న్యూఢిల్లీ: భారత దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చేదిశగా జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం ఒక ముందడుగు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జమిలి ఎన్నికలకు బుధవారం(సెప్టెంబర్18) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం మోదీ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.
‘జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంగా రాంనాథ్‌కోవింద్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. విస్తృత సంప్రదింపులు జరిపి జమిలి ఎన్నికలపై సిఫారసులు చేశారు’అని కోవింద్‌ను ప్రధాని కొనియాడారు.
ఇదీ చదవండి.. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment