తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పవన్‌ స్పందన | Pawan Kalyan HeartFull Wishes To Telangana CM KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పవన్‌ స్పందన

Published Tue, Dec 11 2018 6:55 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan HeartFull Wishes To Telangana CM KCR - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావుతోపాటు పార్టీ శ్రేణులకు ట్వీటర్‌ వేదికగా పవన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఫలితాలపై పవన్ ఓ లేఖను విడుదల చేశారు. ‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.

ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు. ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’ అని లేఖలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement