ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్విటర్‌లో యాడ్స్‌ను నిలిపి వేసింది. ఇదే విషయమంపై మస్క్ స్వయంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై యాపిల్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే యాపిల్ ట్విటర్‌లో యాడ్స్ నిలిపివేడయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
యాపిల్ ట్విటర్‌లో ప్రకటనల్ని నిలిపి వేసింది. వారు అమెరికాలో వాక్ స్వాతంత్ర్యాన్ని ద్వేషిస్తారా ? టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది?’ అని ట్వీట్‌లో ప్రశ్నించారు.
యాడ్స్ తగ్గించుకుంది
యాడ్ మెజర్‌మెంట్ సంస్థ పాత్‌మాటిక్స్ నివేదిక ప్రకారం.. మస్క్ కొనుగులో చేయకముందు యాపిల్ ట్విటర్‌లో అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 22 వరకు 220,800 డాలర్లు ఖర్చు చేసింది. మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత నవంబర్ 10 నుండి నవంబర్ 16 మధ్య కాలంలో 131,600 డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది.
తాత్కాలికంగా నిలిపేస్తున్నాం.
జనరల్ మిల్స్ ఇంక్, లగ్జరీ ఆటోమేకర్ ఆడి సహా అనేక కంపెనీలు మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ప్రకటన ఖర్చుల్ని తగ్గించు కుంటున్నాయి. అయితే జనరల్ మోటార్స్ ట్విటర్‌లో యాడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.
ఆదాయం తగ్గుతోంది
కొద్ది రోజుల క్రితం మస్క్ మాట్లాడుతూ..ట్విటర్ ఆదాయంలో భారీగా తగ్గుతోందన్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో యాడ్స్ ఇవ్వకుండా ఉండేలా సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు.
Apple has mostly stopped advertising on Twitter. Do they hate free speech in America?
— Elon Musk (@elonmusk) November 28, 2022
What’s going on here @tim_cook?
— Elon Musk (@elonmusk) November 28, 2022
Comments
Please login to add a commentAdd a comment