
అవుట్ డోర్ పార్టీలు.. లాంగ్ డ్రైవ్‌లు.. ఎంజాయ్ చెయ్యడానికి చాలా బాగుంటాయి కానీ.. ఆకలేసే సమయానికి నచ్చిన వంటకం దొరక్కుంటే మాత్రం ఆ ఎంజాయ్‌మెంట్ అంతా క్షణంలో ఆవిరైపోతుంది. అలాంటప్పుడే మనతో పాటు ఒక కంఫర్టబుల్ కుక్ వేర్, కొంత వంట సామాగ్రి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే ఈ క్యాంపింగ్ గ్రిల్. చూడటానికి చిన్న బ్రీఫ్‌కేస్‌లా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లొచ్చు.
ఈ మేకర్‌ను ఓవర్ హీట్, స్క్రాచ్ రెసిస్టెన్స్, డిఫార్మేషన్ వంటి వాటిని తట్టుకోగల హైక్వాలిటీ స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందించారు. 130 చదరపు అంగుళాల బార్బెక్యూ గ్రిల్‌పై క్రిస్పీ రుచులను వేగంగా చేసుకోవచ్చు. కార్బన్ ఫైబర్ ట్రేలో బొగ్గులను నింపి.. నిప్పు రాజేస్తే.. ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. కారులో వెళ్లినా, బస్సు మీద వెళ్లినా.. ఫ్యామిలీతో వెళ్లినా, ఫ్రెండ్స్‌తో వెళ్లినా దీన్ని చాలా స్టయిలిష్‌గా వెంట తీసుకుని వెళ్లొచ్చు.
ధర 140 డాలర్లు (రూ.10,409)
Comments
Please login to add a commentAdd a comment