
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ యూజర్లకు శుభవార్త చెప్పారు. ‘ఆర్టికల్స్’ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త టూల్ సాయంతో యూజర్లు పెద్ద పెద్ద వ్యాసాలను పోస్ట్ చేసుకోవచ్చు. అంటే బుక్‌లోని సమాచారం మొత్తం ట్వీట్ చేసే వెసలుబాటు కలగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం, ట్విటర్ బ్లూ సబ్‌స్కైబర్లు 10,000 వేల అక్షరాలతో ట్వీట్ చేయొచ్చు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు 280 అక్షరాలకు లోబడి ట్వీట్ చేయాల్సి ఉంటుంది. అయితే తాజా ట్విటర్ తేనున్న ఆర్టికల్ ఫీచర్ యూజర్లు పెద్ద పెద్ద ఆర్టికల్స్‌ను సైతం ట్వీట్ చేసుకోవచ్చు.
ఈ సరికొత్త ఫీచర్‌పై ‘అవును ట్విటర్ కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ టూల్ సాయంతో పుస్తకంలో ఉన్న కంటెంట్ మొత్తాన్ని పోస్ట్ చేసేలా వీలు కల్పుస్తున్నామని వెల్లడించారు. మరి ఈ ఫీచర్‌ను ఎలాన్ మస్క్ ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేస్తారా? లేక సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తారా? అనేది తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment