సీఈవోల అండర్‌వాటర్‌ సమావేశం | CEOs hold underwater conference in Thiruvananthapuram | Sakshi
Sakshi News home page

సీఈవోల అండర్‌వాటర్‌ సమావేశం

Published Tue, Apr 11 2017 1:25 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

సీఈవోల అండర్‌వాటర్‌ సమావేశం

సీఈవోల అండర్‌వాటర్‌ సమావేశం

తిరువనంతపురం: సాధారణంగా కార్పొరేట్ల సదస్సులు, సమావేశాలకు స్టార్‌ హోటళ్లు, కాన్ఫరెన్స్‌ హాళ్లూ వేదికలవుతూ ఉంటాయి. కానీ కేరళలోని కోవళంలో ఇందుకు కాస్త భిన్నంగా నీటి లోపల అండర్‌వాటర్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  సముద్రాల్లో కాలుష్య నివారణ, జీవావరణ పరిరక్షణకు తీసుకోతగిన చర్యలపై ’ఓషన్‌ లవ్‌’ పేరిట జరిగిన ఈ సదస్సులో అయిదు కంపెనీల సీఈవోలు పాల్గొన్నారు.

అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వినూత్నమైన ఈ ఈవెంట్‌ను ఉదయ సముద్ర గ్రూప్, బాండ్‌ సఫారీ గ్రూప్‌ నిర్వహించాయి. ప్రపంచంలోనే ఈ తరహా సదస్సు జరగడం ఇదే తొలిసారని పేర్కొన్నాయి. రాజగోపాల్‌ అయ్యర్‌ (యూడీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌), హేమా మీనన్‌ (యూఎస్‌టీ గ్లోబల్‌), దినేష్‌ పి తంబి (టీసీఎస్‌), శ్యామ్‌ కుమార్‌ (నియోలాజిక్స్‌), రోనీ థామస్‌ (ఎవన్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌) ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement