న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం కోవకి చెందిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)తో చిన్న రిటైలర్లకు ఊతం లభించగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. బడా ఈ–కామర్స్ కంపెనీల ధాటిని తట్టుకుని చిన్న వ్యాపారాలు నిలబడగలవని ఆయన పేర్కొన్నారు. ఓఎన్‌డీసీలో భాగమయ్యేలా చిన్న సంస్థలు, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు.
విచక్షణారహితమైన, నాణ్యత లేని ఉత్పత్తుల దిగుమతుల కారణంగా దేశీ వినియోదారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. చైనా సంగతి ప్రస్తావించకుండా ఒక దేశం నుంచి 2004–14 మధ్య దిగుమతుల వల్ల భారత వాణిజ్య లోటు గణనీయంగా పెరిగిపోయిందని, దేశీ తయారీ రంగం వెన్ను విరిచిందని పియుష్ గోయల్ చెప్పారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, వినియోగదారులు కూడా తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment