ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా నిలిచారు. స్పేస్ ఎక్స్, టెస్లా, ది బోరింగ్ కంపెనీ, స్టార్‌లింక్ సంస్థల వ్యవస్థాపకుడు 2021వ సంవత్సరంలో అత్యధికంగా జీతం పొందిన ఫార్చ్యూన్-500 టాప్-10 సీఈవోల తాజా జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 2021లో ఫార్చ్యూన్ 500 టాప్ సీఈవోల యాపిల్ సీఈవో టిమ్ కుక్, నెటిఫ్లిక్స్ రీడ్ హేస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల సహా ఇతర టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన వారున్నారు.
2021లో ఎలాన్‌మస్క్ పొందిన వేతనం 23.5 బిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో టెస్లా 65వ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 71 శాతం ఆదాయంపెంచుకున్న టెస్లా గతేడాది ఆదాయం 53. 8 బిలియన్ డాలర్లు. గతేడాది టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం 770.5 మిలియన్ల డాలర్లు. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆపిల్‌కు మూడో స్థానం ఉంది. అంతర్జాతీయంగా చిప్ కొరత సమస్యను ఎదుర్కొన్నా ఆపిల్ మాత్రం టాప్ ర్యాంకులోనే కొనసాగుతోంది. ఇంకా న్విదియా సంస్థ కో ఫౌండర్ హాంగ్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హాస్టింగ్స్ వేతనాల్లో మూడో, నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
టాప్-5 చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు
టెస్లా సీఈవో ఈలాన్ మస్క్
2021లో వేతనం పరంగా ఈలాన్ మస్క్ టాప్-1 ప్లేస్‌లో ఉన్నారు. టెస్లా కంపెనీ సాధించిన ఘనమైన ఆదాయాల నేపథ్యంలో 53.8 బిలియన్ల డాలర్ల మొత్తం రాబడి 2020 నుండి 71శాతం పెరిగింది. ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల కంపెనీ 2021లో కీలకమైన యూరోపియన్ ,చైనీస్ మార్కెట్‌లలో 936,000 వాహనాలను డెలివరీ చేసింది. ఇది 87 శాతం జంప్.
యాపిల్ సీఈవో టిమ్ కుక్: 2011 నుండి కుక్ ఆపిల్ సీఈవోగా ఉన్న కుక్ ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. 2021లో ఆయన వేతనం 770.5 మిలియన్ డాలర్లు. ఈ 10 సంవత్సరాల్లో 1.7 బిలియన్ల షేర్లను ఆయనకు దక్కాయి. అలాగే కుక్ హయాంలో యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ఆపిల్ 2వ స్థానంలో నిలిచింది. 95 బిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది.
న్విదియా, జెన్సన్ హువాంగ్
షీల్డ్ గేమింగ్ కన్సోల్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్‌కి ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీ న్విదియా సహ వ్యవస్థాపకుడు హువాంగ్ వేతనం 561 మిలియన్ డాలర్లు స్వీకరించాడు. సుమారుగా 60 రెట్లు పెరిగింది.
నెట్‌ఫ్లిక్స్, రీడ్ హేస్టింగ్స్ :2021లో నెట్‌ఫ్లిక్స్ సహ-వ్యవస్థాపకుడు సీఈవో రీడ్ హేస్టింగ్స్ వతేనం 453.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్, లియోనార్డ్ ష్లీఫెర్
ఆస్తమా, క్యాన్సర్, దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేసే వివిధ రకాల ఔషధాలను తయారు చేసే బయోటెక్ సంస్థ రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ సహ వ్యవస్థాపకుడు ఫార్చ్యూన్ 500 జాబితాలో ఐదవ అత్యంత వేతనం పొందిన స సీఈవోగా అయిదో స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెళ్ల 309.4 మిలియన డాలర్లతో ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment