LocalCircles survey
-
చాట్‌జీపీటీకే జై...
న్యూఢిల్లీ: దేశీయంగా దాదాపు సగం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికే కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్నారు. ఇందులో ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ అగ్రస్థానంలో ఉంది. ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2024 ఆగస్టు 11 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు దీన్ని నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 92,000 మంది ఇందులో పాల్గొన్నారు. దీని ప్రకారం వివిధ అంశాలపై వివరాల కోసం 40 శాతం మంది గూగుల్ తదితర సెర్చి ఇంజిన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. సమాచారం కోసం ఏ కృత్రిమ మేథ ప్లాట్ ఫాంను ఉపయోగిస్తుŠాన్నరనే ప్రశ్నకు స్పందిస్తూ .. 15,377 మందిలో 28 శాతం మంది చాట్‌జీపీటీకి ఓటేయగా, 9 శాతం మంది పర్ప్లెక్సిటీని, 6 శాతం మంది కో–పైలట్‌ను నేరుగా లేదా బింగ్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే చెరి 3 శాతం మంది ‘జెమిని వయా గూగుల్‘, ల్లామా (మెటా)ను వాడుతున్నారు. మరో ఆరు శాతం మంది తాము ఉపయోగించే ప్లాట్‌ఫాం పేరు సర్వేలో లేదని తెలిపారు. ‘మొత్తం మీద చూస్తే భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే ఏఐ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్నారు. చాట్‌జీపీటీని అత్యధికంగా వాడుతున్నారు‘ అని లోకల్‌సర్కిల్స్ పేర్కొంది. సర్వేలోని మరిన్ని వివరాలు.. → 90 శాతం మంది ఏఐ యూజర్లు ప్రధానంగా టెక్ట్స్ మోడ్లోను, 10 శాతం మంది వాయిస్ మోడ్లోను ఈ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నారు. → ఉచితంగా ఏఐ ఫీచర్లు ఇస్తున్న చైనా ప్లాట్‌ఫాం డీప్‌సీక్‌కు మారతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, 15,753 మందిలో 8 శాతం మంది ఇప్పటికే తాము మారినట్లు తెలిపారు. 8 శాతం మంది మారతామని తెలపగా, 38 శాతం మంది అయిష్టత వ్యక్తం చేశారు. → ఇప్పటికే డీప్సీక్కి మారిన ఏఐ యూజర్లు, లేదా త్వరలోనే మారనున్న యూజర్లు ప్రతి పది మందిలో ముగ్గురు ఉన్నారు. → ప్రతి పది మంది ఏఐ యూజర్లలో ముగ్గురు పెయిడ్ లేదా ప్రీమియం సబ్‌్రస్కిప్షన్ ఉపయోగిస్తున్నారు. -
చార్జీలు విధిస్తే .. వాడటం ఆపేస్తాం..
న్యూఢిల్లీ: చెల్లింపు లావాదేవీలకు యూపీఐని గణనీయంగా వాడుతున్నప్పటికీ చార్జీలు గానీ విధిస్తే మాత్రం దాన్ని వినియోగించడం ఆపేయాలని చాలా మంది భావిస్తున్నారు. లోకల్‌సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది యూజర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. కేవలం 22% మందే ఫీజును చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం 38% మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50% లావాదేవీల కోసం డెబిట్, క్రెడిట్ లేదా ఇతరత్రా డిజిటల్ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నారు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 20 మధ్య నిర్వహించిన సర్వేలో వేసిన ప్రశ్నలకు 308 జిల్లాల నుంచి 42,000 సమాధానాలు వచ్చాయి. యూపీఐ లావాదేవీలపై చార్జీల అంశంపై 15,598 సమాధానాలు వచ్చాయి. మర్చంట్ డిస్కౌంట్ రేట్లను వి« దించే ముందు ఈ అంశాలన్నింటినీ కేంద్ర ఆరి్థక శాఖ, ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునేలా, ఈ సర్వే వివరాలను వాటి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు లోకల్‌సర్కిల్స్ తెలిపింది. ఎన్పీసీఐ లెక్కల ప్రకారం 2023–24లో యూపీఐ లావాదేవీలు 57% పెరిగాయి. తొలిసారిగా 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరాయి. విలువపరంగా చూస్తే 44% ఎగిసి రూ. 199.89 లక్షల కోట్లకు చేరాయి. -
వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఆటలు, సామాజిక మాధ్యమాలు, వీడియోల వ్యసనం పిల్లలకు బాగా ఎక్కువైందని పట్టణప్రాంతాల్లోని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆన్లైన్ వేదికగా సర్వేలు నిర్వహించే ‘లోకల్‌సర్కిల్స్’ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 287 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. సర్వే ఫలితాల ప్రకారం.. ► తమ 9–17 ఏళ్ల వయసు పిల్లలు గేమింగ్, వీడియోలు, సోషల్‌మీడియాకు అతుక్కుపోయారని పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రుల్లో దాదాపు 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► తమ 13–17 వయసు పిల్లలు రోజూ సగటున 3 గంటలకుపైగా ఇదే పనిలో ఉంటున్నారని 62 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► 9–13 వయసు చిన్నారులు రోజూ కనీసం మూడు గంటలు సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్తోనూ గడుపుతున్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ ఖాతాలు ఓపెన్ చేయాలంటే కనీసం 13 ఏళ్లు వయసుండాలని ఆయా సంస్థలు చెబుతున్నాయి. కానీ, 13 ఏళ్లలోపే అంటే 9–13 ఏళ్ల తమ పిల్లలు వీటిని చూస్తున్నారని 47 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► పట్టణప్రాంతాల్లోని 13–17 వయసు పిల్లల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ ఉందని 44 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు ► సోషల్‌మీడియా ఖాతా తెరిచేందుకు కనీస వయసును 13 ఏళ్లకు బదులు 15 ఏళ్లుగా సవరించాలని 68 శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ► ఆన్లైన్ తరగతులు, కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు వినోదం కోసం కోవిడ్ తర్వాత ఇంటర్నెట్ను వాడుతున్న పట్టణప్రాంత చిన్నారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
5జీకి కస్టమర్లు సిద్ధంగా లేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఎట్టకేలకు భారత్‌లో ప్రారంభం అయ్యాయి. 50 కోట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లలో 10 శాతం మంది వద్ద ఇప్పటికే 5జీ హ్యాండ్సెట్స్ ఉన్నాయి. అయితే ఈ ఏడాది 5జీ సేవలకు మళ్లేందుకు కేవలం 5 శాతం మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 318 జిల్లాల్లో చేపట్టిన ఈ సర్వేలో 29,000 పైచిలుకు మంది మొబైల్ యూజర్లు పాలుపంచుకున్నారు. వీరిలో 64 శాతం పురుషులు, 36 శాతం మహిళలు ఉన్నారు. ప్రథమ శ్రేణి నగరాల నుంచి 47 శాతం, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు 34 శాతం, మిగిలినది ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. అదనపు చెల్లింపులకు నో.. ప్రతి నెల 5జీ సేవల కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించేందుకు సిద్ధంగా లేమని 43 శాతం మంది తేల్చిచెప్పారు. ప్రస్తుత 3జీ/4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలు ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు. 43 శాతం మంది మాత్రం కేవలం 0–10 శాతం ఎక్కువ చెల్లించేందుకు రెడీ అని వెల్లడించారు. 10–25 శాతం అధికంగా ఖర్చు చేయడానికి 10 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపారు. అయితే 4జీ హ్యాండ్సెట్స్ వాడుతున్నప్పటికీ కాల్ నాణ్యత మెరుగుపడలేదు. ఇంటర్నెట్ వేగం పెద్దగా పెరగలేదు. ఈ నేపథ్యంలో 5జీని సపోర్ట్ చేసే గ్యాడ్జెట్ల కోసం అదనంగా ఖర్చు చేయాలా వద్దా అని వినియోగదార్లు ఆలోచిస్తున్నారు. పరిష్కారం అయ్యాకే.. సర్వేలో పాల్గొన్నవారిలో 20 శాతం మంది వద్ద 5జీ హ్యాండ్సెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటామని 4 శాతం మంది చెప్పారు. వచ్చే ఏడాది కొనుగోలు చేస్తామని 20 శాతం మంది తెలిపారు. సమీప కాలంలో అప్‌గ్రేడ్‌కు ఆసక్తిగా లేమని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాల్ డ్రాప్/కనెక్ట్, నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం, తక్కువ వేగం వంటి సమస్యలకు 5జీ ద్వారా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు 39 శాతం మంది తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యాకే 5జీకి మళ్లేందుకు సిద్ధమని 39 శాతం మంది స్పష్టం చేశారు. -
ఈ సమస్యలు మీకూ ఉన్నాయా? షాకింగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశం వేగవంతమైన 5 జీ నెట్వర్క్ సేవలకు పరుగులు తీస్తున్నక్రమంలో నెట్వర్క్ సమస్యలపై షాకింగ్ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. వినియోగదారులకు కాల్‌డ్రాప్, కాల్ కనెక్ట్ కాకపోవడం అనేది ఎంత చికాకు కలిగిస్తుందో అందరికి అనుభవమే. తాజాగా దేశంలో 339 జిల్లాల పరిధిలోని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది యూజర్లు తమ నెట్వర్క్ బాధలను వెల్లడించారు. తీవ్రమైన కాల్ డ్రాప్, కాల్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నా మన్నారు. అంతేకాదు 82 శాతం మంది ప్రజలు ఈ నెట్వర్క్ సమస్యలను అధిగమించడానికి డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సోమవారం ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. సర్వే ప్రకారం గత 3 నెలల్లో వారి మొబైల్ ఫోన్ కాల్లలో ఎంత శాతం చెడ్డ కనెక్షన్ లేదా కాల్ డ్రాప్ సమస్యలను కలిగి ఉన్నాయనే ప్రశ్నకు సమాధానంగా, 37 శాతం మంది 20-50 శాతం సమస్యను ఎదుర్కొన్నారు. కాల్ కనెక్షన్ డ్రాప్‌పై ఇచ్చిన ప్రశ్నకు 8,364 ప్రత్యుత్తరాలు వచ్చాయి. మొత్తంగా 91 శాతం మంది తాము సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పగా, 56 శాతం మంది తమ విషయంలో సమస్య మరింత తీవ్రంగా ఉందని చెప్పారు. కాల్ నాణ్యతపై దృష్టి సారించిన సర్వే 31వేల మందిపై లోకల్ సర్కిల్స్ సర్వే చేసింది. ఇందులో టైర్ 1 నగరాల్లోని 42 శాతం మంది, టైర్ 2 నుండి 31 శాతం , టైర్ 3, 4 గ్రామీణ జిల్లాల నుండి 27 శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. 78 శాతం పౌరులు తప్పు కనెక్షన్ ఉన్నప్పటికీ 30 సెకన్లలోపు ఆటోమేటిక్ కాల్ డ్రాప్ సమస్య రాలేదని సర్వే తేల్చింది. డేటా లేదా వైఫై కనెక్షన్ ఉన్న 82 శాతం మంది పౌరులు తరచుగా డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌ను పొందడం లేదా కనెక్ట్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం వేలం వెర్రేనా? సర్వేలో ఏం చెప్పారంటే?
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రధానంగా భద్రత, పనితీరుకే ప్రాధాన్య మిస్తున్నారు. ఈ వాహనాలు తరచూ అగ్నిప్రమాదాలకుగురవుతుండటంతో..ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే విషయంలోవెనక్కి తగ్గుతున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటరు భద్రత, పనితీరుపై తమకు అంతగా నమ్మకం లేదనే వారి సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 32 శాతానికి పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది కేవలం 2 శాతంగా నమోదైంది. 292 జిల్లాల్లోని 11,000 మంది పైచిలుకు వినియోగదారుల నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా ఈ సర్వే నివేదిక రూపొందించారు. ఇందులో 47 శాతం మంది పెద్ద నగరాలు, 33 శాతం మంది ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందినవారు కాగా.. 20 శాతం మంది తృతీయ శ్రేణి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు డజన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) అగ్నిప్రమాదాలకు గురైన ఉదంతాలు నమోదయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా లోపాలున్న వాహనాల బ్యాచ్‌లను వెంటనే ఉపసంహరించాలని లేదా భారీ జరిమానా విధించాల్సి వస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 21న హెచ్చరించింది. దీంతో 7,000 పైగా వాహనాలను కంపెనీలు వెనక్కి రప్పించాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలంటూ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులతో కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. మరిన్ని వివరాలు.. ♦ విద్యుత్‌యేతర వాహనాలు, కిక్కిరిసిన ప్రజా రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ-స్కూటర్లపై చాలా మంది ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే పనితీరు, భద్రతపైనే ఆందోళన పెరుగుతోంది. ♦ తమకు గానీ తమ కుటుంబ సభ్యులకు గానీ వచ్చే 6 నెలల్లో ఈ-స్కూటర్‌ను కొనే ఆలోచన లేకపోవడానికి.. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణమని 5 శాతం మంది తెలిపారు. వాటిని కొనేంత నిధులు తమ దగ్గర లేవని 7 శాతం మంది చెప్పారు. తమ దగ్గర ఇప్పటికే చాలా వాహనాలు ఉన్నాయని, మరో టూ-వీలర్ కొనే యోచనేదీ లేదని 9 శాతం మంది పేర్కొన్నారు. ♦ ఈవీలనేవి వేలం వెర్రిలాంటివని, ఈ ధోరణి త్వరలోనే తగ్గిపోతుందని 2 శాతం మంది పేర్కొన్నారు. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ♦కేవలం ఒక్క శాతం కుటుంబాలు మాత్రమే వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమపై ఉందని నివేదిక పేర్కొంది. ♦ ఈ-స్కూటర్లు, బ్యాటరీల భద్రతా ప్రమాణాలను రూపొందిస్తున్నప్పటికీ .. అనేక వర్గాల ప్రమేయం ఉన్నందున, ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తోంది. (ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత) ∙ -
లాక్డౌన్ ఎత్తేయగానే దోస్తులను కలుస్తాం.. మాల్స్‌కు పోతాం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఈనేపథ్యంలో ఇన్నాళ్లు లాక్డౌన్లో ఉన్న ప్రజలు తాళం తీస్తే స్వేచ్ఛగా తిరిగేందుకు మొగ్గుచూపుతున్నారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మాల్స్‌కు వెళ్తామంటున్నారు. బంధుమిత్రులను కలుస్తామని చెబుతున్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి విషయంలో ప్రజలు నిబంధనలు గాలికొదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ మహమ్మారి పంజా విసురుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 314 జిల్లాల్లో కమ్యూనిటీ లోకల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఆయా జిల్లాల్లోని 48 శాతం మందిని ప్రథమ శ్రేణి నగరాల నుంచి, ద్వితీయశ్రేణి నగరాల నుంచి 25 శాతం, మూడు, నాలుగు శ్రేణి నగరాల నుంచి 27 శాతం మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. -
బస్సెక్కం.. బస్కీలు తీయం!
సాక్షి, హైదరాబాద్ : ‘చుక్‌చుక్ రైలూ వస్తోంది.. దూరం దూరం జరగండీ..’ చిన్నప్పుడు పాడుకున్న ఈ పాట గుర్తుంది కదా! కొంచెం అటూఇటూగా ఇప్పుడు సీన్ అలాగే ఉంది. కరోనా భయంతో బస్సు, రైలు ప్రయాణాలంటేనే ‘దూరం.. దూరం’అంటున్నారు జనం. ఇప్పట్లో ప్రజా రవాణా అవసరంలేదని తేల్చేస్తున్నారు. ఇక, జిమ్, స్విమ్మింగ్‌పూల్, హోటల్, హాలీడే స్పాట్లంటారా?.. అటుపక్కకే వెళ్లబోమన్నారు. ‘లోకల్ సర్కిల్స్’అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 241 జిల్లాల నుంచి 24 వేల మందికిపైగా అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించింది. ఇందులో 68% పురుషులు, 32% మహిళలు ఉన్నారు. 49% మంది మెట్రో, 36% ద్వితీయ శ్రేణి నగరాలు, 15 శాతం 3, 4వ శ్రేణి పట్టణాల ప్రజల నాడి తెలుసుకుంది. -
కరోనా ఎఫెక్ట్ : మెట్రో ప్రయాణానికి విముఖత
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లు ప్రారంభమైనా రానున్న నెల రోజుల పాటు వాటిలో ప్రయాణం చేయబోమని లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 67 శాతం మంది తేల్చిచెప్పారు. ఇక వచ్చే నెల రోజుల్లో జిమ్నాజియం, స్విమ్మింగ్‌పూల్‌కు వెళతామని కేవలం 15 శాతం మంది పౌరులే పేర్కొన్నారు.రాబోయే మూడు నెలల పాటు విహార యాత్రలకు, హోటళ్లలో గడిపేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోలేదని 93 శాతం మంది పేర్కొన్నారు. జూన్ 30తో అన్‌లాక్ 1.0 ముగుస్తున్నా పలు రంగాలకు భారీ సడలింపులు ప్రకటించినా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అన్‌లాక్ 2.0 దశలో ప్రజలు మెట్రో, లోకల్ ట్రైన్లను ఎంతవరకూ ఉపయోగించుకుంటారు...జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లకు వెళ్లడం, విహార యాత్రలకు ప్లాన్ చేయడంపై లోకల్‌సర్కిల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో పౌరులను ప్రశ్నించడం ద్వారా 24,000 సమాధానాలను రాబట్టింది. కాగా వీలైనంత త్వరలో మెట్రో సర్వీసులను పునరుద్ధరిస్తామని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ ఇటీవల వెల్లడించింది. జూన్ 15న ముంబైలో లోకల్ రైళ్ల రాకపోకలు ప్రారంభమైనా ప్రయాణీకుల నుంచి స్పందన పరిమితంగా ఉండటం గమనార్హం. ఇక వచ్చే నెలరోజుల్లో మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లు పునఃప్రారంభమైతే వాటిలో ప్రయాణిస్తామని 25 శాతం మంది పేర్కొనగా, కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో మెట్రో ప్రయాణం సురక్షితం కాదని 67 శాతం మంది పౌరులు వెల్లడించారు. పెట్రో ధరలు ఇటీవల భారీగా పెరిగి తమ జేబులకు చిల్లు పెడుతున్నా కరోనా భయంతో వాహనదారులు ప్రజా రవాణావైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక రానున్న నెల రోజుల్లో జిమ్నాజియంలు, స్విమ్మింగ్‌పూల్స్ తెరుచుకున్నా వాటిని సందర్శించబోమని 84 శాతం మంది వెల్లడించగా, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌కు వెళతామని కేవలం 15 శాతం మంది పౌరులు పేర్కొన్నారు. చదవండి : మెట్రో నష్టాన్ని చెల్లించండి! -
జమిలి ఎన్నికలపై సర్వేలో సానుకూలం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రతిపాదనకు లా కమిషన్ గ్రీన్‌సిగ్నల్ లభించిన నేపథ్యంలో జమిలి ఎన్నికలపై నిర్వహించిన సర్వేలో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైంది. లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 84 శాతం మంది జమిలి ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జమిలి ఎన్నికలపై ఈ సందర్భంగా పలు సందేహాలను వారు వ్యక్తపరచడం గమనార్హం. జమిలి ఎన్నికలను సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 13 శాతం మంది వ్యతిరేకించారని లోకల్‌సర్కిల్స్ పేర్కొంది. జమిలి ఎన్నికలతో సమయం, ఖర్చు ఆదా అవడంతో పాటు అభివృద్ధి, పాలనపై ప్రభుత్వాలు దృష్టిసారించేందుకు వెసులుబాటు ఉంటుందని సర్వేలో పాల్గొన్నవారిలో 93 శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. అయితే పటిష్ట ప్రచార నైపుణ్యాలు కలిగిన పార్టీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అధికార కేంద్రీకరణకు దారితీయడంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాన్ని కుదించివేస్తుందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కాగా, 2019 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించవచ్చని లా కమిషన్ సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లా కమిషన్ వెల్లడించిన కార్యనిర్వాహక పత్రం ప్రకారం మలివిడత జమిలి ఎన్నికలు 2024లో నిర్వహించవచ్చని పేర్కొంది. అయితే దీనికి అనుగుణంగా రాజ్యాంగంలో కనీసం రెండు నిబంధనలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. -
మేం.. పటాకులు కాల్చం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు నేపథ్యంలో 87 శాతం మంది ఢిల్లీ ప్రజలు బాణాసంచాకు దూరంగా ఉన్నట్లు ఒక సర్వే ప్రకటించింది. కేవలం 5 శాతం మంది ప్రజలు మాత్రం దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కాల్చేందుకు సిద్ధపడుతున్నట్లు సర్వే పేర్కొంది. దీపావళి-బాణాసంచాపై నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఢిల్లీలో లోకల్ సర్కిల్స్ సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తిర విషయాలు వెలుగు చూశాయి. ప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 87 శాతం మంది ప్రజలు పటాకులు కాల్చడంపై అయిష్టతను వ్యక్తం చేశారు. ఇందులో కేవలం 5 శాతం అంటే 4,600 మంది తమ దగ్గర ఇప్పటికే పటాకులు ఉన్నాయని.. వాటిని కాలుస్తామని తెలిపారు. మరో శాతం మంది మాత్రం.. తమకు బాణాసంచా కాల్చడం ఇష్టమేనని అయితే అక్రమంగా వాటిని సంపాదిండం మాత్రం తెలియదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే ప్రకటించింది. ముఖ్యంగా దీపావళి సమయంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో ఉండే కాలుష్యంతో పోలిస్తే.. దీపావళి సమయంలో ఐదు రెట్లు అధికంగా ఉంటుంది. -
నోట్ల రద్దుపై మోదీ సర్కార్‌కు సర్వే షాక్!
-
నోట్ల రద్దుపై మోదీ సర్కార్‌కు సర్వే షాక్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందా? పొద్దున లేవగానే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సామాన్య ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వచ్చిందా? అసలు నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? కోపంగా ఉన్నారా? అసంతృప్తితో ఉన్నారా?అని ఓ సారి పరిశీలిస్తే.. ప్రజలు మాత్రం అసంతృప్తితోనే ఉన్నారని ఓ సర్వే తేల్చింది. పెద్ద నోట్ల రద్దుకు రానురాను మద్దతు తగ్గిపోతుందని ఆ సర్వే పేర్కొంది. లోకల్ సర్కిల్స్ అనే కొంతమంది పౌరులతో ఏర్పాటుచేసిన సంస్థ మొత్తం 8,526మందిని ప్రశ్నించి ఈ సర్వేను పూర్తి చేసింది. ఈ సర్వే ప్రకారం ఈ పథకం అమలును ప్రస్తుతం 39శాతంమంది మాత్రమే అంగీకరిస్తున్నారని, 51శాతంమంది మాత్రం అసహనంతో ఉన్నారని, వారు మద్దతు ఇవ్వడం లేదని ఈ సర్వే పేర్కొంది. మూడు వారాల కిందట వీరంతా మద్దతిచ్చినవారేనని కూడా సర్వే వెల్లడించింది. ఈ పథకం సరిగా అమలు చేయడం లేదని మూడు వారాల కిందట 25శాతం మంది చెప్పగా ప్రస్తుతం అలా చెప్పేవారు 36శాతానికి పెరిగారని వివరించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేదే కాదని చెప్పినట్లు పేర్కొంది. క్యూలో నిల్చున్నా తమకు రూపాయి దొరకని పరిస్థితుల్లో బడా బాబుల వద్ద కోట్లలో కొత్త నోట్లు బయటకు రావడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని, బ్యాంకులు మోసాలకు పాల్పడ్డాయని వారు భావిస్తున్నారని కూడా సర్వే వివరించింది.