
గుర్రంపోడు: టీఆర్‌ఎస్ అమలు చేస్తున్నవి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహిం చిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ లాంటి పథకాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినవేనని, ఇప్పుడు కేసీఆర్ కొత్తగా చేసిందేమి లేదన్నారు. ఈ పథకాలు తీసేసే ధైర్యం ఎవరకీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని ఎవరూ అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తమ ఎన్నికల హామీలను టీఆర్‌ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు.