కొత్త కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్స్‌కు ఊతం ఇచ్చేలా ఫాన్స్ దేశం పారిస్ నగరంలో జరుగుతున్న వివా టెక్ కాన్ఫరెన్స్‌లో ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా, 44 బిలియన్ డాలర్ల (రూ.3.37 లక్షల కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేయాలన్న తన ఆలోచనతో సమాజంలో ప్రతికూల వాతావారణం నెలకొందని అన్నారు.
అదే సమయంలో గత ఏడాది అక్టోబర్ నెలలో ట్విటర్ కొనుగోలుతో సంస్థ పట్ల తనకున్న ముందు చూపు, అనుకూల పరిస్థితుల్ని వివరించారు. ‘ ఒకవేళ నేను స్మార్ట్ అయితే, రూ.3.37 లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను ఎందుకు కొంటాను’ అంటూ చమత్కరించారు.
కొనుగోలుకు ముందు ట్విటర్ దశ - దిశలపై ఆందోళనకు గురైనట్లు చెప్పారు. అందుకే, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను సానుకూల దిశలో నడిపించాలని అనుకున్నారు. కాబట్టే ట్విటర్‌కు తానొక ముఖ్యమైన వినియోగదారుడిగా భావించి పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.
ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి నిత్య మార్పులు చేస్తూ మెరుగైన ఫలితాలను రాబట్టినట్లు సూచించారు. ఫలితంగా యూజర్లలో ట్విటర్ పట్ల సానుకూల ధోరణ ఏర్పడిందని నొక్కి చెప్పారు. ట్విటర్ 90 శాతం బాట్‌లు, స్కామ్‌లను విజయవంతంగా తొలగించిందని, అలాగే పిల్లల దోపిడీకి సంబంధించిన విషయాలను 95 శాతం తగ్గించిందని మస్క్ పేర్కొన్నారు. కాగా, జూన్ 14 నుంచి జూన్ 17 వరకు వివా టెక్ కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. ఈ కాన్ఫరెన్స్‌లో 1800 స్టార్టప్స్, 1700 మంది ఇన్వెస్టర్లు, 91,000 సందర్శకులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment