ప్రపంచ టాప్–30 సీఈవోల్లో ఆదిత్యపురి
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం కు ఎండీ ఆదిత్యపురి(66) మరోసారి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు సొం తం చేసుకున్నారు. ప్ర పంచంలోని అత్యుత్తమ 30 మంది సీఈవోల్లో ఆదిత్యపురిని ఒకరిగా అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ మేగజైన్ బారన్స్ గుర్తించింది. ‘‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును పురి ఒక స్టార్టప్ నుంచి ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత గల బ్యాంకుల్లో ఒకటిగా మార్చా రు. రుణ ప్రమాణాలను పాటిస్తూ అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టారు. కార్పొరేట్ రుణాల నుంచి పూర్తి స్థాయి సేవలు అందించే రిటైల్ బ్యాంకుగా మార్చారు’’ అని బారన్స్ ప్రశంసించింది.