![ChatGPT most-used AI platform to find info in India](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/chat.jpg.webp?itok=Uci28nLz)
దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్న ఏఐ ప్లాట్‌ఫాం
గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లకూ ప్రాధాన్యత
లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా దాదాపు సగం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికే కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్నారు. ఇందులో ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ అగ్రస్థానంలో ఉంది. ఆన్‌లైన్ సర్వే సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2024 ఆగస్టు 11 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు దీన్ని నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 92,000 మంది ఇందులో పాల్గొన్నారు. దీని ప్రకారం వివిధ అంశాలపై వివరాల కోసం 40 శాతం మంది గూగుల్ తదితర సెర్చి ఇంజిన్లకు ప్రాధాన్యమిస్తున్నారు.
సమాచారం కోసం ఏ కృత్రిమ మేథ ప్లాట్ ఫాంను ఉపయోగిస్తుŠాన్నరనే ప్రశ్నకు స్పందిస్తూ .. 15,377 మందిలో 28 శాతం మంది చాట్‌జీపీటీకి ఓటేయగా, 9 శాతం మంది పర్‌ప్లెక్సిటీని, 6 శాతం మంది కో–పైలట్‌ను నేరుగా లేదా బింగ్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే చెరి 3 శాతం మంది ‘జెమిని వయా గూగుల్‘, ల్లామా (మెటా)ను వాడుతున్నారు. మరో ఆరు శాతం మంది తాము ఉపయోగించే ప్లాట్‌ఫాం పేరు సర్వేలో లేదని తెలిపారు. ‘మొత్తం మీద చూస్తే భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే ఏఐ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్నారు. చాట్‌జీపీటీని అత్యధికంగా వాడుతున్నారు‘ అని లోకల్‌సర్కిల్స్ పేర్కొంది.
సర్వేలోని మరిన్ని వివరాలు..
→ 90 శాతం మంది ఏఐ యూజర్లు ప్రధానంగా టెక్ట్స్ మోడ్‌లోను, 10 శాతం మంది వాయిస్ మోడ్‌లోను ఈ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నారు.
→ ఉచితంగా ఏఐ ఫీచర్లు ఇస్తున్న చైనా ప్లాట్‌ఫాం డీప్‌సీక్‌కు మారతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, 15,753 మందిలో 8 శాతం మంది ఇప్పటికే తాము మారినట్లు తెలిపారు. 8 శాతం మంది మారతామని తెలపగా, 38 శాతం మంది అయిష్టత వ్యక్తం చేశారు.
→ ఇప్పటికే డీప్‌సీక్‌కి మారిన ఏఐ యూజర్లు, లేదా త్వరలోనే మారనున్న యూజర్లు ప్రతి పది మందిలో ముగ్గురు ఉన్నారు.
→ ప్రతి పది మంది ఏఐ యూజర్లలో ముగ్గురు పెయిడ్ లేదా ప్రీమియం సబ్‌్రస్కిప్షన్ ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment