యూపీఐపై లోకల్‌సర్కిల్స్ సర్వేలో మెజారిటీ యూజర్లు వెల్లడి
న్యూఢిల్లీ: చెల్లింపు లావాదేవీలకు యూపీఐని గణనీయంగా వాడుతున్నప్పటికీ చార్జీలు గానీ విధిస్తే మాత్రం దాన్ని వినియోగించడం ఆపేయాలని చాలా మంది భావిస్తున్నారు. లోకల్‌సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది యూజర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. కేవలం 22% మందే ఫీజును చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
సర్వే ప్రకారం 38% మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50% లావాదేవీల కోసం డెబిట్, క్రెడిట్ లేదా ఇతరత్రా డిజిటల్ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నారు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 20 మధ్య నిర్వహించిన సర్వేలో వేసిన ప్రశ్నలకు 308 జిల్లాల నుంచి 42,000 సమాధానాలు వచ్చాయి. యూపీఐ లావాదేవీలపై చార్జీల అంశంపై 15,598 సమాధానాలు వచ్చాయి.
మర్చంట్ డిస్కౌంట్ రేట్లను వి« దించే ముందు ఈ అంశాలన్నింటినీ కేంద్ర ఆరి్థక శాఖ, ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునేలా, ఈ సర్వే వివరాలను వాటి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు లోకల్‌సర్కిల్స్ తెలిపింది. ఎన్‌పీసీఐ లెక్కల ప్రకారం 2023–24లో యూపీఐ లావాదేవీలు 57% పెరిగాయి. తొలిసారిగా 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరాయి. విలువపరంగా చూస్తే 44% ఎగిసి రూ. 199.89 లక్షల కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment