ఎక్కువ వేతనాలు ఇచ్చే విభాగం ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది.. 'ఐటీ' ఫీల్డ్. అయితే గత కొంతకాలంగా ఐటీ సంస్థల ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు హైక్ చేయకపోగా.. మరి కొన్ని కంపనీలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా దిగ్గజ కంపెనీల కంటే చిన్న కంపెనీలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సీఈఓల కంటే కూడా చిన్న కంపెనీల సీఈఓలకు ఎక్కువ శాలరీలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ 'సందీప్ కల్రా' వేతనం ఏడాదికి రూ. 61.7 కోట్లు, కాగా.. ఎంఫాసిస్ (Mphasis) సీఈఓ జీతం రూ. 59.2 కోట్లు కావడం విశేషం. పెద్ద కంపెనీల జాబితాలో విప్రో సీఈఓ మాత్రమే రూ. 82.4 కోట్లు జీతం తీసుకుంటూ అధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా మొదటిస్థానంలో నిలిచాడు.
ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే?
విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మినహా నిఫ్టీ కంపెనీలను మించిన వేతనాలు అందుకుంటున్న సీఈఓలలో కోఫోర్ట్ సీఈఓ సుధీర్ సింగ్ ఉన్నారు. ఇక టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ వేతనం రూ. 30 కోట్లు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో చాలామంది వేతనాలు భారీగా తగ్గినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment