పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందా? పొద్దున లేవగానే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సామాన్య ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వచ్చిందా? అసలు నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? కోపంగా ఉన్నారా? అసంతృప్తితో ఉన్నారా?అని ఓ సారి పరిశీలిస్తే.. ప్రజలు మాత్రం అసంతృప్తితోనే ఉన్నారని ఓ సర్వే తేల్చింది. పెద్ద నోట్ల రద్దుకు రానురాను మద్దతు తగ్గిపోతుందని ఆ సర్వే పేర్కొంది. లోకల్ సర్కిల్స్ అనే కొంతమంది పౌరులతో ఏర్పాటుచేసిన సంస్థ మొత్తం 8,526మందిని ప్రశ్నించి ఈ సర్వేను పూర్తి చేసింది.