ముంబై: ప్రైవేట్ రంగంలోని టాప్ 3 ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఆదిత్య పురి అత్యధిక వేతన ప్యాకేజీ అందుకున్నారు. ఆయన రిటైర్ అయిన గత ఆర్థిక సంవత్సరంలో(2020–21) రూ. 13.82 కోట్లు జీతభత్యాల రూపంలో పొందారు. ఇందులో రూ. 3.5 కోట్ల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పురి రిటైర్మెంట్ తర్వాత సీఈవో, ఎండీగా నియమితులైన శశిధర్ జగదీశన్ రూ. 4.77 కోట్లు వేతనం అందుకున్నారు. మరోవైపు, కోవిడ్–19పరమైన పరిస్థితుల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ బక్షి స్వచ్ఛందంగా తన జీత భత్యాల్లో ఫిక్స్‌డ్ భాగాన్ని, కొన్ని అలవెన్సులను వదులుకున్నారు. రూ. 38.38 లక్షల అలవెన్సులు అందుకోగా .. 2017, 2018 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ. 63.60 లక్షలు పనితీరు ఆధారిత బోనస్ పొందారు. అటు యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి రూ. 6.52 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment