సర్వీస్ రూల్స్‌కు ప్రధాని ఆమోదం
► ఫైలును రాష్ట్రపతి భవన్‌కు పంపనున్న హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లో ఉపాధ్యా యుల ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం లభించింది. ఇప్పటికే ఈ ఫైలుపై ప్రధాని ముఖ్య కార్యదర్శి సంతకం చేసిన విషయం తెలిసిందే. మంగళవా రం మోదీ కూడా ఫైలుపై సంతకం చేశారు. తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్‌కు పంపేందుకు కేంద్ర హోం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలలోనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించే అవకాశముంది.
సర్వీసు నిబంధనల అమలుకు ప్రధాని ఆమో దించడం పట్ల వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఆయనకు ధన్యవాదాలు తెలిపాయి. ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, పీఆర్‌టీయూ–టీఎస్, ఎస్టీయూ, పీఆర్‌టీయూ–తెలంగాణ, టీపీయూఎస్ అధ్యక్షులు సరోత్తంరెడ్డి, భుజంగరావు, అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, యూటీ ఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీంతో గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వీసు నిబంధనల వల్ల ప్రభుత్వ, పంచా యతీరాజ్ ఉపాధ్యాయులకు సమాన అవకాశాలు దక్కుతాయని, దీంతో విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.