CEOs
-
మూడో భారీ ఎకానమీ దిశగా భారత్!
న్యూయార్క్: భారత్ త్వరలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో దేశ ఆరి్థక వృద్ధిలో భాగమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికన్ దిగ్గజ సంస్థల సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారం చేపట్టిన మూడో విడత కాలంలో (2024–29) భారత్‌ను భారీ ఎకానమీల్లో మూడో స్థానానికి చేర్చేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ అయిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక, సాంకేతికత ప్రగతితో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలకు ప్రధాని సూచించారు. యావత్ ప్రపంచం కోసం ఉత్పత్తులు, సేవలను రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు భారత్‌తో చేతులు కలపాలని ఆయన పేర్కొన్నారు. మేధోహక్కుల పరిరక్షణకు, టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘సెమీకండక్టర్ల తయారీకి గ్లోబల్ హబ్’గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ‘టెక్ సీఈవోలతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. టెక్నాలజీ, నవకల్పనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. ఆయా విభాగాల్లో భారత పురోగతిని వివరించాను’ అని ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహించిన సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్, యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన విధానాలతో భారత్, అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని సీఈవోలు కితాబిచ్చారు. ఎన్విడియా, గూగుల్ మరింత ఫోకస్ భారత్‌పై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు గూగుల్, ఎన్విడియా తదితర టెక్ దిగ్గజాలు వెల్లడించాయి. దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ పెట్టనున్నట్లు మోదీతో భేటీ అనంతరం సీఈవోలు తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్ ద్వారా భారత్‌లో పరివర్తన తేవడంపై ప్రధాని దృష్టి పెట్టారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం వంటి విభాగాల్లో వినూత్న సొల్యూషన్స్ రూపొందించాలని ఆయన సూచించారు. భారత్‌లో ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరింతగా కలిసి పనిచేయడంపై ఆసక్తిగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమకు ఇప్పటికే వివిధ విభాగాల్లో భాగస్వామ్యం ఉందని, అధునాతన టెక్నాలజీ లను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. -
Indian Origin CEOs: టాప్ కంపెనీలు.. మనవాళ్లే సీఈవోలు (ఫొటోలు)
-
ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు..
'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) టెక్నాలజీ.. మారుతున్న భౌగోళిక పరిస్థితులు దాదాపు ప్రపంచంలోని సగం వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని దిగ్గజ కంపెనీల సీఈఓలు ఆందోళన చెందుతున్నారు. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC) సర్వ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4,702 కంపెనీల నాయకుల పోల్‌లో 45 శాతం మంది తమ వ్యాపారాలు అనుకూలించకపోతే 10 సంవత్సరాలలో విఫలమవుతారని తెలిపింది. 2023లో కొన్ని కంపెనీల పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న సంఘటనలు ఇప్పటికే కళ్ళముందు కనిపించాయని స్పష్టం చేసింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పీడబ్ల్యుసీ గ్లోబల్ చైర్మన్ 'బాబ్ మోరిట్జ్' (Bob Moritz) మాట్లాడుతూ.. ఆదాయ అవకాశాలు గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఉద్యోగులను తొలగించి ఏఐ వినియోగాన్ని పెంచుకోవడానికి కూడా సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా మారుతున్న భౌగోళిక పరిస్థితులు కూడా కంపెనీల వృద్ధికి అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడుల వంటివి ప్రపంచ వాణిజ్యానికి అంతరాయాలుగా ఉన్నాయి. -
జనరేటివ్ ఏఐపై పోటాపోటీ! సీఈవోలు ఏం చెప్పారంటే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీల ప్రాధాన్యాలు మారిపోయాయి. అత్యంత ప్రాచుర్యం పొందుతున్న జనరేటివ్ ఏఐపై టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీపై భారతీయ సీఈవోల దృక్పథం ఏంటన్నదానిపై తాజాగా ఓ సర్వే వెల్లడైంది. అత్యధిక పెట్టుబడులు జనరేటివ్ ఏఐ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీల మధ్య పోటీ బాగా పెరిగింది. అనేక కంపెనీలు ఈ టెక్నాలజీపైనే అత్యధికంగా పెట్టుబడి పెడుతున్నాయి. భారత్‌కు చెందిన 50 మంది సీఈవోలపై నిర్వహించిన ఈవై సీఈవో అవుట్‌లుక్ పల్స్ 2023 సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఐదింట నాలుగొంతుల మంది సీఈవోలు ఈ జనరేటివ్ ఏఐపై అత్యధికంగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం కొత్త పెట్టుబడులు పెట్టడమో లేదా ఇప్పటికే ఉన్న తమ బడ్జెట్ నుంచి కేటాంపులు మళ్లించడమో చేస్తున్నట్లు సర్వేలో పాల్గన్న సీఈవోల్లో 84 శాతం మంది తెలిపారు. జనరేటివ్ ఏఐ వేగవంతమైన పురోగతి, నియంత్రణ వాతావరణం దీనికి సంబంధించిన మూలధన కేటాయింపులను ప్రభావితం చేస్తున్నట్లు 62 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దీని వల్ల ఉద్యోగులపై పడే ప్రభావంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం సవాలుగా మారిందని 80 శాతం పేర్కొన్నారు. -
‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్
చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ తొలగింపు వ్యవహారం టెక్ ప్రపంచంలో అలజడి సృష్టించింది. ఈ ఉదంతం మార్క్ జుకర్‌బర్గ్, డ్రూ హ్యూస్టన్లతో సహా 100 మందికి పైగా సిలికాన్ వ్యాలీ సీఈవోలు ఉన్న ప్రైవేటు వాట్సాప్ చాట్ గ్రూప్‌లో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్‌మన్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్‌మన్ అనూహ్య తొలగింపు ఉదంతం.. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, డ్రాప్‌బాక్స్ సీఈవో డ్రూ హ్యూస్టన్‌తో సహా యూఎస్‌లోని పలు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల సీఈవోలను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం ప్రకారం.. నవంబర్ 17న ఆల్ట్‌మన్‌ను ఓపెన్ఏఐ తొలగించినట్లు వార్తలు వెలువడినప్పుడు, సిలికాన్ వ్యాలీ కంపెనీలకు చెందిన 100 మందికి పైగా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన ఈ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక సందేశం వచ్చింది. ఇంతకీ ఏంటది? సీఈవోల వాట్సాప్ గ్రూప్‌లో ఆ రోజు "శామ్ అవుట్" అని ఓ సందేశం వచ్చింది. దీనిపై గ్రూప్ సభ్యులు వెంటనే స్పందించారు. శామ్ ఏమి చేశాడు.. అంటూ రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఉన్నంటుండి తొలగించడానికి శామ్ ఆల్ట్‌మన్ చేసిన తప్పేంటి అనేదానికిపై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్! ఓపెన్ఏఐ సంస్థకు అతిపెద్ద పెట్టుబడిదారైన మైక్రోసాఫ్ట్‌లో కూడా దీనిపై అలజడి చలరేగింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెవిన్ స్కాట్‌కి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి నుంచి కాల్ వచ్చినట్లు వాట్సాప్ చాట్‌లో ఉంది. ఆల్ట్‌మన్‌ను తొలగించినట్లు ఓపెన్ఏఐ బోర్డు ప్రకటించబోతోందని, తానే తాత్కాలిక చీఫ్‌గా ఉండనున్నట్లు ఆ కాల్లో ఆమె స్కాట్‌తో చెప్పినట్లు సందేశంలో పేర్కొన్నారు. దీంతో స్కాట్ వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్ చేశారట. ఆ సమయంలో ఆయన రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశంలో ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన సత్య నాదెళ్ల తక్షణమే ఓపెన్ఏఐ సీటీవో మీరా మురాటికి ఫోన్ చేసి బోర్డు నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆరా తీసినట్లు వాట్సాప్ సందేశాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆమె నుంచి సమాధానం లేదు. దీంతో ఆయన ఓపెన్ఏఐ ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ డీఏంజెలోకి కాల్ చేసి ఏం జరిగిందని అడిగినా కారణం తెలియరాలేదు. అయితే తమతో ఆల్ట్‌మన్ సమన్వయం సక్రమంగా లేదని మాత్రమే బోర్డు చెప్పినట్లు వాట్సాప్ సందేశాల సారాంశం. -
సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన సీఈవోలు వీరే!
ఇటీవల ఓపెన్ఏఐ కంపెనీ తన సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్'ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద చర్చలకు దారి తీసింది. సీఈఓ జాబ్ కూడా గ్యారెంటీ కాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 2022లో 969 మంది సీఈఓలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా.. ఈ ఏడాది మొదటి తొమ్మిది ఈ సంఖ్య 1425 కు చేరింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) ప్రకారం, తాము నెలకొల్పిన సంస్థల నుంచి తమ సీఈఓ పదవులు కోల్పోయిన వారు ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ (Steve Jobs) యాపిల్ కంపెనీ కో ఫౌండర్, సీఈఓ స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు ఆ కంపెనీలోనే తన సీఈఓ జాబ్ కోల్పోయిన సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సంస్థ ప్రారంభమైనప్పుడు అతని వయసు 21 సంవత్సరాలు మాత్రమే, అయితే ఆ కంపెనీ స్థాపించిన సుమారు 9 సంవత్సరాలకు కంపెనీ బోర్డు సీఈఓగా తొలగించి, ఆ స్థానంలో జాన్ స్కూల్లేను నియమించింది. ఆ తరువాత 1997లో స్టీవ్ జాబ్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన 2011లో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ స్థానంలో 'టిమ్ కుక్' ఉన్నారు. అంకితి బోస్ (Ankiti Bose) జిలింగో కో-ఫౌండర్, సీఈఓ అంకితి బోస్ కొన్ని ఆర్ధిక అవకతవకల దర్యాప్తు కారణంగా 2022లో సీఈఓగా తొలగించారు. బోర్డు ఆమోదం లేకుండానే.. ఆమె జీతం దాదాపు 10 రెట్లు పెరగటం కారణంగా సీఈఓగా తొలగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది. పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) సంస్థను కొనుగోలు చేసిన తరువాత కంపెనీలో చాలామంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. 2021లో సీఈఓగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ ఆ సమయంలో కంపెనీని విడిచిపెట్టిన మొదటి వ్యక్తి. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. ఫనీష్ మూర్తి (Phaneesh Murthy) ప్రముఖ ఐటీ సంస్థ 'ఐగేట్' (iGate) ప్రెసిడెంట్, సీఈఓ ఫనీష్ మూర్తికి తన సహోద్యోగితో సంబంధం ఉందనే కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అరాసెలి రోయిజ్ అనే ఉద్యోగి లైంగిక వేధింపుల దావా వేసినప్పుడు విచారణంలో దోషిగా తేలడం వల్ల ఈయన సీఈఓగా తొలగించారు. ఈయన ఇన్ఫోసిస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు సమాచారం. జాక్ డోర్సే (Jack Dorsey) 2006లో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ స్టార్టప్ ట్విటర్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జాక్ డోర్సే' 2008లో కొన్ని కారణాల వల్ల తన పదవి కోల్పోయాడు. ఆ తరువాత ఆయన స్థానంలోకి పరాగ్ అగర్వాల్ నియమితుడై సీఈఓ బాధ్యతలు చేపట్టారు. శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఇదీ చదవండి: ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే.. తమ కంపెనీలలోనే సీఈఓ పదవి కోల్పోయిన వ్యక్తుల జాబితాలో యాహూ సీఈఓ కరోల్ బార్ట్జ్ (2011), హెచ్‌టీసీ సీఈఓ పీటర్ చౌ (2015), తైవాన్‌కు కంప్యూటర్ కంపెనీ ఏసర్ సీఈఓ జియాన్ఫ్రాంకో లాన్సి (2011), విప్రో జాయింట్ సీఈఓలు గిరీష్ పరంజ్పే & సురేష్ వాస్వానీ (2011), మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీఫెన్ ఎలోప్, హెచ్‌పీ సీఈఓ మార్క్ హర్డ్ (2010) ఉన్నారు. -
సుచరిత సుమధుర శ్రుతి
విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును మాత్రమే కాదు... సమాజాన్ని కూడా లోతుగా చదివే వారే ఎంటర్ప్రెన్యూర్లుగా గెలుపు జెండా ఎగరేయగలరని నిరూపించారు ‘కలైడోఫిన్’ కో–ఫౌండర్, సీయివో సుచరిత ముఖర్జీ, ‘అప్నాక్లబ్’ సీయీవో శ్రుతి. తాజాగా... ఫోర్బ్స్ ఆసియా ‘100 టు వాచ్’ వార్షిక జాబితాలో ఆరు భారతీయ కంపెనీలు చోటు చేసుకున్నాయి. వాటిలో ‘కలైడోఫిన్’‘అప్నాక్లబ్’లు ఉన్నాయి.. అయిదుగురు కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న చెన్నైకి చెందిన రమణీ శేఖర్ దినసరి కూలీ. రోజుకు రెండు వందల రూపాయల వరకు సంపాదిస్తుంది. కంటిచూపు కోల్పోవడంతో భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. కొడుకు, కూతురు కాస్తో కూస్తో చదువుకున్నారుగానీ ఏ ఉద్యోగమూ చేయడం లేదు. వీరితోపాటు తల్లి పోషణ భారం కూడా తనదే. ఒక విధంగా చెప్పాలంటే నెలాఖరుకు పైసా మిగలడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘కలైడోఫిన్’ పేరు మీద అయిదు వందల రూపాయలు పొదుపు చేయడం మానలేదు రమణి. ‘అత్యవసర పరిస్థితుల్లో వైద్య అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తాను’ అంటున్న రమణి కొంత డబ్బును సెల్ఫ్–హెల్ప్ గ్రూప్ సేవింగ్ స్కీమ్స్‌లో కూడా పెడుతుంది. ‘రమణిలాంటి ఎంతోమంది పేదవాళ్లకు కష్ట సమయంలో కలైడోఫిన్ అండగా ఉంది’ అంటుంది ఫిన్‌టెక్ కంపెనీ ‘కలైడోఫిన్’ కో–ఫొండర్, సీయీవో సుచరిత ముఖర్జీ. దీర్ఘకాల, మధ్యకాల, స్వల్పకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఉదాన్, లక్ష్య, ఉమ్మిద్ అనే ప్యాకేజ్‌లను లాంచ్ చేసింది కలైడోఫిన్. ‘కలైడోఫిన్’ ప్యాకేజిలలో ఒకటైన ‘లక్ష్య’ను పేద ప్రజల ఆరోగ్యం, చదువు, వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలపరిమితితో రూపొందించారు. ఈ ప్యాకేజీలో మరణం లేదా అంగవైకల్యానికి బీమా ఉంటుంది. ‘తమ ఆర్థిక స్థాయిని బట్టి ఎవరైనా సరే వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులతో యాక్సెస్ కావచ్చు’ అంటూ దిగువ మధ్యతరగతి, పేదవర్గాలకు భరోసాతో బయలుదేరింది కలైడోఫిన్. చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఈ ఫిన్‌టెక్ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. వ్యాపారవేత్తకు కేవలం వ్యాపార దృష్టి మాత్రమే కాదు సాధ్యసాధ్యాలకు సంబంధించి వినియోగదారుల దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసింది సుచరిత. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఐఐఎం, అహ్మదాబాద్‌లో ఎంబీఎ చేసిన సుచరిత ఐఎఫ్ఎంఆర్ ట్రస్ట్ గ్రూప్ కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేసింది. ఆ తరువాత ‘కలైడోఫిన్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది. శ్రుతి తండ్రి ఐఏఎస్ అధికారి. అయినప్పటికీ ఆయనకు ఆడపిల్లల విషయంలో ‘అయ్యో!’లు తప్పలేదు. ‘పాపం ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని లేని బాధను కొని తెచ్చుకునేవారు చుట్టాలు, పక్కాలు. స్కూల్ నుంచి కాలేజీ రోజుల వరకు ఎన్నోసార్లు లింగవివక్షతను ఎదుర్కొంది శ్రుతి. ఆత్మవిశ్వాసం ఉన్నా తప్పే లేకున్నా తప్పే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఆత్మవిశ్వాసం ఉంటే ‘అంత వోవర్ కాన్ఫిడెన్సా?’ అని వెక్కిరింపు. లేకపోతే‘అంత ఆత్మన్యూనతా!’ అని చిన్నచూపు. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని పెద్ద ప్రయాణమే చేయాల్సి వచ్చింది శ్రుతి. అయితే ఆ ప్రయాణంలో ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. ఐఐటీ–దిల్లీలో ఎం.టెక్. పూర్తిచేసిన శ్రుతి ఉద్యోగం చేయాలనుకుంది. ఆ తరువాత ‘ఉద్యోగం చేయగలనా?’ అని కూడా అనుకుంది. దీనికి కారణం... తన స్వతంత్ర వ్యక్తిత్వం. ‘నీకు చాలా కోపం’ అనే మాట చాలాసార్లు విన్నది.‘ఆవేశంతో కనిపించే వాళ్లకు సాధించాలనే కసి ఎక్కువగా ఉంటుంది’ అనే మాట కూడా విన్నది. ‘అప్నాక్లబ్’ రూపంలో అది తన విషయంలో నిజమైంది. వ్యాపారంలో రాణించాలనుకున్న శ్రుతి హార్వర్డ్ బిజినెస్ స్కూల్(హెచ్‌బీఎస్)లో ఎంబీఏ చేసింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో ట్రావెల్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. అయితే అది తనకు చేదు అనునుభవాన్ని నేర్పించడమే కాకుండా తియ్యటి పాఠాలు నేర్పింది. చిన్న పట్టణాలకు చెందిన వాళ్లు ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్–మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం గ్రహించిన శ్రుతి ‘అప్నాక్లబ్’ పేరుతో ఎఫ్ఎంసీజీ హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఫరవాలేదు’ అనుకుంటున్న సమయంలో కంపెనీ వేగంగా దూసుకుపోవడం మొదలైంది. టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, ఫ్లోరిష్ వెంచర్స్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... బ్యాకర్స్గా ‘అప్నాక్లబ్’ శక్తిమంతంగా తయారైంది. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతోంది. ‘నీకున్న ఆవేశానికి ఉద్యోగం చేయడం కష్టం. వ్యాపారం చేయడం అంత కంటే కష్టం’ అనే మాటను ఎన్నోసార్లు విన్నది శ్రుతి. ఇప్పుడు అలాంటి మాటలు ముఖం చాటేశాయి. ‘ఏదో సాధించాలనే గట్టి తపన, సంకల్పబలం ఉన్న మహిళ’ అనే ప్రశంసపూర్వకమైన మాటలు ‘అప్నాక్లబ్’ సీయీవో శ్రుతి గురించి తరచు వినిపిస్తున్నాయి. -
ఆ విషయంలో ప్రపంచానికి భారత్ కర్మాగారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఒక పోస్ట్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేసారు. ఇది నెటిజన్లను తెగ ఆకర్శించేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల సీఈఓల గురించి తెలుస్తోంది. నిజానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులే పెద్ద పెద్ద కంపెనీలలో ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లు గతంలోనే చాలా సందర్భాల్లో తెలిసింది. దీనిని ఉద్దేశించి ఆనంద్ మహీంద్రా.. భారతదేశం ప్రపంచ దేశాలకు కర్మాగారంగా మారుతున్నట్లు అనిపిస్తున్నట్లుందని వెల్లడించారు. ఇదీ చదవండి: కొత్త తరహా మోసానికి తెరలేపిన మోసగాళ్ళు.. మెసేజ్ చూసి కాల్ చేయండి! వాస్తవానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపనీలకు భారతీయులే సారధులుగా ఉంటున్నారు. అంతే కాకుండా యూట్యూబ్, వరల్డ్ బ్యాంక్ వంటి వాటిలో కూడా ఇండియన్స్ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ కనిపించే జాబితాలో FedEx సీఈఓ పేరు మిస్ చేసినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. Absolutely astounding. We seem to be turning into the talent factory of the world. (And I think you left out the CEO of FedEx!😊) https://t.co/WLKsKqiWTR — anand mahindra (@anandmahindra) August 27, 2023 -
ఆ విషయంలో దిగ్గజ కంపెనీలకు దీటుగా చిన్న సంస్థలు.. అదేమిటంటే?
ఎక్కువ వేతనాలు ఇచ్చే విభాగం ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది.. 'ఐటీ' ఫీల్డ్. అయితే గత కొంతకాలంగా ఐటీ సంస్థల ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు హైక్ చేయకపోగా.. మరి కొన్ని కంపనీలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా దిగ్గజ కంపెనీల కంటే చిన్న కంపెనీలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సీఈఓల కంటే కూడా చిన్న కంపెనీల సీఈఓలకు ఎక్కువ శాలరీలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ 'సందీప్ కల్రా' వేతనం ఏడాదికి రూ. 61.7 కోట్లు, కాగా.. ఎంఫాసిస్ (Mphasis) సీఈఓ జీతం రూ. 59.2 కోట్లు కావడం విశేషం. పెద్ద కంపెనీల జాబితాలో విప్రో సీఈఓ మాత్రమే రూ. 82.4 కోట్లు జీతం తీసుకుంటూ అధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా మొదటిస్థానంలో నిలిచాడు. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మినహా నిఫ్టీ కంపెనీలను మించిన వేతనాలు అందుకుంటున్న సీఈఓలలో కోఫోర్ట్ సీఈఓ సుధీర్ సింగ్ ఉన్నారు. ఇక టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ వేతనం రూ. 30 కోట్లు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో చాలామంది వేతనాలు భారీగా తగ్గినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
సుందర్ పిచాయ్,సత్య నాదెళ్ల మాత్రమేకాదు, ఈ టాప్ సీఈవోల గురించి తెలుసా?
-
మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!
భారత సంతతికిచెందిన టాప్ సీఈవోలు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ మొదలు, గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు భారతీయులు గ్లోబల్ కంపెనీలకు సారధులుగా ఉండిమెప్పిస్తున్నారు. 76వ ఇండిపెండెన్స్‌డే సందర్భంగా దిగ్గజ కంపెనీల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటున్న సీఈఓలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్థాయి వారికి అలవోకగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని, మొక్కవోని ధైర్యంతో అడుగులు వేయడమేకాదు, ఆధునిక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకం నుంచి భారత సంతతికి చెందిన టెక్ నిపుణులు, వ్యాపార దిగ్గజాలు గ్లోబల్ కంపెనీల్లో కీలక పదవుల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాహ్మ్ అండ్ హాస్ ఛైర్మన్, సీఈఓగా రాజ్ గుప్తా బాధ్యతలు స్వీకరించి కొత్త శకానికి నాంది పలికారు. ఆ తరువాత స్టాన్ర్ట్ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్, సీఈఓగా యూఎస్ ఎయిర్వేస్ గ్రూప్‌నకు రాకేశ్ గంగ్వాల్ సీఈగా ఎంపికై తమ ఘనతను చాటుకున్నారు. అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్‌పాల్ సింగ్ బంగా లేదా అజయ్‌బంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు. పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ,అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశారు.నెస్లే తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అజయ్‌పాల్ సింగ్ బంగా అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా, అంతకు ముందు ఏప్రిల్ 12, 2010 నుంచి 11 సంవత్సరాల పాటు మాస్టర్‌కార్డ్ సీఈవోగా పనిచేశారు. గతంలో పెప్సికో ,సిటీ గ్రూప్‌లో కూడా పనిచేశారు.ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. గీతా గోపీనాథ్ గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్లోనికోల్కతాలో పుట్టారు. 2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికై తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019-2022 దాకా ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు. జాన్ జ్వాన్‌స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (2005-2022), అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. గోపీనాథ్ క్రీడలు, సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచాయ్ సుందరరాజన్ సుందర్‌పిచాయ్ తమిళనాడులో చెన్నైలోని అశోక్ నగర్లో జన్మించారు. తల్లి లక్ష్మి వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్, తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. 2015లో గూగుల్ సీఈగా నియమితులయ్యారు. అనంతరం కేవలం నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్స్ డిగ్రీని, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.2021లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ , సీఈవో 1990లో ఐబీఎంలోచేరారు కృష్ణ. ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవో ఆతరువాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ ,బ్లాక్‌చెయిన్, నానోటెక్నాలజీతో సహా కోర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆవిష్కరణలతో ఐబీఎం మార్కెట్‌ను విస్తరించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అరవింద్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , అలాగే నార్త్రోప్ గ్రుమ్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన అరవింద్ కాన్పూర్ ఐఐటీనుంచి డిగ్రీ , అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. లక్ష్మణ్ నరసింహన్ స్టార్‌బక్స్ సీఈఓ 2023 ఏప్రిల్ 1న స్టార్‌బక్స్ సీఈవోగా ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ యూనివర్సిటీ ఆఫ్ పుణెలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ , యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జర్మన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఆయనకు ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్ష్టన్ స్కూల్ నుంచి ఆయన ఫైనాన్స్‌లో ఎంబీఏ పొందారు. ఇంద్రా నూయి: భారత సంతతికి చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి 12 ఏళ్ల పాటు అమెరికా దిగ్గజం పెప్సీకోకు సీఈవోగా పనిచేశారు. 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. చెన్నైకి చెందిన నూయి, 1996లో పెప్సికోలో చేరిన ఆమె 2006- 2018 వరకు సీఈఓగా పనిచేశారు. శ్రీకాంత్ దాతర్ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్. హార్వర్డ్ హార్వర్డ్ లో ఏకకాలంలో ఆర్థర్ లోవ్స్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా పనిచేసారు 2021లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీకాంత్ 1976-78లో IIMAలో మేనేజ్మెంట్లో PGP చేసారు. 1978-80 టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తో కలిసి పనిచేశారు. 1985లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం (అకౌంటింగ్)లో పీహెచ్డీ పొందారు. కార్నెగీ మెల్లన్ అండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, 1996 నుండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో IIMAలో విద్యార్థిగా, విద్యార్థి వ్యవహారాల మండలి సమన్వయకర్త (1977-78) గా పనిచేయడమే కాదు ఔట్ స్టాండింగ్ ఓవర్ ఆల్ పెర్పామెన్స్ అవార్డు' అందుకున్నారు. ఆతరువాత, IIMA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (2012-18)లో పనిచేశారు. డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా 2009లో ఆసియాలోనే పాపులర్బ్యాంకు డీబీఎస్గ్రూప్ సీఈవో డైరెక్టర్‌గా ఎంపికైనారు.ఈ గ్రూప్ ఆస్తుల విలువ 2019లో నాటికి 500 బిలియన్ల కంటే ఎక్కువ. 1960లో మీరట్‌లో జన్మించిన పీయూష్ గుప్తా ఢిల్లీలోని సెయింట్ కొలంబా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1980లో అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. ప్రముఖ కంపెనీల్లోని మరికొంతమంది భారత సంతతి సీఈవోలు వివేక్ శంకరన్- ఆల్బర్ట్సన్స్ అధ్యక్షుడు, సీఈవో సంజయ్ మెహ్రోత్రా- మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్,సీఈవో శాంతను నారాయణ్- అడోబ్ ఐఎన్‌సీ ఛైర్మన్, సీఈవో సీఎస్ వెంకట కృష్ణన్- బార్క్లేస్ సీఈవోపునిత్ రెన్జెన్- డెల్లాయిట్ సీఈవో రేవతి అద్వాతి- ఫ్లెక్స్ సీఈవో -
పెట్టుబడులతో రండి... అమెరికన్ కంపెనీలకు ప్రధాని పిలుపు
వాషింగ్టన్: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ అమెరికన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని పలు అగ్రగామి కంపెనీల సీఈవోలతో వాషింగ్టన్లో చర్చలు నిర్వహించారు. భారత సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని అమెరికన్ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీని కోరారు. టెక్నాలజీ ప్రాసెస్, ప్యాకేజింగ్ సామర్థ్యాల అభివృద్ధికి భారత్‌కు విచ్చేయాలని సెమీకండక్టర్ రంగంలో పనిచేసే ప్రముఖ సంస్థ అప్లయ్డ్ మెటీరియల్స్ సంస్థను ప్రధాని కోరారు. భారత్‌లోని సంస్థలతో సహకారానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అప్లయ్డ్ మెటీరియల్స్ సీఈ వో గ్యారీ డికర్సన్‌కు సూచించారు. భారత ఏవి యేషన్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ముఖ్య పాత్ర పోషించాలని జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో హెచ్ లారెన్స్‌కల్ప్‌తో భేటీ సందర్భంగా కోరారు. సుముఖంగా ఉన్నాం పరస్పర విజయానికి వీలుగా ప్రధాని మోదీ, భారత్‌లోని ప్రతి ఒక్కరితో కలసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. – గ్యారీ డికర్సన్, అప్లయ్డ్ మెటీరియల్స్ -
5జీకి భారత్ సారథ్యం
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి సాధనలో ఏ దేశానికైనా పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ అత్యంత కీలకంగా ఉంటోందని అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలు తెలిపారు. ఇందుకు ఊతమిచ్చే 5జీ సేవల విస్తరణ విషయంలో మిగతా దేశాలకు భారత్ సారథ్యం వహించగలదని వారు అభిప్రాయపడ్డారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా వారు ఈ విషయాలు తెలిపారు. భారత్ ఒక క్రమపద్ధతిలో డిజిటల్ వ్యవస్థను రూపొందించుకుంటోందని నోకియా కార్పొరేషన్ ప్రెసిడెంట్ పెకా లుండ్‌మార్క్ తెలిపారు. భారత్ తమకు ఇప్పుడు రెండో అతి పెద్ద మార్కెట్ అని, ఇక్కడి నుంచి 5జీ బేస్ స్టేషన్లను తాము ఎగుమతి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా, చైనాలో ఫేస్బుక్, టెన్సెంట్ వంటి డిజిటల్ కంపెనీల అభివృద్ధిలో 4జీ కీలకపాత్ర పోషించిందని ఎరిక్సన్ ప్రెసిడెంట్ బోర్జే ఎకోమ్ తెలిపారు. దేశీయంగా 5జీ సేవల వేగవంతమైన విస్తరణతో భారత్‌లో అత్యంత ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ చౌకగా లభించేలా అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్ట ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరం ఉందని నోకియా, ఎరిక్సన్ చీఫ్‌లు అభిప్రాయపడ్డారు. లేకపోతే గ్రామీణ ప్రజానీకం, అంతర్జాతీయ ఎకానమీని డిజిటల్‌గా అనుసంధానం చేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు .. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ ఉంటోందని జనరల్ అట్లాంటిక్ (ఇండియా) ఎండీ సందీప్ నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో భారత్‌లోకి 100 బిలియన్ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోకి వెల్లువెత్తుతున్న ప్రైవేట్ పెట్టుబడులను బట్టి చూస్తే ఇవి ఒక మోస్తరు అంచనాలు మాత్రమేనని నాయక్ వివరించారు. మొబైల్స్ భద్రత కోసం కొత్త నిబంధనలు పరిశ్రమ వర్గాలతో కేంద్రం సంప్రదింపులు యూజర్ల డేటా దుర్వినియోగం, ప్రీ–ఇన్స్టాల్డ్ నిఘా యాప్‌లపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ల భద్రతా ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడంపై కేంద్రం దృష్టి సారించింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనల రూపకల్పనపై పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఒక ట్వీట్లో ఈ విషయాలు వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, యాప్‌ల భద్రత చాలా కీలకంగా ఉండబోతోంది. అందుకే తగు స్థాయిలో భద్రతా ప్రమాణాలను రూపొందించేందుకు పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది‘ అని పేర్కొంది. మరోవైపు, డేటా దుర్వినియోగాన్ని అరికట్టే విషయంలో తాము కూడా ప్రభుత్వ పక్షానే ఉన్నామని మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థలు తెలిపాయి. అయితే, ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పడితే కొత్త హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టడంలో జాప్యం జరుగుతుందని, అలాగే ప్రీ–ఇన్స్టాల్డ్ (ముందుగానే ఇన్స్టాల్ చేసిన) యాప్స్ ద్వారా వచ్చే ఆదాయంపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. -
సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?
వివిధ కంపెనీల సీఈవోలు ఎంతెంత జీతాలు తీసుకుంటున్నారు అనే దానిపై జనానికి ఈ మధ్య ఆసక్తి పెరిగింది. కోట్లలో జీతాలు తీసుకుంటున్న సీఈవో గురించి వింటున్నాం. అయితే దానికి భిన్నంగా అతి తక్కువ వేతనం పొందుతున్న ఈ సీఈవో గురించి తెలుసుకోవాల్సిందే. కునాల్‌షా... క్రెడ్(CRED) అనే ఫిన్‌టెక్ కంపెనీ సీఈవో. ఆయన తీసుకుంటున్న నెలవారీ జీతం రూ.15వేలు. (చదవండి : నోకియా కొత్త లోగో చూశారా?...్ల రియాక్షన్స్ మాత్రం..!) కునాల్ షా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవోగా తాను ఎంత జీతం తీసుకుంటున్నది తెలియజేశారు. ఆయన చెప్పిన జీతాన్ని విని ఆశ్చర్యపోయిన ఓ యూజర్.. ఇంత తక్కువ జీతంలో ఎలా బతుకుతున్నారు సార్ అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్తూ.. కంపెనీ లాభదాయకంగా మారే వరకు తాను ఎక్కువ మొత్తంలో జీతం తీసుకోకూడదనుకున్నానని, అందుకే నెలకు కేవలం రూ. 15 వేలు జీతం తీసుకుంటున్నట్లు షా వివరించారు. తన మునుపటి కంపెనీ ఫ్రీచార్జ్‌ను విక్రయించగా వచ్చిన డబ్బుతో బతుకుతున్నానని ఆయన పేర్కొన్నారు. (ఇదీ చదవండి: భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగ్! కోడ్‌నేమ్ ఏంటో తెలుసా?) ప్రారంభంలో ఇలా తక్కువ జీతం తీసుకున్నట్లు చెప్పిన సీఈవోలు చాలా మందే ఉన్నారు. 2013లో జుకర్‌బర్గ్ కేవలం 1 డాలర్ వార్షిక వేతనం తీసుకుని ఫేస్బుక్లో అతి తక్కువ వేతనం పొందే ఉద్యోగిగా నిలిచారు. కాకపోతే బోనస్‌లు, స్టాక్ అవార్డుల రూపంలో పరిహారం అందుకున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్, ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సేలు కూడా తాము సంవత్సరానికి 1 డాలర్ జీతం మాత్రమే తీసుకున్నామని అప్పట్లో చెప్పారు. (ఇదీ చదవండి: Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!) -
ఆర్థిక వృద్ధిపై సీఈవోల్లో సానుకూల ధోరణి
ముంబై: స్థూల ఆర్థిక సవాళ్లు, అనిశ్చితులు వేధిస్తున్నప్పటికీ.. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని మెజారిటీ సీఈవోలు భావిస్తున్నారు. ఆర్థర్ డి లిటిల్ సంస్థ ఇందుకు సంబంధించి ‘2023 సీఈవో ఇన్సైట్స్ రీసెర్చ్’ పేరుతో ఓ అధ్యయనం నిర్వహించింది. వృద్ధి పట్ల సానుకూల అంచనాలతో ఉన్న సీఈవోల్లో సగం మంది తాము కొత్త ప్రాంతాల్లోకి వ్యాపార విస్తరణ చేస్తామని చెప్పారు. 30 శాతం సీఈవోలు మార్కెట్ కంటే వేగవంతమైన వృద్ధిని చూస్తామని పేర్కొన్నారు. వార్షిక అమ్మకాలు కనీసం బిలియన్ డాలర్లకు పైగా ఉన్న 250 కంపెనీల సీఈవోల అభిప్రాయాలను ఈ అధ్యయనం కోసం తెలుసుకున్నారు. సర్వేలో పాల్గొన్న భారత సీఈవోల్లో 33 శాతం మంది.. వచ్చే 3–5 ఏళ్ల ఆర్థిక వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా ఇలా చెప్పిన సీఈవోలు 22 శాతంగా ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక అనిశ్చితుల్లోనూ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సీఈవోలు సానుకూల దృక్పథంతో ఉన్నారు. వచ్చే 3–5 ఏళ్లపాటు సానుకూల వృద్ధి ఉంటుందని చెప్పిన సీఈవోల్లో నార్త్ అమెరికాలో పావు శాతం, ఆసియాలో 10 శాతం, యూరప్‌లో 38 శాతం చొప్పున ఉన్నారు. అధిక వ్యయాలు చేసేందుకు 60 శాతం మంది భారత సీఈవోలు సానుకూలంగా ఉంటే, వృద్ధి అంచనాలకు తగ్గట్టు వ్యయాలు చేస్తామని 33 శాతం మంది చెప్పారు. మార్కెట్ కంటే అధిక వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 75 శాతం భారత సీఈవోలు ఉన్నారు. వృద్ధి కోసం పెట్టుబడులకు సైతం సుముఖంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వృద్ధి పట్ల భారత సీఈవోల్లో ఎక్కువ ఆశాభావం ఉన్నట్టు ఆర్థర్ డి లిటిల్ ఎండీ బర్నిక్ చిత్రన్ మైత్ర తెలిపారు. -
వేదాంత కెయిర్న్ ఆయిల్ సీఈవోగా నిక్ వాకర్
న్యూఢిల్లీ: వేదాంతకు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ నూతన సీఈవోగా నిక్ వాకర్‌ను నియమించుకుంది. జనవరి 5 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ప్రకటన విడుదల చేసింది. దీనికి ముందు వరకు నిక్ వాకర్ యూరప్‌కు చెందిన ప్రముఖ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీ అయిన లండిన్ ఎనర్జీకి సీఈవో, ప్రెసిడెంట్‌గా పనిచేశారు. -
విచారణ పేరుతో వేధించడం మానుకోండి!
న్యూఢిల్లీ: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) వంటి ఒక కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ అధికారులను ఆషామాషీగా పిలవడం (సమన్స్ జారీ), వారిని అరెస్ట్ చేయడం వంటి విధానాలను విడనాడాలని క్షేత్రస్థాయి కార్యాలయాలను జీఎస్టీ (వస్తు సేవల పన్ను) ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఆదేశించింది. జీఎస్టీ చట్టం కింద యాంత్రిక పద్ధతిలో అరెస్టు చేసే విధానాలకు పాల్పడవద్దని స్పష్టం చేసింది. ప్రత్యక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) పర్యవేక్షణలో పనిచేసే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఈ మేరకు ఫీల్డ్ ఆఫీసర్లకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటికి సంబంధించి కొన్ని కీలకాంశాలను చూస్తే.. ►ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ అరెస్టు వల్ల దెబ్బతింటుంది. అటువంటి చర్య విశ్వసనీయమైన అంశాల ఆధారంగా ఉండాలి. అరెస్టును మామూలుగా, యాంత్రికంగా చేయకూడదు. ►జీఎస్టీ ఎగవేత ఆరోపణలకు సంబంధించి నేరస్థుడిని అరెస్టు చేయాలనుకుంటే, సంబంధిత అధికారుల కోసం మార్గదర్శకాల చెక్లిస్ట్ను కూడా ఫీల్డ్ ఆఫీసర్లు పరిగణనలోకి తీసుకోవాలి. నేరస్థుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా లేదా సాక్షులను బెదిరించే అవకాశం ఉందా, నేరానికి ఆ వ్యక్తి సూత్రధారా? వంటి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు సరిచేసుకోవాలి. ►చట్టపరమైన అవసరాలను నెరవేర్చడమే కాకుండా, ఒక వ్యక్తిని అరెస్టు చేయాలని నిర్ణయించే ముందు సంబంధిత అంశాలు తప్పనిసరిగా సరైన దర్యాప్తుతో నిర్ధారించుకోవాలి. సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడం వంటి అవకాశాలను నిరోధించడానికి, ఆ అవసరం ఏర్పడినప్పుడే అరెస్టులు జరగాలి. ►ఏదైనా కంపెనీ లేదా పీఎస్‌యూ (ప్రభుత్వ రంగ సంస్థ) సీఎండీ, ఎండీ, సీఈఓ, సీఎఫ్ఓ వంటి సీనియర్ మేనేజ్మెంట్ అధికారులకు సాధారణంగా మొదటి సందర్భంలోనే సమన్లుజారీ చేయకూడదు. ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీసిన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి ప్రమేయంపై జరిగిన దర్యాప్తులో వారి ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే వారిని పిలిపించాలి. ►మెటీరియల్ ఎవిడెన్స్, సంబంధిత పత్రాల కోసం ఫీల్డ్ ఆఫీసర్లు కంపెనీల ఉన్నతాధికారులను ‘ఏదో ఆషామాషీగా’ పిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, జీఎస్టీ పోర్టల్‌లో ఆన్లైన్లో అందుబాటులో ఉండే జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–వంటి చట్టబద్ధమైన రికార్డుల కోసం సైతం కంపెనీ అధికారులకు సమన్లు పంపుతున్నట్లు సమాచారం. జీఎస్టీ పోర్టల్‌లో డిజిటల్‌గా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన పత్రాల కోసం సమన్ల జారీ చేయడం ఎంతమాత్రం తగదు. సుప్రీంకోర్టు రూలింగ్‌కు అనుగుణంగా... అరెస్టుకు సంబంధించిన జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇటీవలి ఇచ్చిన ఒక తీర్పును పరిగణనలోకి రూపొందాయి. ‘‘చట్టబద్ధమైన రీతిలోనే, దీనిని అనుగుణంగా నడుచుకోలేదని స్పష్టమైన ఆధారాలతోనే ఒక అరెస్ట్ జరగాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు తన రూలింగ్‌లో పేర్కొంది. అరెస్టు చేసే అధికారం– దానిని అమలు చేయడానికి గల సమర్థనకు మధ్య తేడాను గుర్తించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకర్షణీయం వివిధ సందర్భాల్లో సాధారణ విషయాల కోసం కంపెనీల సీనియర్ అధికారులకు సమన్లు జారీ అవుతున్నాయి. కంపెనీ పన్ను విభాగంతో పరిష్కారమయ్యే అంశాలకు సైతం సీనియర్ అధికారులకు సమన్లు తగవు. ఈ నేపథ్యంలో జీఎస్టీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ మార్గదర్శకాలు హర్షణీయం. – అభిషేక్ జైన్, కేపీఎంజీ వేధింపులకు అడ్డుకట్ట తాజా మార్గదర్శకాలు కింది స్థాయి జీఎస్టీ అధికారుల విపతీరమైన విధింపులను అరికట్టడానికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాం. రజత్ మోహన్,ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ -
ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దీని ప్రకారం.. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు. ► దాదాపు సగం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం. ► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు. ► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు. ► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు. ► హెచ్1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. ► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్‌తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు. ► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్ సంబంధ లాక్డౌన్ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు. -
నా దారి రహదారి: ఈలాన్ మస్క్ మరో ఘనత
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా నిలిచారు. స్పేస్ ఎక్స్, టెస్లా, ది బోరింగ్ కంపెనీ, స్టార్‌లింక్ సంస్థల వ్యవస్థాపకుడు 2021వ సంవత్సరంలో అత్యధికంగా జీతం పొందిన ఫార్చ్యూన్-500 టాప్-10 సీఈవోల తాజా జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 2021లో ఫార్చ్యూన్ 500 టాప్ సీఈవోల యాపిల్ సీఈవో టిమ్ కుక్, నెటిఫ్లిక్స్ రీడ్ హేస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల సహా ఇతర టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన వారున్నారు. 2021లో ఎలాన్‌మస్క్ పొందిన వేతనం 23.5 బిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో టెస్లా 65వ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 71 శాతం ఆదాయంపెంచుకున్న టెస్లా గతేడాది ఆదాయం 53. 8 బిలియన్ డాలర్లు. గతేడాది టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం 770.5 మిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆపిల్‌కు మూడో స్థానం ఉంది. అంతర్జాతీయంగా చిప్ కొరత సమస్యను ఎదుర్కొన్నా ఆపిల్ మాత్రం టాప్ ర్యాంకులోనే కొనసాగుతోంది. ఇంకా న్విదియా సంస్థ కో ఫౌండర్ హాంగ్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హాస్టింగ్స్ వేతనాల్లో మూడో, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5 చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ 2021లో వేతనం పరంగా ఈలాన్ మస్క్ టాప్-1 ప్లేస్‌లో ఉన్నారు. టెస్లా కంపెనీ సాధించిన ఘనమైన ఆదాయాల నేపథ్యంలో 53.8 బిలియన్ల డాలర్ల మొత్తం రాబడి 2020 నుండి 71శాతం పెరిగింది. ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల కంపెనీ 2021లో కీలకమైన యూరోపియన్ ,చైనీస్ మార్కెట్లలో 936,000 వాహనాలను డెలివరీ చేసింది. ఇది 87 శాతం జంప్. యాపిల్ సీఈవో టిమ్ కుక్: 2011 నుండి కుక్ ఆపిల్ సీఈవోగా ఉన్న కుక్ ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. 2021లో ఆయన వేతనం 770.5 మిలియన్ డాలర్లు. ఈ 10 సంవత్సరాల్లో 1.7 బిలియన్ల షేర్లను ఆయనకు దక్కాయి. అలాగే కుక్ హయాంలో యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఆపిల్ 2వ స్థానంలో నిలిచింది. 95 బిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది. న్విదియా, జెన్సన్ హువాంగ్ షీల్డ్ గేమింగ్ కన్సోల్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్కి ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీ న్విదియా సహ వ్యవస్థాపకుడు హువాంగ్ వేతనం 561 మిలియన్ డాలర్లు స్వీకరించాడు. సుమారుగా 60 రెట్లు పెరిగింది. నెట్‌ఫ్లిక్స్, రీడ్ హేస్టింగ్స్ :2021లో నెట్‌ఫ్లిక్స్ సహ-వ్యవస్థాపకుడు సీఈవో రీడ్ హేస్టింగ్స్ వతేనం 453.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్, లియోనార్డ్ ష్లీఫెర్ ఆస్తమా, క్యాన్సర్, దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేసే వివిధ రకాల ఔషధాలను తయారు చేసే బయోటెక్ సంస్థ రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు ఫార్చ్యూన్ 500 జాబితాలో ఐదవ అత్యంత వేతనం పొందిన స సీఈవోగా అయిదో స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెళ్ల 309.4 మిలియన డాలర్లతో ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. -
సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరి సాధారణ సంస్థల్లో పరిస్థితిలు ఇలా ఉంటే..దిగ్గజ టెక్ కంపెనీలు అందుకు విభిన్నంగా వ్యవహరించాయి. ప్రపంచ దేశాలకు చెందిన టాప్-10 టెక్ కంపెనీలు ఆ సంస్థల్లో పనిచేస్తున్న సీఈఓలకు 2020-2021 మధ్య కాలంలో భారీగా బోనస్‌లు అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అనూహ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ షాకిచ్చింది. కోవిడ్ సమయంలో టెక్ కంపెనీలు అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయి. దీంతో టెక్ కంపెనీలు వారి సంస్థల్లో సీఈఓలుగా పనిచేస్తున్న వారికి ఊహించని విధంగా బోనస్‌లు పెంచాయి. కానీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ సంస్థ 14శాతం బోనస్‌ను తగ్గించిందని ఫైన్‌బోల్డ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇదే అంశాన్ని జాతీయ మీడియా సంస్థ న్యూస్-18 ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. టాప్-5 సీఈఓల బోనస్‌లు భారీగా బోనస్‌లు పెరిగిన సీఈఓల జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థ బ్రాడ్‌కామ్ సీఈఓ తాన్ హాక్ ఎంగ్ ఉన్నారు. ఆయన అత్యధికంగా ఏకంగా 1586శాతం బోనస్ పొందాడు. ఇది 3.6 అమెరికన్ మిలియన్ డాలర్ల నుంచి 60.7మిలియన్ డాలర్లుగా ఉంది. తాన్ హాక్ ఎంగ్ తర్వాత ఒరాకిల్ సీఈఓ సాఫ్రా అడా క్యాట్జ్ (Safra Ada Catz), ఇంటెల్ సీఈఓ పాట గ్లెసింగెర్, యాపిల్ సీఈఓ టీమ్ కుక్, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్పీ ఉన్నారు. ఒరాకిల్ సీఈఓ సాఫ్రా అడా క్యాట్జ్ అత్యధికంగా బోనస్‌లు పొందిన సీఈఓల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. 999శాతంతో భారీగా బోనస్ పొందారు. ప్యాండమిక్‌లో టెక్ దిగ్గజాలు భారీ ఎత్తున లాభాల్లో గడించాయి. దీంతో సంస్థలు సైతం అందుకు కారణమైన సీఈఓలకు కళ్లు చెదిరేలా బోనస్‌లు అందించినట్లు ఫైన్‌బోల్డ్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఇంటెల్ సీఈఓ పాట గ్లెసింగెర్ 713.64శాతంతో 22 మిలియన్ల నుంచి 179 మిలియన్ డారల్లను పొందారు. అదే సమయంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం 571.63శాతం బోనస్‌తో 35.8 మిలియన్ల నుంచి 211.9మిలియన్లు, అమెజాన్ సీఈఓ అండీ జాస్సీ 491.9 శాతంతో 35.8 మిలియన్ల నుంచి 211.9 మిలియన్లను సొంతం చేసుకొని.. అత్యధికంగా బోనస్‌లు పొందిన టాప్-5 టెక్ కంపెనీల సీఈఓల జాబితాలో ఒకరిగా నిలిచారు. సుందర్ పిచాయ్‌కు భారీ షాక్! మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ 52.17 శాతం బోనస్‌ను, సిస్కో సీఈఓ చుక్ రాబిన్సన్ 9.48శాతం బోనస్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ 5.93 శాతం పొందగా..నెట్ ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హ్యాస్టింగ్స్ 19.68 శాతంతో 43.2 మిలియన్ డాలర్ల నుంచి 34.7 మిలియన్ డాలర్లు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు 14శాతం బోనస్ కట్ చేసి భారీ షాక్ ఇచ్చింది. అయితే సుందర్ పిచాయ్ బోనస్ కోల్పోయినా స్టాక్ ప్యాకేజీ భారీగా దక్కించుకున్నారు. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం (సంవత్సరం) రూ.14కోట్లు ఉండగా..అదనంగా 2020, 2021ఈ రెండేళ్ల కాలంలో స్టాక్ ప్యాకేజీ కింద గూగుల్ సంస్థ రూ.1707కోట్లు అందించినట్లు ఫైన్‌బోల్డ్ నివేదిక తెలిపింది. చదవండి: ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు -
వస్తే ఎర్రతివాచీతో స్వాగతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులతో వచ్చేవారికి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. పారిస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ నేతృత్వంలోని బృందం శనివారం పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో భేటీలు నిర్వహించింది. ‘యాంబిషన్ ఇండియా’ సదస్సులో అంతర్భాగంగా పలు భేటీలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలకు ఆహ్వానం పలికారు. కేటీఆర్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ఏరో స్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు. కేటీఆర్ భేటీలు సాగాయిలా.. ► ఫ్రాన్స్‌లో రెండో అతిపెద్ద ఫార్మాసూటికల్ గ్రూప్ యాజమాన్యంతో మంత్రి కేటీఆర్ భేటీ అ య్యారు. తెలంగాణలో ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగ వాతావరణాన్ని వివరించడంతో పాటు పరిశ్రమలు, విద్యారంగం అనుసంధానానికి రీసెర్స్ అండ్ ఇన్నొవేషన్ సర్కి ల్ ఆఫ్ హైదరాబాద్ చూపుతున్న చొరవను ప్ర స్తావించారు. 2022లో జరిగే బయో ఏసియా స దస్సులో పాల్గొని పరస్పర భాగస్వామ్యానికి ఉ న్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు. ► సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఇంజిన్స్ సీఈవో జీన్‌పాల్ అల్రే, భారత్‌లో ఫ్రాన్స్ మాజీ రాయబారి అలెగ్జాండర్ జిగెల్తోనూ కేటీఆర్ భేటీ అయ్యా రు. సాఫ్రాన్ ఇటీవల హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో వైమానిక, రక్షణ రంగాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుపై సాఫ్రాన్ ప్రతినిధి బృందంతో చర్చించారు. ఫ్రాన్స్‌లో భారత రాయబార కార్యాలయం ఎయిర్అటాషెగా ఉన్న ఎయిర్ కమెడోర్ హిలాల్ అహ్మద్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ► 115 దేశాల్లో 4 వేలకుపైగా ప్రాజెక్టుల ద్వారా సుస్థిర అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తున్న ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎఎఫ్‌డీ) ఆసియా, మధ్యప్రాచ్యం వ్యవహారాల డైరెక్టర్ ఫిలిప్ ఓర్లియాంజేతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. రక్షణ, సైనిక, వైమానిక, అంతరిక్ష, రవాణా రంగాల్లో పనిచేస్తున్న థేల్స్ గ్రూప్ సీనియర్ ఉపాధ్యక్షులు మార్క్ డార్మన్, భారత్ సీఈవో ఆశిష్ సరాఫ్‌తో కేటీఆర్ బృందం భేటీ జరిపింది. హైదరాబాద్ మెట్రో నిర్వహణలో భాగస్వామిగా ఉన్న కియోలిస్ గ్రూప్ సీఈవో బెర్నార్డ్ తబరీతో భేటీ అయ్యారు. ఎనర్జీ, ఆటోమేషన్‌లో డిజిటల్ పరిష్కారాలు చూపే ష్నీడర్ ఎలక్ట్రిక్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు లుక్ రెమోంట్ తో సమావేశమయ్యారు. ► పారిస్‌లోని లక్సంబర్గ్ ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం, బోర్డెక్స్ మెట్రోపోల్ నడుమ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. సుస్థిర నగరాలను అ భివృద్ధి చేసే లక్ష్యం తో పలు ప్రాజెక్టులపై తెలంగాణ, బోర్డెక్స్ మెట్రోపోల్ కలసి పనిచేస్తాయి. 2015 అక్టోబర్ 13న ఇరుపక్షాల నడుమ కుదిరిన ఒప్పందానికి కొనసాగింపుగా ఈ ఎంఓయూ కు దిరింది. ► పారిస్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను నీలా శ్రీనివాస్ నేతృత్వంలోని ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్రాన్స్’సభ్యులు, నారాయణరావు నేతృత్వంలోని ‘ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్’సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
రండి భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయిదు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహా్వనించారు. భారత్‌లో వ్యాపార అవకాశాల గురించి వివరించారు. చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఇ అమోన్, సౌర విద్యుత్ సంస్థ ఫస్ట్ సోలార్ చీఫ్ మార్క్ విడ్మర్, ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చైర్మన్ స్టీఫెన్ ఎ ష్వార్జ్‌మాన్, అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్, జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్‌తో ప్రధాని భేటీ అయ్యారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం ఐటీ, డిజిటల్ రంగానికి భారత్ ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో నారాయణ్‌తో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సాయుధ బలగాల కోసం భారత్ గణనీయంగా డ్రోన్లను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మి లిటరీ డ్రోన్ల తయారీ దిగ్గజం జనరల్ అటామిక్స్ సీఈవో లాల్‌తో ప్రధా ని సమావేశమయ్యారు. జనరల్ అటామిక్స్ నుంచి భారత్ ఇప్పటికే కొన్ని డ్రోన్లను లీజుకు కూడా తీసుకుంది. దాదాపు 18 బిలియన్ డాలర్ల విలువ చేసే ద్వైపాక్షిక రక్షణ రంగ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో లాల్ కీలక పాత్ర పోషించారు. చదవండి: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు మరోవైపు, మరిన్ని పెట్టుబడులను సాధించే క్రమంలో అగ్రగామి ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ చైర్మన్ ష్వార్జ్‌మాన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. అటు దేశీయంగా 5జీ టెలికం టెక్నాలజీ అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా క్వాల్కామ్ చీఫ్ అమోన్‌తో సమావేశమయ్యారు. దేశీయంగా తయారీ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన్ను ఆహ్వానించారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఫస్ట్ సోలార్ హెడ్ విడ్మర్‌తో సమావేశం సందర్భంగా భారత్‌లో పునరుత్పాదక విద్యు త్ రంగంలో అవకాశాల గురించి ప్రధాని చర్చించినట్లు వివరించింది. -
ఆశావహంగా ఆదాయాల రికవరీ
న్యూఢిల్లీ: వ్యాపారాలను సులభతరంగా నిర్వహించడమనేది క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ కష్టతరంగా ఉండటం, వ్యాపార నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం ప్రైవేట్ రంగం ఆకాంక్షలను దెబ్బతీస్తోందని కార్పొరేట్లు భావిస్తున్నారు. అయితే, వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రకటనలతో 2021–22లో కంపెనీల పనితీరు మెరుగుపడగలదని ఆశిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సుమారు 117 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) ఇందులో పాల్గొన్నారు. 2019–20 (కరోనా పూర్వం) ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయాలు 10 శాతం వృద్ధి చెందగలవని 46 శాతం మంది సీఈవోలు ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధి సాధన మీద ప్రైవేట్ కంపెనీల్లో ఉండే కసిపై క్షేత్ర స్థాయి సమస్యలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 51 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. పెట్టుబడి కాకుండా వ్యాపార నిర్వహణకు అయ్యే ఇతరత్రా వ్యయాలు భారీగా ఉంటున్నాయని 32 శాతం మంది సీఈవోలు తెలిపారు. -
అభివృద్ధికి పరుగులు,పెట్టుబడులకు ఆకర్షణీయ దేశం భారత్
న్యూఢిల్లీ: అభివృద్ధికి పరుగులు విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్ ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశం చేపట్టిన విస్తృత స్థాయి సంస్కరణలు దీనికి కారణమని అన్నారు. అమెరికా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. దేశం కోవిడ్–19 సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా పేర్కొన్న ఆర్థికమంత్రి, కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌లు, వ్యాక్సినేషన్ కార్యక్రమం పురోగతి వంటి అంశాలను చర్చించారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌బీఐసీ) నిర్వహించిన ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో జనరల్ ఎలక్ట్రిక్, బాక్స్టర్ హెల్త్‌కేర్ యూఎస్ఏ, బ్రాంబుల్స్, మార్ష్ అండ్ మెక్లెనన్, పెప్సికో తదితర ప్రముఖ విదేశీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్–19 సెకండ్‌వేవ్ సమయంలో భారత్‌కు వనరుల కోసం ఒక గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కృషి చేసిన 40 అమెరికా టాప్ కంపెనీల సీఈఓలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
కరోనా : టాటా గ్రూపు సీఈవోల కీలక నిర్ణయం
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభంతో తన చరిత్రలోనే టాటా గ్రూపు టాప్ మేనేజ్ మెంట్ తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా, టాటా గ్రూప్ కంపెనీల సీఈఓలు వేతనంలో కోత విధించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఖర్చు తగ్గించే చర్యలను ప్రారంభించిన నేపథ్యంలో 20 శాతం దాకా వేతన కోతకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్ , లాక్డౌన్ కారణంగా వ్యాపారం ప్రభావితం కావడంతో సంస్థ తాజా నిర్ణయం వెలువడింది. తాజా నిర్ణయం ప్రకారం టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా క్యాపిటల్, వోల్టాస్ ఇతర కంపెనీల సీఈవోలు, ఎండీలు వారి వారి జీతాలను తగ్గించు కుంటారు. అలాగే ప్రస్తుత సంవత్సర బోనస్‌లను వదులుకోనున్నారు. ఈ వరుసలో గ్రూప్ ప్రధానమైన, అత్యంత లాభదాయక సంస్థ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ ముందు వరుసలో నిలిచారు. సంస్థ ప్రకటించిన సమాచారం ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2019-20లో రాజేష్ రెమ్యునరేషన్ 16.5 శాతం తగ్గి రూ .13.3 కోట్లకు చేరుకుంది. తద్వారా సంస్థలకు, కీలక ఉద్యోగులకు ప్రేరణ ఇవ్వడంతోపాటు, నైతిక మద్దతు అందించాలని భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రేరిత సంక్షోభం సమయంలో పే-కట్ తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఇదేనని కంపెనీ వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2020 ఆర్థిక సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ వేతనాలు భారీగా క్షీణించాయి. టాప్15 టాటా గ్రూప్ కంపెనీలలో సీఈవో వేతనం ఎఫ్వై18 పోలిస్తే...ఎఫ్వై 19లో సగటున 11 శాతం పెరిగింది. ఎఫ్వై 17 తో పోలిస్తే ఎఫ్వై 18 లో 14 శాతం పెరిగింది.