Unified service
-
చార్జీలు విధిస్తే .. వాడటం ఆపేస్తాం..
న్యూఢిల్లీ: చెల్లింపు లావాదేవీలకు యూపీఐని గణనీయంగా వాడుతున్నప్పటికీ చార్జీలు గానీ విధిస్తే మాత్రం దాన్ని వినియోగించడం ఆపేయాలని చాలా మంది భావిస్తున్నారు. లోకల్‌సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది యూజర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. కేవలం 22% మందే ఫీజును చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం 38% మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50% లావాదేవీల కోసం డెబిట్, క్రెడిట్ లేదా ఇతరత్రా డిజిటల్ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నారు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 20 మధ్య నిర్వహించిన సర్వేలో వేసిన ప్రశ్నలకు 308 జిల్లాల నుంచి 42,000 సమాధానాలు వచ్చాయి. యూపీఐ లావాదేవీలపై చార్జీల అంశంపై 15,598 సమాధానాలు వచ్చాయి. మర్చంట్ డిస్కౌంట్ రేట్లను వి« దించే ముందు ఈ అంశాలన్నింటినీ కేంద్ర ఆరి్థక శాఖ, ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునేలా, ఈ సర్వే వివరాలను వాటి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు లోకల్‌సర్కిల్స్ తెలిపింది. ఎన్పీసీఐ లెక్కల ప్రకారం 2023–24లో యూపీఐ లావాదేవీలు 57% పెరిగాయి. తొలిసారిగా 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరాయి. విలువపరంగా చూస్తే 44% ఎగిసి రూ. 199.89 లక్షల కోట్లకు చేరాయి. -
చిన్న రిటైలర్లకు ఓఎన్డీసీ ఊతం
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం కోవకి చెందిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో చిన్న రిటైలర్లకు ఊతం లభించగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. బడా ఈ–కామర్స్ కంపెనీల ధాటిని తట్టుకుని చిన్న వ్యాపారాలు నిలబడగలవని ఆయన పేర్కొన్నారు. ఓఎన్డీసీలో భాగమయ్యేలా చిన్న సంస్థలు, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. విచక్షణారహితమైన, నాణ్యత లేని ఉత్పత్తుల దిగుమతుల కారణంగా దేశీ వినియోదారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. చైనా సంగతి ప్రస్తావించకుండా ఒక దేశం నుంచి 2004–14 మధ్య దిగుమతుల వల్ల భారత వాణిజ్య లోటు గణనీయంగా పెరిగిపోయిందని, దేశీ తయారీ రంగం వెన్ను విరిచిందని పియుష్ గోయల్ చెప్పారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, వినియోగదారులు కూడా తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. -
సర్వీస్ రూల్స్‌కు ప్రధాని ఆమోదం
-
సర్వీస్ రూల్స్‌కు ప్రధాని ఆమోదం
► ఫైలును రాష్ట్రపతి భవన్‌కు పంపనున్న హోం శాఖ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లో ఉపాధ్యా యుల ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం లభించింది. ఇప్పటికే ఈ ఫైలుపై ప్రధాని ముఖ్య కార్యదర్శి సంతకం చేసిన విషయం తెలిసిందే. మంగళవా రం మోదీ కూడా ఫైలుపై సంతకం చేశారు. తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్‌కు పంపేందుకు కేంద్ర హోం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలోనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించే అవకాశముంది. సర్వీసు నిబంధనల అమలుకు ప్రధాని ఆమో దించడం పట్ల వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఆయనకు ధన్యవాదాలు తెలిపాయి. ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయూ–టీఎస్, ఎస్టీయూ, పీఆర్టీయూ–తెలంగాణ, టీపీయూఎస్ అధ్యక్షులు సరోత్తంరెడ్డి, భుజంగరావు, అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, యూటీ ఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీంతో గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వీసు నిబంధనల వల్ల ప్రభుత్వ, పంచా యతీరాజ్ ఉపాధ్యాయులకు సమాన అవకాశాలు దక్కుతాయని, దీంతో విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. -
ఉభయ రాష్ట్రాల తీరును తప్పుబట్టిన హైకోర్టు
► ఏకీకృత సర్వీసుపై తీర్పును అమలు చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారంలో ఏకీకృత సర్వీసు నిబంధనలను రద్దు చేస్తూ కేశవుల కేసులో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో తెలుగు రాష్ట్రాల తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. కేశవుల కేసులో హైకోర్టు తీర్పును అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినందున అధికారుల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వడం లేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారంలో ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం 1998లో జారీ చేసిన జీవోలు 505, 538లను సవాలు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, జిల్లా విద్యాధికారులు మొదటి పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో కేశవులు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు జీవో 538ని పూర్తిగా, 505 జీవోను పాక్షికంగా కొట్టేస్తూ 2003లో తీర్పునిచ్చింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులతో ప్రభుత్వ టీచర్లను ఏకీకృత చేయడం రాజ్యాంగ విరుద్ధమే కాక, రాష్ట్రపతి ఉత్తర్వులకు సైతం విరుద్ధమని తేల్చి చెప్పింది. అయితే, ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా పంచాయతీరాజ్ టీచర్లకు పదోన్నతులు ఇచ్చుకుంటూ వెళ్లింది. 2015లో సుప్రీంకోర్టు కేశవుల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేశవుల కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం పంచాయతీరాజ్ టీచర్ల పదోన్నతులకు గత ఏడాది జీవో 10 జారీ చేసింది. దీనిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు మరో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.