
ఓపెన్ఏఐ (OpenAI) తన 'ఏఐ ఏజెంట్'ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్‌లోని చాట్‌జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే 'ఏఐ ఏజెంట్' ఇప్పుడు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.
స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్‌స్టెయిన్, ఐస్లాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.
Operator is now rolling out to Pro users in Australia, Brazil, Canada, India, Japan, Singapore, South Korea, the UK, and most places ChatGPT is available.
Still working on making Operator available in the EU, Switzerland, Norway, Liechtenstein & Iceland—we’ll keep you updated!— OpenAI (@OpenAI) February 21, 2025
యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్‌లైన్ టాస్క్‌లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్.. ఆపరేటర్ కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ ఆధారంగా పనులు పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్‌పుట్‌లను స్వీకరించి.. లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు, ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని.. ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్.. వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు.
ఇదీ చదవండి: 'భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై.. ప్రభావం చూపుతుంది. కొంతమందిపై అయిన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment