హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని సీఎల్పీ మాజీ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేసింది. ఇప్పటికే దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సందేహాలను వ్యక్తం చేయగా, జానారెడ్డి సైతం ఈవీఎంలలోని వీవీ ప్యాట్స్ స్లిప్‌లను లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ దానికి సమ్మతి తెలపకపోతే, కోర్టుల్లోనే తేల్చుకుంటామన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా ప్రజా సేవ చేస్తానని జానారెడ్డి తెలిపారు.
ఈ ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన జానారెడ్డి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో పరాజయం చెందారు. ఏడువేలకు పైగా ఓట్ల తేడాతో జానారెడ్డి ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment