
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్‌తో యుద్ధానికి సై అంటే సై అన్న బిలియనీర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ముఖ్యంగా యాపిల్ ప్రధాన కార్యాలయంలో యాపిల్ సీఈవో టీమ్ కుక్‌తో భేటీ తర్వాత మస్క్ మాట మార్చడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!)
టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ప్రపంచ కుబేరుడు మస్క్ పలు ఆరోపణలు చేశారు. తన ట్విటర్‌ను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తే.. తాను కూడా ప్రత్యామ్నాయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీలోకి దిగుతానంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. అయితే అనూహ్యంగా తాను అపార్థం చేసున్నామనీ, ట్విటర్ ను తొలగించాలని ఎప్పుడూ అనుకోలేదంటూ ట్వీట్ చేశారు. అసలేం జరుగుతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌నునిలదీసిన మస్క్ తాజాగా తామిద్దరి మధ్యా మంచి చర్చ జరిగిందనీ, ఇతర విషయాలతోపాటు, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ట్విటర్‌ను తొలగించాలని తామెపుడూ భావించలేదని టిమ్ స్పష్టంగా చెప్పారంటూ పేర్కొన్నారు. అంతేకాదు కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో "యాపిల్ అందమైన హెచ్‌క్యూ" వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేయడం విశేషం.
Thanks @tim_cook for taking me around Apple’s beautiful HQ pic.twitter.com/xjo4g306gR
— Elon Musk (@elonmusk) November 30, 2022