ప్రజల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ లక్ష్యం  | Patnam Mahender Reddy Election Camping In Rangareddy | Sakshi
Sakshi News home page

ప్రజల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ లక్ష్యం

Published Tue, Oct 23 2018 11:15 AM | Last Updated on Tue, Oct 23 2018 11:15 AM

Patnam Mahender Reddy Election Camping In Rangareddy - Sakshi

పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి

మొయినాబాద్‌ రూరల్‌(చేవెళ్ల): ప్రజల ప్రగతే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని, ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్‌ మండల టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుల సమావేశం ఆదివారం రాత్రి హిమయత్‌నగర్‌లో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి  మాట్లాడుతూ  అనేక సంక్షేమ పథ«కాలతో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్‌ ఎంతో కృషిచేశారని అన్నారు.

 కాలే యాదయ్యను గెలిపించేందుకు అందరూ కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్‌   అధికారంలోకి వస్తుందని, టీఆర్‌ఎస్‌ విజయన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మళ్లీ మంత్రిగా తానున ఉంటానని, చేవెళ్ల నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషిచేస్తానని, గ్రామాలభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తానని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కష్టపడి పనిచేస్తే పార్టీ అభ్యర్థి విజయం తథ్యమని అన్నారు.  వృద్ధులకు ఫించన్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, రైతు బంధు, పెట్టుబడి సహాయం గ్రామీణ రోడ్లు అభివృద్ధి, ఇంటింటికి నల్లా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత్‌రెడ్డి, జిల్లా మత్స్యకార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు వెంకటపూర్‌ బాల్‌రాజ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ శ్రీహరియాదవ్, పీఏసీఏస్‌ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మంగలి పెంటయ్య, డప్పు ఆనంద్, యాదయ్య, నాయకులు గుండుగోపాల్, పాండుగౌడ్, మంగలి రాములు, అద్వాని, అలకుంట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement