అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేయవచ్చా? చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రయాణాలకు తగ్గట్టుగా మార్చుకున్న వాహనంలో ఇలాగే తిరుగుతున్నారు. వైరల్ అయిన వారి ‘ఫ్యామిలీ వ్యాన్ లైఫ్’ గురించి... తిరిగే వాళ్లు ఎలాగైనా తిరుగుతారు. కాని కొందరు స్పెషల్. సొంతగా క్రెటా, మహింద్రా 400, ట్రైబర్... లాంటి పెద్ద బండి ఉంటే దానిని కస్టమైజ్డ్ ఇంటీరియర్స్‌తో క్యాంపర్ వ్యాన్‌గా మార్చుకుని కుటుంబం మొత్తం తిరిగే బృందాలు ఇప్పుడు ఇండియాలో పెరిగాయి. క్యాంపర్ వ్యాన్ ఉంటే రిజర్వేషన్లు అక్కర్లేదు. హోటల్ రూమ్‌లు అవసరం లేదు. సమయానికి చేరుకోకపోతే ఫ్లయిట్ మిస్ అవుతామన్న ఆందోళనా లేదు. బండే బస. బండే ప్రయాణ సాధనం. చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సొంత ఫ్యామిలీ వ్యాన్‌లో దేశమంతా తిరుగుతూ, ‘ఘుమ్మక్కడ్ బగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. వీరికి ఐదు లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. మహింద్రా 500 వాహనం డిక్కీని వీరు పూర్తి స్థాయి కిచెన్‌గా తయారు చేయించుకున్నారు. లోపలి సీట్లను బెడ్స్‌గా మార్చుకునేలా ఆల్టర్ చేయించారు. ఇవి కాకుండా హాల్ట్ చేసిన చోట బండి మీద టాప్ టెంట్ వేసుకుంటారు. బండికి ఆనుకుని చేంజింగ్ రూమ్ ఫాలిథిన్ కవర్స్‌తో ఏర్పాటు చేసుకుంటారు. దూరంగా గుంత తవ్వి చుట్టూ పాలిథిన్ çకవర్స్‌తో లావెటరీ ఏర్పాటు చేసుకుంటారు. బండిలోనే గ్యాస్, వంట దినుసులు, కూరగాయలు అన్నీ పెట్టుకునే వీలుంటుంది. కపిల్ బండి నడిపితే ఆగిన చోటల్లా చకచకా వంట ముగిస్తుంది చిక్కి. బయటి తిండి వల్ల ఆరోగ్యం పాడవడం ఒక్కటే కాదు.. సమయానికి తిండి దొరక్కపోతే ఇబ్బంది కనుక ఈ ఏర్పాటు. అందుకే వీరు దిగులూ చింతా లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరి పాపులారిటీ చూసి మరికొన్ని కుటుంబాలు తమ క్యాంపర్ వ్యాన్లతో వీరిని కలుస్తుంటాయి. అందరూ కలిసి గ్రూప్ క్యాంపింగ్ చేసి సరదాగా వొండుకుంటూ, ప్రకృతిని చూస్తూ. అక్కడే నిద్రపోతూ హాయిగా గడిపేస్తుంటారు. జీవితం అంటే అందమైన ప్రయాణం. చిక్కి, కపిల్ వీడియోల మీద ఆదాయం గడించడమే కాదు... గ్రూప్ క్యాంపింగ్ నిర్వహిస్తూ అలా కూడా డబ్బు గడిస్తున్నారు. టెన్ టు ఫైవ్ ఆఫీసుకు వెళుతూ సంపాదించేవారు ఎక్కువ మందైతే ఇలా రోజుకో కొత్త ప్రాంతంలో గడుపుతూ సంపాదించడం భిన్నమే కదా. -
ఈ టెంట్ ఉంటే అడవిలోనైనా హాయే! ప్రత్యేకతలు ఏంటంటే..
అడవుల్లోకి వెళ్లి అక్కడే టెంట్లు వేసుకుని గడపాలనే సరదా చాలామందికే ఉంటుంది. అడవుల్లో టెంట్లు వేసుకోవడం చాలా కష్టమైన పని. అడవుల్లో విద్యుత్తు సరఫరా ఉండదు. మరి టెంట్లలో మకాం చేసేవారి పరిస్థితి ఊహించుకోవాల్సిందే! ఇదివరకటి కాలంలో లాంతర్లు, విసనకర్రలు తీసుకువెళ్లేవారు. ఇటీవలి కాలంలో పోర్టబుల్ బ్యాటరీలు, రీచార్జబుల్ లైట్లు, ఫ్యాన్లు వంటివి తీసుకువెళుతున్నారు. ఇంత ఇబ్బంది లేకుండా, టెంట్లకు నేరుగా విద్యుత్తు సరఫరా ఉంటే పరిస్థితి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కదూ! ఇదే ఆలోచనతో అమెరికాకు చెందిన సోలార్ పరికరాల తయారీ సంస్థ ‘జాకెరీ’ ఏకంగా సోలార్ టెంట్‌ను రూపొందించింది. టెంట్ పైభాగంలో ఉన్న సోలార్ ప్యానెల్స్ సౌరశక్తిని గ్రహించి, ఇందులోని ‘ఫొటో వోల్టాయిక్ సోలార్ సెల్స్’లో 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేస్తాయి. ఈ విద్యుత్తుతో టెంట్లో లైట్లు, ఫ్యాన్లు వంటివి ఇంట్లో మాదిరిగానే వాడుకోవచ్చు. ఈ సోలార్ టెంట్లు నలుగురైదుగురు వరకు బస చేయడానికి అనువుగా రూపొందించారు. ఇటీవల జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2023 ప్రదర్శనలో దీనిని ప్రదర్శించారు. ఇది ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?) -
స్టయిలిష్ క్యాంపింగ్ గ్రిల్ తక్కువ ధరకే.. త్వరపడండి
అవుట్ డోర్ పార్టీలు.. లాంగ్ డ్రైవ్‌లు.. ఎంజాయ్ చెయ్యడానికి చాలా బాగుంటాయి కానీ.. ఆకలేసే సమయానికి నచ్చిన వంటకం దొరక్కుంటే మాత్రం ఆ ఎంజాయ్మెంట్ అంతా క్షణంలో ఆవిరైపోతుంది. అలాంటప్పుడే మనతో పాటు ఒక కంఫర్టబుల్ కుక్ వేర్, కొంత వంట సామాగ్రి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే ఈ క్యాంపింగ్ గ్రిల్. చూడటానికి చిన్న బ్రీఫ్కేస్లా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లొచ్చు. ఈ మేకర్‌ను ఓవర్ హీట్, స్క్రాచ్ రెసిస్టెన్స్, డిఫార్మేషన్ వంటి వాటిని తట్టుకోగల హైక్వాలిటీ స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందించారు. 130 చదరపు అంగుళాల బార్బెక్యూ గ్రిల్‌పై క్రిస్పీ రుచులను వేగంగా చేసుకోవచ్చు. కార్బన్ ఫైబర్ ట్రేలో బొగ్గులను నింపి.. నిప్పు రాజేస్తే.. ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. కారులో వెళ్లినా, బస్సు మీద వెళ్లినా.. ఫ్యామిలీతో వెళ్లినా, ఫ్రెండ్స్‌తో వెళ్లినా దీన్ని చాలా స్టయిలిష్‌గా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ధర 140 డాలర్లు (రూ.10,409) -
గట్టిగట్టిగా అరుస్తూ...
-
ఎలుగుబంటి కారు ఎక్కడం చూశారా? వీడియో వైరల్
సరదాగా ప్రకృతి ఒడిలో సరదాగా సేద తీరుతూ ఆహ్లాదంగా గడుపుదామని క్యాంపింగ్‌కు వెళ్తున్న ఓ కుటుంబానికి ఊహించని పరిణామం ఎదురైంది. మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుందామని ఆ అటవీ ప్రాంత అందాలను కెమెరాలో బంధిస్తున్న వారి కారును ఎవరో అకస్మాత్తుగా హైజాక్ చేశారు. అనుకోని అతిథి కనిపించడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా ఎలుగుబంటి. ఇంతకీ ఏం జరిగిందంటే...జోస్ లూయిస్ ఫ్యామిలీతో సహా అటవీ ప్రాంతానికి విహారయాత్రకు బయలుదేరారు. అక్కడ కారు దిగి ప్రకృతి అందాలను ఫోన్లో బంధిస్తుంటే..అకస్మాత్తుగా ఓ పెద్ద ఎలుగుబంటి చేరుకొని అక్కడ ఎవరూ లేకపోవడంతో దర్జాగా కారు తెరిచి లోపలికి ఎక్కే ప్రయత్నం చేసింది. ఈ మొత్తం వ్యవహరాన్ని కొంత దూరం నుంచి చూస్తున్న వారికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేశారు. దీంతో ఒకింత ఆందోళనకు గురైన ఎలుగుబంటి కారు లోపలికి ఎక్కకుండానే కాస్త వెనక్కి తగ్గి అట్నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ వీడియోను 28,300 మంది చూశారు. నాకు కూడా మీ కారులో లిఫ్ట్ ఇస్తారా?? వద్దు లేండీ నా నిర్ణయాన్ని మార్చుకున్నా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. (వైరల్.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం! ) -
ఆ మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ ఏయే పార్టీల మధ్య ఉంటుందనే స్పష్టత వచ్చింది. జిల్లాలో తొమ్మిది స్థానాల్లో మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు దీటుగా ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. జిల్లాలో తొమ్మిది స్థానాలకు మొత్తం 119 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద లేకుండా పోయింది. దీంతో ఆయా స్థానాల్లో నెలకొనే పోటీపై స్పష్టత వచ్చినట్లయిం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బీన్‌హందాన్‌లు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అనూహ్యంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణగుప్త పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గంలో గట్టి పోటీనిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, గడ్డం కేశ్‌పల్లి ఆనందర్‌రెడ్డిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండటంతో రూరల్ రణరంగాన్ని తలపిస్తోంది. బోధన్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు షకీల్ ఆమేర్, పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఆర్మూర్‌లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆకుల లలిత మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ అభ్యర్థులు పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డిలు కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. బాల్కొండలో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనీల్‌లు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముత్యాల సునీల్‌రెడ్డి తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు బలంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పోరు రసవత్తరంగా తయారైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు తమ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎల్లారెడ్డిలో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి బరిలో ఉండటంతో ఇక్కడ పోరు జోరందుకుంది. బాన్సువాడలో ద్విముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుల మధ్య పోరు సాగుతోంది. జుక్కల్‌లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే, కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంలు సై అంటే సై అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పలు స్థానాల్లో బీఎల్ఎఫ్, బీఎస్పీ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ఆమ్ఆద్మీ, పిరమిడ్‌పార్టీ ఆఫ్ ఇండియా, సమాజ్‌వాది పార్టీ, శివసేన, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ వంటి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
ఇక సమరమే..
సాక్షి, భూపాలపల్లి: ముందస్తు ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండబోతున్నారో లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో ఇద్దరు, ములుగులో ముగ్గురు మొత్తం ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో భూపాలపల్లి ఎన్నికల బరిలో 14 మంది, ములుగులో 12 మంది పోటీలో మిగిలారు. ములుగు నియోజకవర్గంతో పోలిస్తే ఈసారి భూపాలపల్లిలో హోరాహోరీ తప్పకపోచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు డిసెంబర్ 7వ తేదీన తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భూపాలపల్లిలో హోరాహోరీ.. భూపాలపల్లిలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉండనుంది. ఈ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులు బలంగా ఉన్నారు. 2009, 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డితోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గండ్ర సత్యనారాయణరావు ప్రధానంగా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ రద్దు అనంతరం నుంచే ఈ నలుగురు నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సారి 14 మంది అభ్యర్థులు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి 14 మంది పోటీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో 12 మంది ఉండగా.. 2009 ఎన్నికల్లో 18 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగింది. ప్రస్తుతం చతుర్ముఖ పోరు నెలకొంది. అలాగే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. పోటీదారులు ఎక్కువైతే మెజారిటీతోపాటు గెలుపు అవకాశాలు సైతం దెబ్బతింటాయి. అందుకే భూపాలపల్లి నియోజకవర్గంలో హోరాహోరీ తప్పకపోవచ్చు. ఎవరు గెలిచిన పెద్దగా మెజారిటీ రాదని ప్రజలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా నోటాతో కలిపి మిగిలిన వారు 9,070 ఓట్లు సాధించారు. ఈసారి ఇంత మొత్తంలో ఓట్లు స్వతంత్ర సభ్యులకు బదిలీ అయితే గెలుపొందే వారి మెజారిటీపై తప్పకుండా ప్రభావం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ములుగులో పరిస్థితి.. ములుగులో ఈ సారి 12 మంది ఎన్నికల బరిలో నిలిచారు. భూపాలపల్లితో పోలిస్తే ఈ నియోజకవర్గంలో పోటీ తక్కువగానే ఉంది. ప్రధాన పార్టీల నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే కీలక పోటీ ఉండనుంది. 2009 ఎన్నికల్లో ములుగు నుంచి 9 మంది, 2014లో 11 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్లకు 13,140 ఓట్లు పోలయ్యాయి. 2009, 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీగా టీడీపీ ఉండేది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సీతక్క కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీకీ ప్రాతిని«థ్యం లేకుండా పోయింది. నియోజకవర్గంలో ప్రస్తుతం చందూలాల్, సీతక్కల మధ్యే పోటీ ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులకు పడే ఓట్లు మెజారీటిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భూపాలపల్లిలో ఇద్దరి విత్‌డ్రా భూపాలపల్లి: భూపాలపల్లి అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు మిగిలారు. ఈ స్థానానికి మొత్తం 17 నామినేషన్లు రాగా స్క్రూటిని సమయంలో అర్షం అశోక్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించగా 16 మంది మిగిలారు. స్వతంత్ర అభ్యర్థులు కేతిరి క్రాంతికుమార్, సిరికొండ ప్రశాంత్ తమ నామినేషన్లను ఉపసహరించుకోవడంతో 14 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించి వారికి గుర్తులను కేటాయించారు. ములుగులో ముగ్గురు ఉపసంహరణ.. ములుగు: ములుగు శాసనసభ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ అనిమేష్‌దాస్ తెలిపారు. ఈ స్థానానికి 15 మంది నామినేషన్లు వేయగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. మిగిలిన వారికి అధికారులు ఎన్నికల గుర్తులను కేటాయించారు. కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ రమాదేవి, తహసీల్ధార్ గనియా ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
అండగా ఉంటా.. ఆదరించండి..
నియోజకవర్గంలోని ప్రతి గ్రా మాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అండగా నిలుస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చల్లా ధర్మారెడ్డి ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని కమలాపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరకాల రూరల్: నియోజకవర్గంలోని ప్రతి గ్రా మాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అండగా నిలుస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చల్లా ధర్మారెడ్డి ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని కమలాపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తామని, ఆయా పథకాలను దేశంతోపాటు ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సుమారు కోటి రూపాయల మేర అభివృద్ధి జరిగిందన్నా రు. గ్రామానికి ఇటీవలే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూ రైందని, ఉగాది వరకు ఆ ప్రాజెక్టు నిర్మా ణం పూర్తి చేసి గ్రామంలోని ప్రతి ఎకరాకు రెండో పంటకు నీరందిచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరకాల నుంచి వెంకటేశ్వర్లపల్లి మీదుగా జమ్మికుంట వరకు బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు మల్లక్కపేట నుంచి గ్రామానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో నియోజకవర్గ రూపురేఖలు మార్చి ఇక్కడి నుంచి కొందరు పారిపోయారని కొండా దంపతులను ఉద్దేశించి మాట్లాడారు. నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇంటికి పెద్దన్నలా కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుం»బం లబ్ధిపొందేలా పథకాలను రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగా ణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే సామర్థ్యం ఒక్క కేసీఆర్‌కు ఎందన్నారు. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి మరోసారి టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, టీఆర్ఎస్ నాయకులు పాడి ప్రతాప్ రెడ్డి, బీముడి నాగిరెడ్డి, నందికొండ జైపాల్ రెడ్డి , గురిజపల్లి ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు.. కేటీఆర్ సభ...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీశాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం కల్వకుర్తికి రానున్నారు. రానున్న ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా ఏర్పాటుచేసే ప్రచార సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కల్వకుర్తి ప్రచారసభకు గతంలోనే ఓసారి ముహూర్తం ఖరారైనా అనూహ్య పరిణామాల నేపథ్యంలో వాయిదా వేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వ్యవహారం టీఆర్ఎస్కు కొరకరాని కొయ్యలా తయారైంది. తనకు టికెట్ నిరాకరించారనే నిరాశతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేసిన ఆయన అనుచరులు కసిరెడ్డి బరిలో నిలవాలంటూ తీర్మానాలు చేస్తున్నారు. దీంతో ఆయన కూడా ఇండిపెండెంట్‌గా పోటీకి దిగాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ముఖ్యనేతలు కసిరెడ్డితో ఎన్ని పర్యాయాలు సంప్రదింపులు జరిపినా... వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో వదిలేశారు. దీంతో మంత్రి కేటీఆర్ కల్వకుర్తి పర్యటనను ఖరారు చేశారు. ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్... మంత్రి కేటీఆర్ సభను విజయవంతం చేసి బలం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికల బరిలో నిలిచే అంశమై సభ జరగనున్న గురువారమే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వదులుకున్నట్లే... కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వ్యవహారం టీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. అసెంబ్లీ రద్దు అనంతరం అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి కల్వకుర్తి వ్యవహారం టీఆర్ఎస్ అధిష్టానాన్ని చికాకు పెట్టిస్తోంది. అలాగే కల్వకుర్తి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు గుర్రుగా ఉన్నారు. అభ్యర్థులను ప్రకటించిన రోజే పార్టీ ముఖ్యనేత బాలాజీసింగ్ అనుచరులు ఏకంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిని లేకుండా చేసేందుకు మంత్రి కేటీఆర్ పలుమార్లు చర్చలు జరిపారు. ఆశావహులందరికీ అన్ని విధాలుగా నచ్చజెప్పి పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని సూచించారు. మిగతా అందరి వ్యవహారం సద్దుమణిగినా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా కసిరెడ్డి అనుచరులు నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ టికెట్ నిరాకరించినందున.. స్వతంత్ర బరిలో నిలవాలంటూ పట్టుబడుతున్నారు. అంతేకాదు హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు ప్రతీ రోజు వెళ్లి ఇదే విషయమై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన కూడా కార్యకర్తల మనోభీష్టం మేరకు బరిలో ఉండేందుకు అంగీకరించినట్లు వారి అనుచరులు పేర్కొంటున్నారు. ఇక చేసేదేం లేక టీఆర్ఎస్ అధిష్టానం కూడా కసిరెడ్డిని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14న వెల్దండలో కేటీఆర్ సభ జరగాల్సి ఉన్నా... కసిరెడ్డి విషయం ఎటూ తేలకపోవడంతో వాయిదా వేశారు. ఏం చేస్తారో... కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున గత మూడేళ్లుగా అన్నీ తానై నడిపించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశగా మారింది. రాష్ట్ర స్థాయిలో పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారి విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఆయా నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మిగతా వారికి కఠిన హెచ్చరికలు పంపుతోంది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి ఎన్నికల బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి కేటీఆర్ గురువారం కల్వకుర్తికి రానున్న నేపథ్యంలో ఈ సభకు ఎమ్మెల్సీ డుమ్మా కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు కసిరెడ్డి సైతం గురువారమే తాను బరిలో నిలిచే విషయమై ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధి ష్టానం కూడా కల్వకుర్తి సభా వేదికగా లేదా అనంతరం కసిరెడ్డిని సస్పెండ్ చేస్తూ చేప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం. కసిరెడ్డి ఫొటో లేకుండానే ఫ్లెక్సీలు కల్వకుర్తి : కల్వకుర్తిలో గురువారం జరగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ హాజరుకానుండడంతో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ సభ విజయవంతానికి శ్రేణుల సాయంతో కృషి చేస్తున్నారు. కాగా.. అభ్యర్థిగా జైపాల్‌ను ప్రకటించిన నాటి నుంచి అసమ్మతి రాగం ఆలపిస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కల్వకుర్తి సభకు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తుండగా.. పార్టీ కూడా ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు జైపాల్‌యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కసిరెడ్డి ఫొటో లేకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. కేటీఆర్ పాల్గొనున్న సభావేదికపై ఏర్పాటుచేయనున్న ఫ్లెక్సీని కూడా కసిరెడ్డి ఫొటో లేకుండా సిద్ధం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీపై చర్యలు తీసుకునే క్రమంలోనే అధిష్టానం నుంచి వచ్చిన సూచనలతో ఇలా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బలం..జనం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మక్తల్, అచ్చంపేటల్లో భారీ బహిరంగ సభలలో పాల్గొననునన ఆయన ఎన్నికల వేళ పార్టీ కేడర్‌ను ఉత్సాహపరచనున్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఉదయం 11గంటలకు మక్తల్ చేరుకుంటారు. అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక హెలీకాప్టర్‌లో అచ్చంపేటకు చేరుకుని అక్కడ 2గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మంత్రి కేటీఆర్ బహిరంగ సభలను విజయవంతం చేయడాన్ని బరిలో నిలిచే అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి జనాన్ని తరలించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా నియోజకవర్గంలో తమ బలాన్ని నిరూపించుకున్నట్లవుతుందని భావిస్తున్నారు. పైచేయి సాధించేందుకే.. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు సంబంధించి మక్తల్, అచ్చంపేటలో పార్టీ నేతలు కొందరు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. మక్తల్‌లో అసమ్మతి నేతలు పార్టీలో ఉంటూనే వేరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే అచ్చంపేటలో పార్టీ అభ్యర్థిపై కొందరు అసమ్మతి రాగం వినిపిస్తూ పార్టీని వీడుతున్నారు. మక్తల్ అసమ్మతిని చల్లార్చే బాధ్యతలను ఎంపీ జితేందర్‌రెడ్డికి పార్టీ అధిష్టానం అప్పగించినా ఓ కొలిక్కి రావడం లేదు. ఇక అచ్చంపేటలో ఉన్న చిన్న పాటి మనస్పర్ధలను సరిచేసే బాధ్యతలను మంత్రి జూపల్లికి అప్పగించారు. అయితే, అక్కడ కూడా పరిస్థితులు చక్కబడడం లేదు. ఈ నేపథ్యంలో రెండు నియోజకవర్గాల్లో పార్టీని గాడిన పెట్టేందుకు టీఆర్ఎస్ అధిష్టానమే నేరుగా రంగంలోకి దిగింది. ఇలా అసమ్మతి వర్గంపై పైచేయి సాధించేందుకు మంత్రి కేటీఆర్ రంగప్రవేశం చేశారు. బహిరంగ సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో ఊపు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలో ఉండే లుకలుకలను పక్కన పెట్టి అభ్యర్థి కోసం పని చేయాలనే మెస్సేజ్‌ను ఈ వేదికల ద్వారా పంపించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి మంత్రం తలాఫున కృష్ణమ్మ ప్రవహిస్తున్నా... పాలమూరులో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను టీఆర్ఎస్ నాలుగేళ్ల కాలంలో ఓ కొలిక్కి తీసుకొచ్చి భారీగా భూములను సాగులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ప్రతీ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధిపై ఇప్పటికే ఒక నివేదిక రూపంలో అందజేశారు. మంత్రి కేటీఆర్ కూడా మక్తల్, అచ్చంపేటల్లో జరిగే సభల ద్వారానాలుగేళ్లుగా చోటు చేసుకున్న అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి కేటీఆర్ ప్రసంగం కోసం రెండు నియోజకవర్గాల్లోని కీలకమైన అంశాలను ఒక నోట్ రూపంలో అందజేసినట్లు సమాచారం. అలాగే మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ఆయన ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. భారీ జన సమీకరణ నియోజకవర్గ స్థాయి సభ మాత్రమే అయినప్పటికీ జనసమీకరణ విషయంలో పార్టీ అభ్యర్థులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి జనాన్ని తీసుకొచ్చేందుకు బాధ్యతను కార్యకర్తలకు అప్పగించారు. మక్తల్ బహిరంగ సభ కోసం పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గత నాలుగైదు రోజులుగా తీవ్రంగా కృషిచేస్తున్నారు. పక్కా ప్రణాళికతో జనసమీకరణపై దృష్టి కేంద్రీకరించారు. తద్వారా మక్తల్‌లో అసమ్మతి నేతలపై పై చేయి సాధించాలని భావిస్తున్నారు. అలాగే అచ్చంపేటలో 10 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ అభ్యర్థి గువ్వల బాల్‌రాజ్ సైతం ఈ సభకు భారీగా జన సమీకరణ చేసి తన బలం నిరూపించుకోవాలని కృషి చేస్తున్నారు. -
కమలంలో జోష్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కమలదళంలో కొత్త ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని ముఖ్యనేతల వరుస పర్యటనలతో పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దించుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఒక్క రోజే కేంద్ర మంత్రి జే.పీ.నడ్డా, బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత కిషన్‌రెడ్డిలు సుడిగాలి పర్యటనలు చేసి ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గెలుచే అవకాశమున్న స్థానాలను వదులుకోకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. ఆయా స్థానాల్లో అవలంభించాల్సిన ప్రచారంపై సూచనలు ఇచ్చారు. అలాగే జిల్లా పార్టీ ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులు ఎక్కడిక్కడ వాలిపోయారు. జిల్లాలో పార్టీ ప్రచారశైలి, నిధుల ఖర్చు తదితర కీలకమైన అంశాలను స్వయంగా పార్టీ హైకమాండ్ పర్యవేక్షిస్తోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు సర్వేలతో నియోజకవర్గాలో అభ్యర్థి బలాలు, బలహీనతలపై నివేదికలు తయారు చేస్తూ ప్రచారాన్ని కొంత పుంతలు తొక్కిస్తున్నారు. పక్కా ప్రణాళిక మహబూబ్‌నగర్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలకు గాను బీజేపీ ప్రస్తుతం రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మక్తల్ నుంచి కొండయ్య, నారాయణపేట నుంచి రతంగ్‌పాండురెడ్డి అభ్యర్థిత్వాలను ఇటీవల ఖరారు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అతి ముఖ్యంగా పాలమూరు జిల్లాపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో కేంద్ర మంత్రుల పర్యటనలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న కేంద్రమంత్రి జే.పీ.నడ్డా మొట్ట మొదటి ఎన్నికల ప్రచారాన్ని జిల్లా నుంచే ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం మక్తల్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై బీజేపీ గెలుపు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించారు. అలాగే బీజేపీ శాసనసభా పక్ష తాజామాజీ జి.కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడలో ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీ మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ మండలం పరిధిలోని శక్తి కేంద్రాలతో పాటు ఓటరు జాబితాలోని ఒక్కో పేజీ(పన్నా)కి ఒక్కొక్కరు ఇన్చార్జిలుగా వ్యవరించాలని సూచిస్తూ వారి బాధ్యతలను గుర్తు చేశారురు. ఓటరు జాబితాలోని 15 మంది ఓటర్లకు ఒకరు పన్నా ఇన్చార్జిగా వ్యవహరించి వారిని పార్టీ అభ్యర్థికి ఓటు వేసేలా చూడాలని సూచించారు. బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత, దేశసమగ్రత వంటి వాటిని ఉద్బోదిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. టీఆర్ఎస్పై పెంచుతున్న డోస్ బీజేపీ ఓవైపు సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూనే మరో వైపు విపక్షాలపై విమర్శల దాడిని పెంచుతోంది. ముఖ్యంగా నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శల జడివాడ కురిపిస్తున్నారు. ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలపై పడుతున్న భారం.. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రధానంగా ప్రస్తావిస్తూనే.. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ – ఎంఐఎం స్నేహాన్ని ప్రస్తావిస్తూ రజాకార్ల పాలన అంటూ ప్రజల్లో బావోద్వేగాలను పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తోందని లెక్కలను వివరిస్తున్నారు. అలాగే పాలమూరుకు సంబంధించి వలదదసల అంశాన్ని ప్రస్తావిస్తూ... ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ దుయ్యబడుతోంది. ఇంకా తలాఫున కృష్ణమ్మ పారుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందంటూ విమర్శలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, టీడీపీల వైఫల్యాలను కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా ప్రత్యామ్నాయ పార్టీగా ఈసారి బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రజలను కోరుతున్నారు. -
ప్రజల అభ్యున్నతే టీఆర్ఎస్ లక్ష్యం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ప్రజల ప్రగతే టీఆర్ఎస్ లక్ష్యమని, ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల టీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం ఆదివారం రాత్రి హిమయత్‌నగర్‌లో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అనేక సంక్షేమ పథ«కాలతో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషిచేశారని అన్నారు. కాలే యాదయ్యను గెలిపించేందుకు అందరూ కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, టీఆర్ఎస్ విజయన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మళ్లీ మంత్రిగా తానున ఉంటానని, చేవెళ్ల నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషిచేస్తానని, గ్రామాలభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తానని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కష్టపడి పనిచేస్తే పార్టీ అభ్యర్థి విజయం తథ్యమని అన్నారు. వృద్ధులకు ఫించన్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, రైతు బంధు, పెట్టుబడి సహాయం గ్రామీణ రోడ్లు అభివృద్ధి, ఇంటింటికి నల్లా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత్‌రెడ్డి, జిల్లా మత్స్యకార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు వెంకటపూర్ బాల్‌రాజ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ శ్రీహరియాదవ్, పీఏసీఏస్ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మంగలి పెంటయ్య, డప్పు ఆనంద్, యాదయ్య, నాయకులు గుండుగోపాల్, పాండుగౌడ్, మంగలి రాములు, అద్వాని, అలకుంట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కాస్త రెస్ట్
పోలింగ్‌కు యాబై రోజుల వరకు గడువు ఉండటంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారానికి కాస్త విరామం ఇస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన అభ్యర్థులు ఇదే జోరు కొనసాగిస్తే ఖర్చు తడిసి మోపెడవుతోందని భావిస్తున్నారు. సొంత పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించడం, అసోసియేషన్లు, కుల సంఘాల మద్దతు కూడగట్టడంలో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు కూడా ఖరారు కాలేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో కాస్త దూకుడు తగ్గించారు. నెమ్మదిగా కొనసాగిస్తున్నారు. ఇంటింటి ప్రచారం కంటే సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దుకునే పనులపై దృష్టి సారించారు. అసోసియేషన్లు, కుల సంఘాల మద్దతు కూడగట్టడం ద్వారా అధిక సంఖ్యలో ఓట్లు రాబట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటర్లను నేరుగా కలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిన అభ్యర్థులకు ఇంటింటి ప్రచారానికి ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. వారి అభ్యర్థిత్వాలు ఖరారై 40 రోజులు దాటింది. పోలింగ్‌కు మారో 50 రోజులకుపైగా గడువుంది. ఈ తరుణంలో ఇంటింటి ప్రచారం ఇదే స్థాయిలో కొనసాగిస్తే ఆర్థిక పరమైన భారం పడుతుందని భావిస్తున్న అభ్యర్థులు ప్రచారానికి అ ప్పుడప్పుడు కొద్దిగా విరామం ఇస్తున్నా రు. నాలుగురోజులు నియోజకవర్గంలో కలియదిరుగుతూ.. రెండు, మూడు రోజు లు హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. సెప్టెంబర్ 6న తొ మ్మిది నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మె ల్యేలనే అభ్యర్థులుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఉ త్సాహంగా ఎన్నికల ప్రచారంలోకి దిగా రు. ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని జోరుగా సాగించారు. అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలకు నిజామాబాద్ నుంచే శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 3న న గరంలో భారీ బహిరంగ సభను నిర్వహిం చారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేశారు. ఈ సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాగా, పోలింగ్ డిసెంబర్ 7న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్‌కు మరో 50 రోజులు గడువుండటంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని కాస్త తగ్గించారు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సైతం ఇంకా ఖరారు కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు సంబంధించి రెండు, మూడు చోట్ల మాత్రమే అభ్యర్థిత్వాలపై స్పష్టత వచ్చింది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలు ఓ కొలిక్కి రావడంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. మిగిలిన ఆరు చోట్ల అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం, పొత్తుల్లో భాగంగా ఏ సీటు టీడీపీకి గానీ, టీజేఎస్‌కు గానీ వెళుతుందో స్పష్టత లేకపోవడంతో ఈ ఆరు చోట్ల కాంగ్రెస్ ఇంకా ప్రచారానికి శ్రీకారమే చుట్టలేదు. బీజేపీ అభ్యర్థుల విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ఆచితూచి ప్రచారం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభావితం చూపగలిగే నాయకులను పిలిచి మాట్లాడే పనిలో ఉన్నారు. అలాగే సొంత పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. దసరా తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో మళ్లీ దూకుడును పెంచుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
స్టాలిన్ ఎట్రాక్షన్
డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ గురువారం చెన్నైలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఓట్ల వేటకు నడక పయనం సాగిస్తూ రోడ్ల వెంబడి ఉన్న వాళ్లను పలకరిస్తూ ముందుకు సాగారు. సాక్షి, చెన్నై : డీఎంకే దళపతి ఎంకే.స్టాలిన్ ఈ సారి స్టైలిష్ అవతారంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచార పర్యటన సాగి ఉన్నది. ఇక, చెన్నైలో సమయం దొరికినప్పుడల్లా ప్రచారం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఆయన చెన్నైలో మరింత ఆకర్షణగా మారారు. బుధవారం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రచార వాహనంలో చెన్నైను చుట్టి వస్తే, తన రూటే సెపరేట్ అన్నట్టుగా స్టాలిన్ ఎట్రాక్షన్ ప్రచారం సాగింది. ఉదయాన్నే ఎగ్మూర్ నియోజకవర్గం పరిధిలోకి స్టాలిన్ వాహనం దూసుకెళ్లింది. వాహనం ఓ చోట పార్కింగ్ చేసి, తదుపరి నడకతో ఓట్ల వేటలో పడ్డారు. స్టాలిన్ హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో జనం పరుగులు తీశారు. యువత కరచాలనానికి ఎగబడ్డారు. కొందరు అయితే, సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్న చిన్న వీధుల్లో నడుచుకుంటూ అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగారు. మహిళలు అత్యధికంగా ఉన్న చోట మాత్రం ఆగి మరీ వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, ఎగ్మూర్ అభ్యర్థి రవి చంద్రన్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎగ్మూర్‌లోని పలు ప్రాంతాల్లో నడకతో అందర్నీ పలకరించిన స్టాలిన్ తదుపరి, టీనగర్ నియోజకవర్గం అభ్యర్థి కనిమొళికి మద్దతుగా వడపళని నుంచి నడక ప్రచారం మొదలెట్టారు. మండుటెండలో స్టాలిన్ నడిచి వస్తుండడంతో అక్కడున్న ఓ కొబ్బరి బొండాం వ్యాపారి పరుగున ఓ బొండం అందించారు. దానిని స్వీకరిస్తున్న స్టాలిన్‌ను చూడగానే, అటు వైపుగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందంలోని వరుడు పరుగులు తీశారు. స్టాలిన్‌తో ఫొటో దిగి ఆనందాన్ని పంచుకున్నాడు. అక్కడి పూల వ్యాపారులు స్టాలిన్‌కు రోజా పువ్వులు ఇచ్చి ఆహ్వానించారు. మార్కెట్ పరిసరాల గుండా కోడంబాక్కం వైపుగా స్టాలిన్ నడకతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. తదుపరి సైదాపేటకు చేరుకుని అక్కడి అభ్యర్థి ఎం సుబ్రమణియన్‌తో కలసి పరుగులు తీశారు. తదుపరి హార్బర్లో శేఖర్‌బాబుకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. తన పర్యటనలో ఓ చిన్నారికి అరవింద్ అన్న నామకరణం కూడా చేశారు. చిన్న పిల్లలు పలువురు స్టాలిన్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడగా, యువతీ, యువకులు కరచాలనం, సెల్ఫీల కోసం పరుగులు తీశారు. వాహనంలో కూర్చుని రోడ్డు మీద రయ్యూమంటూ దూసుకెళ్లే ప్రచారం తనది కాదని, ప్రజల్లో ఒక్కడికి కలిసి మెలిసి తిరుగుతూ ఆకర్షించేడమే తన పయనం అన్నట్టుగా స్టైలిష్ స్టాలిన్ ప్రచారం సాగడం విశేషం.