సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో 11 స్థానాలను అధికార టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రచారం చేసినా పలితం లేకపోయింది. కేసీఆర్ సంక్షేమ పధకాల ముందు కూటమి ఎత్తుగడలు పనిచేయలేదు. గత ఎన్నికల్లో 4 స్ధానాలతో సరిపెట్టుకున్న టీఆర్‌ఎస్ ఇప్పుడు ఏకంగా 11 స్థానాలలో విజయకేతనం ఎగరవేసింది. గతంలో రెండు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 3స్థానాలతో సరిపెట్టుకుంది. 2014 ఎన్నికల్లో ఒక స్ధానం గెలుపొందిన బీజేపీ ఈ సారి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.
సంక్షేమ పథకాలతోనే విజయం
గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు టీఆర్‌ఎస్ విజయంలో ఎంతో కీలకపాత్ర పోషించాయి. ప్రజాకర్ష పథకాలతో లబ్దిపొందిన తెలంగాణ ప్రజలు ఓట్లతో టీఆర్‌ఎస్‌ను ఆదరించారు. జిల్లాల విభజన, నగరంలో జరిగిన అభివృద్ది టీఆర్‌ఎస్ విజయానికి ఎంతగానో ఉపయెగపడ్డాయి.
పట్టునిలుపుకోలేకపోయిన హస్త..
గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి ఒక స్థానం పెంచుకొని మూడు స్థానాల్లో గెలిచింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందని పలువురు రాజకీయ విశ్లేశకులు అంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడం టీఆర్‌ఎస్‌కు కలసివచ్చింది.
కూకట్‌పల్లిలో ఓడిన సుహాసిని
కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని టీఆర్‌ఎస్ అభ్యర్ధి మాదవరం కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ హీరో ఎపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం చేసిన లాభం లేకపోయింది. బీజేపీ గతంలో ఒక్క స్ధానం గెలుచుకోగా ప్రస్తుత ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది.
నియోజకవర్గం | అభ్యర్ధి | పార్టీ |
మేడ్చల్ | సీ హెచ్ మల్లారెడ్డి | టీఆర్‌ఎస్ |
మల్కాజ్‌గిరి | మైనంపల్లి హన్మంతరావు | టీఆర్‌ఎస్ |
కుత్బుల్లాపూర్ | కేపీ వివేకానంద | టీఆర్‌ఎస్ |
కూకట్‌పల్లి | మాధవరం కృష్ణారావు | టీఆర్‌ఎస్ |
ఉప్పల్ | భేతి సుభాష్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
ఇబ్రహీంపట్నం | మంచిరెడ్డి కిషన్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
ఎల్ బీ నగర్ | దేవిరెడ్డి సుదీర్ రెడ్డి | కాంగ్రెస్ |
మహేశ్వరం | సబితా ఇంద్రారెడ్డి | కాంగ్రెస్ |
రాజేంద్రనగర్ | టీ ప్రకాశ్ గౌడ్ | టీఆర్‌ఎస్ |
శేర్‌లింగంపల్లి | ఆరెకెపూడి గాంధీ | టీఆర్‌ఎస్ |
చేవేళ్ల (ఎస్పీ) | కాలె యాదయ్య | టీఆర్‌ఎస్ |
పరిగి | కొప్పుల మహేశ్ రెడ్డి | టీఆర్‌ఎస్ |
వికారాబాద్ (ఎస్సీ) | డాక్టర్ మెతుకు ఆనంద్ | టీఆర్‌ఎస్ |
తాండూర్ | రోహిత్ రెడ్డి | కాంగ్రెస్ |
Comments
Please login to add a commentAdd a comment