స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు తర్వాత ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని భారీ ఎత్తున తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్‌లో 7500 మంది పని చేస్తుండగా..అందులో సగం మందికి పైగా తొలగిస్తున్నట్లు మెయిల్స్ పంపారు. ఇలా వేలాది మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించడం కొత్తేమి కాదని, సంస్థ సంక్షోభ సమయంలో యాపిల్ కో- ఫౌండర్ స్టీవ్ జాబ్ సైతం సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.
ఎలన్ మస్క్ - ట్విటర్ మధ్య కొనుగోలు ఒప్పొందం పూర్తయిన వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. వెళ్లే సమయంలో తన చేతులో ఓ సింక్ పట్టుకొని కనిపించారు. ట్విటర్ హెడ్‌క్వార్టర్స్‌లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిందే అని మస్క్ తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఆ తర్వాత రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ట్విటర్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల తొలగింపులో భాగంగా..తొలత మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెలపై వేటు వేశారు. సగానికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు.
యాపిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్
ఇలా దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేయడం తొలిసారి కాదని, యాపిల్ సైతం అర్ధాంతరంగా ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చిన 1990 నాటి చరిత్రని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అమెరికాకు చెందిన వెబ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘రూబీ ఆన్ రైల్స్’ క్రియేటర్,37 సిగ్నల్స్ కో- ఫౌండర్,సీటీవో డేవిడ్ హీనెమీయర్ హాన్సన్ నివేదిక నాడు యాపిల్ తన ఉద్యోగుల్ని తొలగించిన అంశాన్ని ప్రస్తావించింది.
యాపిల్‌ను అమ్మేయండి
1997లో యాపిల్ చిక్కుల్లో పడింది. కంపెనీ స్టాక్ 12 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్‌లో కంపెనీ విలువ పడిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో కంప్యూటర్ మ్యానిఫ్యాక్చరింగ్ విభాగంలో యాపిల్‌కు కాంపిటీటరైన ‘డెల్’ విమర్శలు చేసింది. డెల్ అధినేత మైఖేల్ డెల్ యాపిల్ సంస్థను అమ్మేసి వాటాదారులకు డబ్బును తిరిగి ఇవ్వాలని పిలునిచ్చారు. ఆ పిలుపే యాపిల్ సంస్థలో ప్రకంపనలు రేపింది. అప్పుడే యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జూలై 1997లో సంస్థలోకి తిరిగి వచ్చారు.
ఉద్యోగులపై వేటు
ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించేలా స్టీవ్ జాబ్ వచ్చీ రాగానే యాపిల్ సీఈవో గిల్ అమేలియో అడ్వైజర్‌గా జాయిన్ అయ్యారు. మైక్రోసాఫ్ట్‌తో జత కలిసి నిక్స్ ది న్యూటన్ ప్రాజెక్ట్‌పై వర్క్ చేయడం ప్రారంభించారు.ఆ మరుసటి నెలలో (ఆగస్ట్) యాపిల్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రాజెక్ట్‌లను భారీగా నిలిపివేసింది. అప్పటికి, యాపిల్ నిర్వహణ వ్యయాలను ప్రతి ఏడాది 500 మిలియన్ల మేర తగ్గించుకోవాలని భావించింది.అందుకే ఊహించని విధంగా స్టీవ్ జాబ్స్ 4,100 యాపిల్ ఉద్యోగుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వ్యత్యాసం అదే
అయితే నాటి యాపిల్ పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు స్టీవ్ జాబ్స్‌కు..మస్క్‌కు అసలు పోలికే లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చగలనని ఆలోచించేంత పిచ్చి ఉన్న మస్క్‌ను ఈ తరం ‘స్టీవ్ జాబ్స్’గా అభివర్ణిస్తుంటారు నెటిజన్లు. కానీ ఇప్పుడు వాళ్లే మస్క్ డబ్బు కోసం ఉద్యోగుల్ని తొలగించారని, స్టీవ్ జాబ్స్ సంస్థ కోసం ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు.
చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment